https://oktelugu.com/

Johnny Master: వ్యాన్‌లోకి వచ్చి ప్యాంట్ విప్పి జానీ మాస్టర్ అలాంటి పనులు చేశాడా? FIR లో నమోదైన సంచలన విషయాలు!

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లో చేరి, ఆ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం లో విస్తృతంగా పర్యటించి, పలు సేవా కార్యక్రమాలు కూడా చేసాడు. అలాంటి జానీ మాస్టర్ పై నేడు ఒక యువతీ లైంగిక వేధింపులు చేశాడంటూ పోలీస్ స్టేషన్ లో కేసు వేసింది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ పై హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ FIR నమోదు అయ్యింది. ఈ FIR కాపీ లో సంచలన నిజాలు బయటపడ్డాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 16, 2024 / 04:34 PM IST

    Johnny Master

    Follow us on

    Johnny Master: గ్రూప్ డ్యాన్సర్స్ లో ఒకడిగా కెరీర్ ని ప్రారంభించిన జానీ మాస్టర్, ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా మారి నేడు ఇండియా లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రెండు సార్లు ఆయన నేషనల్ అవార్డు ని కూడా అందుకున్నాడు. అంతే కాదు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లో చేరి, ఆ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం లో విస్తృతంగా పర్యటించి, పలు సేవా కార్యక్రమాలు కూడా చేసాడు. అలాంటి జానీ మాస్టర్ పై నేడు ఒక యువతీ లైంగిక వేధింపులు చేశాడంటూ పోలీస్ స్టేషన్ లో కేసు వేసింది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ పై హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ FIR నమోదు అయ్యింది. ఈ FIR కాపీ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. తన డ్యాన్స్ బృందం లో పని చేసే అమ్మాయి పై జానీ మాస్టర్ నిత్యం లైంగిక వేధింపులు చేసేవాడట. 2019 వ సంవత్సరం లో ఢీ షో ద్వారా జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని, ఆ తర్వాత తనని మాస్టర్ టీం లోకి తీసుకున్నాడని, అవుట్ డోర్ షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి సిటీస్ తో సహా, పలు ప్రాంతాలలో తనపై లైంగిక దాడి చేసాడని, నేను ప్రతిఘటించినందుకు నాపై భౌతిక దాడి కూడా చేసాడని యువతి FIR లో పేర్కొనింది.

    తన శృంగార వాంఛలు తీర్చేందుకు తనని వివాహం చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకుంటే ఇండస్ట్రీ లో భవిష్యత్తు అనేదే లేకుండా చేస్తానని బెదిరించాడని ఆ యువతి ఈ సందర్భంగా పేర్కొనింది. ఈ విషయం లో జానీ మాస్టర్ భార్య కూడా ఆయనకీ సహాయం చేసేదని చెప్పుకొచ్చింది. క్యార వ్యాన్ లో అనేక సార్లు జానీ ప్యాంట్ విప్పి తనపై లైంగికంగా దాడి చేసాడు అంటూ ఆ FIR లోని విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ విషయంపై జానీ మాస్టర్ పేరిట ఐపీసీ సెక్షన్ 376 , 506 , 323 (2)(N) క్రింద కేసులు నమోదు అయ్యాయి. పొద్దున్న నుండి ఈ కేసు మీద సోషల్ మీడియా లో ఈ స్థాయిలో చర్చలు జరుగుతుంటే, జానీ మాస్టర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడం తో అభిమానుల్లో అనుమానాలు ఇంకా బలమయ్యాయి.

    నిజం కాకుంటే జానీ మాస్టర్ ఈపాటికి మీడియా ముందుకు వచ్చే వాడు కదా, ఎందుకు ఇంకా రాలేదు?, అసలు ఏమి జరుగుతుంది? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క జానీ మాస్టర్ జనసేన పార్టీ కి సంబంధించిన నాయకుడు కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై తక్షణమే స్పందించాలని కోరుకుంటున్నారు. మరి దీనిపై జానీ మాస్టర్ స్పందిస్తాడా లేదా అనేది చూడాలి. వైసీపీ మీడియా ఈ కేసు మీద కావాల్సినన్ని రూమర్స్ ని మరింత జోడించి నాగబాబు కి కూడా ఇందులో భాగం ఉన్నట్టుగా కథనాలు కల్పిస్తున్నారు.