Bigg Boss Telugu 8 : ప్రతీ సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా టాప్ 5 కంటెస్టెంట్స్ కి గెలిచిన ప్రైజ్ మనీ తో ఏమి చేయబోతున్నారు అని నాగార్జున ప్రశ్నలు వేస్తాడు. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ గెలిచిన డబ్బులు మొత్తం రైతుల కోసం ఖర్చు చేస్తానని చెప్పి, బయటకి వెళ్లిన తర్వాత మాట మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో పల్లవి ప్రశాంత్ బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకున్నాడు. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ అందరూ దాని ప్రభావాన్ని బాగా అర్థం చేసుకున్నట్టు ఉన్నారు. అందుకే ఎవ్వరూ కూడా ఇష్టమొచ్చిన హామీలు ఇవ్వకుండా, నిజాయితిగా మనసులో ఉన్న మాటలను బయటపెట్టారు. ముందుగా అవినాష్ మాట్లాడుతూ ‘మా అన్నయ్య కి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ అమ్మాయి పెళ్ళికి ఖర్చు చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు. చాలా నిజాయితీగా చెప్పినట్టు అందరికి అనిపించింది.
ఇక ఆ తర్వాత ప్రేరణ మాట్లాడుతూ ‘నాకు వచ్చిన ప్రైజ్ మనీ ని నా తల్లిదండ్రుల అప్పులను మొత్తం తీర్చడానికి వాడుకుంటాను, ఆ తర్వాత వ్యాపారాల్లో పెట్టుబడి పెడతాను’ అని చెప్పుకొచ్చింది. నబీల్ మాట్లాడుతూ ‘నాకు సినిమాల్లోకి రావాలని చాలా కోరిక ఉండేది. ఒక వెబ్ సిరీస్ కూడా మొదలు పెట్టాను, కానీ డబ్బులు లేక మధ్యలోనే ఆపేసాను. నాకు వచ్చిన ప్రైజ్ మనీ లో కొంత సినిమా తీయడానికి ఉపయోగిస్తాను, మిగిలిన డబ్బులు నా కెరీర్ ని మెరుగుపరుచుకోవడానికి వాడుతాను’ అని చెప్పుకొస్తాడు. ఇక ఆ తర్వాత నిఖిల్ మాట్లాడుతూ ‘నాకు చాలా అప్పులు ఉన్నాయి. ముందు అవి తీర్చుకుంటాను. మిగిలిన డబ్బులతో మా అమ్మ నాన్న పేరిట ఒక ఇల్లు కొంటాను. నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు అద్దె ఇంట్లోనే ఉంటున్నారు’ అని చెప్పుకొచ్చాడు. ఇన్ని సీరియల్స్ చేసిన కూడా నిఖిల్ పెద్దగా సంపాదించుకోలేదని ఈ మాటలను చూసి అర్థం చేసుకున్నారు ఆడియన్స్.
గౌతమ్ మాట్లాడుతూ ‘సీజన్ 7 లో కూడా గెలిస్తే ప్రైజ్ మనీ లో 50 శాతం మా అమ్మ పేరిట డిపాజిట్ చెయ్యాలని అనుకున్నాను. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అదే చేస్తాను. ఆమెతో టీచర్ ఉద్యోగానికి రిటైర్మెంట్ చేయిస్తాను. అదే విధంగా గంగవ్వ కి 10 లక్షల రూపాయిలు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని కూడా చెప్పుకొచ్చాడు గౌతమ్. టాప్ 5 కంటెస్టెంట్స్ ఇలా మాట్లాడగా, విష్ణు ప్రియ మాత్రం తనకి వచ్చిన డబ్బులను 70 శాతం తన తోటి కంటెస్టెంట్స్ కోసం ఉపయోగించి, మిగిలిన 30 శాతం తనకోసం ఉంచుకుంటాను అని చెప్పుకొచ్చింది. ఇది చూసే ఆడియన్స్ కి చాలా బాగా అనిపించింది. విష్ణు నిజంగా టైటిల్ గెలిచి ఉంటే ఇలాగే చేసి ఉండేదని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇలా కంటెస్టెంట్స్ ప్రైజ్ మనీ తో అది చేస్తాం, ఇది చేస్తాం అని భారీ డైలాగ్స్ చెప్పకుండా చాలా సింపుల్ గా ముగించేశారు.