https://oktelugu.com/

Bigg Boss Telugu 8: విష్ణు ప్రియ కి ఇదే చివరి వారమా? ఆమె ఓటింగ్ ఏ రేంజ్ లో పడిపోయిందో చూస్తే నోరెళ్లబెడుతారు!

ఈ వారం ఆమె నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు, ఆమె ఓటింగ్ గ్రాఫ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. మణికంఠ కంటే తక్కువ ఓటింగ్ తో ఆమె నాల్గవ స్థానం కి పడిపోయింది. బాగా గమనిస్తే ఈమెకు ప్రస్తుతం ప్రేరణ కంటే తక్కువ ఓటింగ్ ఉండొచ్చు. ఎదో ఒకరోజు ఈమెను యష్మీ కూడా ఓటింగ్ లో దాటేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 4, 2024 / 08:55 AM IST

    Bigg Boss Telugu 8(73)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు విష్ణు ప్రియ. హౌస్ లోకి వచ్చిన కొత్తల్లో ఈమె నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు అందరికంటే అత్యధిక ఓటింగ్ తో నెంబర్ 1 స్థానం లో ఉండేది. నిఖిల్ కూడా ఈమె తర్వాతి స్థానం లోనే ఉండేవాడు. కానీ మొదటి వారం ఆమె ఆట ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. దీంతో మరుసటి వారం లో ఆమె నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు రెండవ స్థానం కి పడిపోయింది. అంతే కాదు నిఖిల్ కి, విష్ణు ప్రియ కి మధ్య ఓటింగ్ తేడా కూడా బాగా పెరిగిపోయింది. ఇది గమనించిన ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం ఆమె నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు, ఆమె ఓటింగ్ గ్రాఫ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. మణికంఠ కంటే తక్కువ ఓటింగ్ తో ఆమె నాల్గవ స్థానం కి పడిపోయింది. బాగా గమనిస్తే ఈమెకు ప్రస్తుతం ప్రేరణ కంటే తక్కువ ఓటింగ్ ఉండొచ్చు. ఎదో ఒకరోజు ఈమెను యష్మీ కూడా ఓటింగ్ లో దాటేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

    అలా ఆమె గ్రాఫ్ ని ప్రతీ వారం తగ్గించుకుంటూ పోతుంది. అందుకు కారణం విష్ణు ప్రియ లో ఆడాలనే కసి లేకపోవడం, ప్రతీ విషయాన్నీ తేలికగా తీసుకోవడం, ఆట మీద కంటే ఎక్కువగా పృథ్వీ మీద శ్రద్ద పెట్టడం వంటి విషయాల కారణంగానే ఆమె ఓటింగ్ ఇంత దిగజారిపోవడానికి కారణం అయ్యింది. ఇప్పటికీ కూడా ఆమెకు హౌస్ కి చీఫ్ అవ్వాలని కానీ, టైటిల్ గెలవాలని కానీ కసి ఉండడం లేదు. ఎంతసేపు పృథ్వీ జపమే చేస్తూ కూర్చుంది. యష్మీ ఈ వారం లో ఒకరోజు పృథ్వీ తో మాట్లాడుతూ విష్ణు ప్రియ ని దగ్గరకు తీసుకోకు అని అంటుంది. అప్పటి నుండి పృథ్వీ విష్ణు ని దూరం పెడుతూ వస్తున్నాడు. కానీ ఎంత దూరం పెట్టినా కూడా, ఆత్మ విశ్వాసం లేకుండా అతని వెంటనే తిరుగుతుండడం చూసే ఆడియన్స్ కి చిరాకు కలిగించేలా చేస్తుంది.

    ఈ విషయంపై నాగార్జున ఈ వీకెండ్ లో విష్ణు ప్రియ మారేలాగా బలమైన క్లాస్ పీకితే ఆమెలో మార్పులు వచ్చి గేమ్ మీద ద్రుష్టి పెట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్స్ అయినా బయట విష్ణు ప్రియ ఆట గురించి ఏమి అనుకుంటున్నారో చెప్పి కనువిప్పు కలిగిస్తే ఆమె మారొచ్చు. ఒకవేళ అప్పటికీ కూడా ఆమె మారకుండా పృథ్వీ వెంట తిరుగుతూ ఉంటే మాత్రం ఇదే ఆమెకి చివరి వారం అవ్వొచ్చు. వచ్చే వారం ఆమె నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టాప్ 1 ఓటింగ్ తో దూసుకుపోయిన విష్ణు ఇప్పుడు ఇలా డేంజర్ జోన్ లోకి పడిపోయే రేంజ్ కి వచ్చేసింది అంటే ఆమె ఆట ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు.