Bigg Boss Telugu 8: ‘ఆదిత్య ఓం’ ఎలిమినేషన్ కి కారణాలు ఇవే..మనిషి చాలా మంచోడు..కానీ ఆ ఒక్క లక్షణం ఉండుంటే వేరే లెవెల్ ఉండేది!

హౌస్ లో ఈయన ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ తన సహనం కోల్పోలేదు. అవతల వ్యక్తి తన మీద నోరేసుకొని ఇష్టమొచ్చినట్టు పడిపోయినప్పటికీ కూడా, ఆదిత్య ఓం బ్రతిమిలాడడం వంటివి మనం చూసాము. అంతే కాదు ఆయన వయస్సు దాదాపుగా 50 ఏళ్ళు ఉంటాయి. తన తోటి కంటెస్టెంట్స్ తో సమానంగా పోటీ పడి ఆడడం అసాధ్యం.

Written By: Vicky, Updated On : October 4, 2024 8:49 am

Bigg Boss Telugu 8(72)

Follow us on

Bigg Boss Telugu 8: ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాము అనేది కాదు, హౌస్ లో ఉన్నన్ని రోజులు తోటి కంటెస్టెంట్స్ తో ఎలా ప్రవర్తించాము?, కీలక సమయాల్లో మానవత్వం చూపించామా లేదా?, దాని వల్ల జనాల్లో సదరు కంటెస్టెంట్ పై పాజిటివిటీ వచ్చిందా, నెగటివిటీ వచ్చిందా అనేది చాలా ముఖ్యం. చివరి వారం వరకు హౌస్ లో కొనసాగినప్పటికీ అనేక మంది కంటెస్టెంట్స్ విపరీతమైన నెగటివిటీ ని మూటగట్టుకొని ఇంటికి తిరిగి వెళ్లడం గతంలో మనం ఎన్నో సీజన్స్ లో చూసాము. ఉదాహరణకు గత సీజన్ లో శోభా శెట్టి కి ఎంత నెగటివిటీ ఏర్పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆమె 12 వారాలు హౌస్ లో కొనసాగింది. ఫేమ్ అయితే వచ్చింది, నెగటివిటీ మాత్రం ఆమె మీద ఇప్పటికీ పోలేదు. కానీ ఆదిత్య ఓం హౌస్ లో కొనసాగింది కేవలం 5 వారాలు అయినప్పటికీ, అటు హౌస్ మేట్స్ వద్ద, బయట ఆడియన్స్ వద్ద బోలెడంత పాజిటివిటీ తన వెంట తీసుకెళ్లాడు.

హౌస్ లో ఈయన ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ తన సహనం కోల్పోలేదు. అవతల వ్యక్తి తన మీద నోరేసుకొని ఇష్టమొచ్చినట్టు పడిపోయినప్పటికీ కూడా, ఆదిత్య ఓం బ్రతిమిలాడడం వంటివి మనం చూసాము. అంతే కాదు ఆయన వయస్సు దాదాపుగా 50 ఏళ్ళు ఉంటాయి. తన తోటి కంటెస్టెంట్స్ తో సమానంగా పోటీ పడి ఆడడం అసాధ్యం. అయినప్పటికీ కూడా తన క్లాన్ కోసం అవకాశం దొరికినప్పుడల్లా తన నుండి నూటికి నూరు శాతం ఎంత ఇవ్వగలడో, అంత ఇచ్చాడు. గడిచిన నాలుగు వారాల్లో ఆయనకు క్లాన్ చీఫ్స్ టాస్కులు ఆడేందుకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. ఎందుకంటే పెద్దాయన , ఆయనేమి ఆడగలడు అనే చిన్న చూపు ఉండేది. కానీ నిఖిల్ క్లాన్ లోకి వచ్చిన తర్వాత చీఫ్ నిఖిల్ ఆదిత్య కి గేమ్స్ ఆడేందుకు అవకాశాలు ఇచ్చాడు. ఆదిత్య తనకి వచ్చిన అవకాశాలను ఈ వారం అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. హౌస్ లో అందరికంటే టాస్కులు బాగా ఆడి క్లాన్ ని గెలిపించాడు కూడా. అయినప్పటికీ ఆయన ఎలిమినేట్ అవ్వడం కాస్త బాధాకరమే. కానీ వెళ్ళేటప్పుడు తన సత్తా ఏంటో, తాను ఎలాంటి టాస్కులు ఆడగలడో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు చూపించి వెళ్ళాడు. ఇన్ని పాజిటివ్ లక్షణాలు ఉన్న ఆదిత్య ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణం, మిగిలిన కంటెస్టెంట్స్ లాగ ఆయన కంటెంట్ ఇవ్వలేకపోవడమే. దీనివల్ల చూసే ఆడియన్స్ కి అసలు ఈయన హౌస్ లోకి ఎందుకు వచ్చినట్టు అనే ఫీలింగ్ కలిగింది. అంతే కాకుండా, ఆదిత్య ఓం తనకు అన్యాయం జరుగుతున్నప్పుడు తన గొంతు ని బలంగా వినిపించలేకపోయాడు. అది కూడా ఈయన పబ్లిక్ లో హైలైట్ కాకపోవడానికి కారణం అయ్యింది.

ఏది ఏమైనా ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఆడియన్స్ కి ‘అయ్యో పాపం’ అనిపించింది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ ఆదిత్య ఎలిమినేట్ అవుతాడని తక్కువ చేసి టార్గెట్ చేసారు, ఆయనకు కూడా మనసు ఉంటుంది, అది బాధ పడుతుంది అని ఎవ్వరూ ఆలోచించలేదు, కానీ మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలాంటి ఓవర్ యాక్షన్ చేయలేదు. చిరునవ్వుతోనే స్వీకరించాడు పాపం. ఇంత మంచివాడికి ఓట్లు వేయలేకపోయామా అని ఆడియన్స్ ఇప్పుడు బాధపడుతున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ షో ద్వారా ఆదిత్య కి మంచి ఫేమ్ వచ్చింది. ఈ ఫేమ్ తో ఆయనకు సినిమా అవకాశాలు కూడా పెరుగుతుందో లేదో చూద్దాం.