Bigg Boss Telugu 8: అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 పూర్తి అయ్యి అప్పుడే 2 వారాలు అయ్యింది. మొదటి వారం బిగ్ బాస్ హౌస్ నుండి బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వగా, రెండవ వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. బేబక్క ఎలిమినేషన్ అప్పుడు ఆడియన్స్ ఎవ్వరూ అన్యాయంగా ఫీల్ అయ్యి బాధపడలేదు కానీ, శేఖర్ బాషా ఎలిమినేషన్ కి మాత్రం చాలా మంది బాధపడ్డారు. అయితే తాను కోరుకొని హౌస్ మేట్స్ చేత ఎలిమినేషన్ చేయించుకున్నాను అని, ఇందులో ఎలాంటి కుట్ర జరగలేదు అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా. మళ్ళీ రీ ఎంట్రీ అవకాశం ఉంటే కచ్చితంగా వస్తానని నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా నేడు నామినేషన్స్ హౌస్ లో చాలా హీట్ వాతావరణం మధ్య జరిగింది. గత వారం లో లాగానే ఈ వారం కూడా 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. అభయ్ ఒక క్లాన్ కి చీఫ్ అయినప్పటికీ కూడా, ఆయన కూడా ఈ నామినేషన్స్ లోకి రావడం గమనార్హం.
గత వారం అత్యధిక సభ్యులు ఉన్న క్లాన్ చీఫ్ కారణంగా యష్మీ నామినేషన్స్ నుండి తప్పించుకుంది. అయితే ఈ వారం లో ఉన్న రెండు క్లాన్స్ సరిసమానమైన సభ్యులతో ఉన్నాయి. అయినప్పటికీ కూడా అభయ్ నామినేషన్స్ లోకి వచ్చాడు. దీనికి సంబంధించిన మెలిక ఏమిటో ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి చూద్దాము. గత రెండు వారాలు విష్ణు ప్రియా నామినేషన్స్ లో ఉంది, ఆమె ఈ వారం కూడా నామినేషన్స్ లోకి వచ్చింది. ఆమె లాగానే నాగ మణికంఠ కూడా వరుసగా మూడవ వారం నామినేషన్స్ లోకి వచ్చాడు.
ఇక ప్రేక్షకులు యష్మీ ఎప్పుడు నామినేషన్స్ లోకి వస్తుందా?, ఎప్పుడు ఆమెని తరిమేద్దామా అనే ఆతృతలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చింది. ఆమెతో పాటు ప్రేరణ, కిరాక్ సీత, అభయ్ నవీన్, పృథ్వీ రాజ్ వంటి వారు కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. వీరిలో ప్రస్తుతం విష్ణు ప్రియా మరియు మణికంఠ టాప్ 2 స్థానాల్లో కొనసాగుతుండగా, యష్మీ మరియు పృథ్వీ రాజ్ డేంజర్ జోన్ లో ఉన్నారు. సోషల్ మీడియా లో జరిగే పొలింగ్స్ లో పృథ్వీ రాజ్ గత వారం లో కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. కానీ ఆయనకు కర్ణాటక నుండి భారీ ఓటింగ్ పడుతుందట. అలాగే యష్మీ కి కూడా కర్ణాటక నుండి ఓటింగ్స్ పడే అవకాశాలు ఉన్నాయట. ఈ నేపథ్యం లో వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం కష్టమే అని అంటున్నారు. పైగా ఈరోజు ఎపిసోడ్ యష్మీ కి పాజిటివ్ అయ్యేలా ఉంది, సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ.