Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై నిన్నటితో 3 వారాలు పూర్తి అయ్యింది. ఆద్యంతం ఉత్కంఠ భరితమైన టాస్కులతో, కంటెస్టెంట్స్ మధ్య గొడవలతో ఇప్పటి వరకు ఈ సీజన్ సూపర్ హిట్ దిశగానే అడుగులు వేస్తుంది. మూడు వారాల తర్వాత బిగ్ బాస్ హౌస్ నుండి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇది ఇలా ఉండగా నిన్న మధ్యాహ్నం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా కాసేపటి క్రితమే విడుదలయ్యాయి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లేందుకు నామినేట్ అయిన ఇంటి సభ్యులు నబీల్, సోనియా, మణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం,పృథ్వీ రాజ్. గత రెండు వారాల్లో వరుసగా రెండు సార్లు 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
కానీ ఈసారి కేవలం 6 మంది మాత్రమే నామినేట్ అవ్వడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే ఈ నామినేషన్స్ ప్రక్రియ లో సోనియా, నబీల్ మధ్య భారీ గొడవ జరిగినట్టు తెలుస్తుంది. సోనియా ఎప్పటి లాగానే తన నోటి దూలని ప్రదర్శించింది. నబీల్ క్యారక్టర్ పై కొన్ని మాటలు వదిలేసింది. కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో లో సోనియా నబీల్ తో మాట్లాడుతూ ‘సంచలాక్ గా నువ్వు కరెక్ట్ కాదు. కేవలం సంచాలకే గా మాత్రమే కాదు, మనిషిగా కూడా నువ్వు కరెక్ట్ కాదు’ అని అంటుంది. దీనిని చూసిన నెటిజెన్స్ ఈమెకి ఇంకా బలుపు తగ్గలేదు అని మాట్లాడుకుంటున్నారు. గతం లో ఆమె విష్ణు ప్రియా ని వ్యక్తిగతంగా ఈ స్థాయిలోనే కామెంట్స్ చేసింది. ఇది ఇలా ఉండగా గత వారం మొత్తం విష్ణు, ప్రేరణ మధ్య ఫైట్ నడుస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వారం కూడా విష్ణు ప్రియా ప్రేరణ ని నామినేట్ చేసింది. వీళ్లిద్దరి మధ్య కూడా వాదనలు బాగా జరిగాయి. చూస్తుంటే వీళ్ళ మధ్య గొడవ ఇప్పట్లో ఆగేలా లేదు, సీజన్ మొత్తం కొనసాగేలా ఉంది. అలాగే ఈ నామినేషన్స్ లో సీత మరియు మణికంఠ మధ్య, సోనియా మరియు యష్మీ మధ్య, అలాగే యష్మీ మరియు మణికంఠ మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తుంది.
నైనికా కూడా నామినేషన్స్ లోకి వచ్చింది కానీ, నిఖిల్ ఆమెని తనకు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో నామినేషన్స్ నుండి తప్పించి సేవ్ చేస్తాడు. అందరూ సోనియా ని నిఖిల్ సేవ్ చేస్తాడని అనుకుంటారు కానీ, నిఖిల్ నైనికా ని సేవ్ చేసి కంటెస్టెంట్స్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. మొత్తానికి నిఖిల్ సోనియా నుండి విడిపోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ వారం వీళ్లిద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం సోనియా అతి తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లో ఉంది, ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ప్రస్తుతానికి ఉన్నాయి కానీ, ఈ వారం ఆమె గేమ్ ని బాగా ఆడితే కచ్చితంగా సేవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.