https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : ‘బిగ్ బాస్’ హిస్టరీ లోనే ఈవారం అన్యాయమైన ఎలిమినేషన్..ఈ దెబ్బతో సీజన్ అట్టర్ ఫ్లాప్ అనేయొచ్చు!

ఈరోజు ఇలాంటి ఎలిమినేషన్ ఉండేది కాదు. మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి ఒకరిని సీక్రెట్ రూమ్ కి పంపే అవకాశాలు కూడా ఉన్నాయట. మరి సీక్రెట్ రూమ్ లోకి నాగ మణికంఠ వెళ్తాడా?, లేకపోతే శేఖర్ బాషా వెళ్తాడా అనేది రేపు తెలుస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2024 / 09:08 PM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లో అతి పెద్ద డిజాస్టర్ సీజన్ ఏదైనా ఉందా అంటే, అది సీజన్ 6 అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్ని విధాలుగా ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మళ్ళీ అలాంటి ఫ్లాప్ సీజన్ రాదేమో అని అనుకున్నారు అందరూ. కానీ ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 8 దానికి మించిన డిజాస్టర్ సీజన్ అయ్యేలా ఉంది. మొదటి రోజు నుండే టాస్కులలో ఎలాంటి కిక్ లేదు, కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తప్ప, ఒక్కటి కూడా ఈ సీజన్ కి సంబంధించి ఆసక్తికరమైన సందర్భం జరగలేదు. వారం వారం కి గ్రాఫ్ తగ్గుతూ పోతుంది. ఎలాంటి టాస్కులు ఆడని వారు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వని వారు హౌస్ లో దర్జాగా కొనసాగుతున్నారు. కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలోనూ, టాస్కుల విషయం లోనూ మంచి పేరు తెచ్చుకున్న శేఖర్ బాషా లాంటి కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ తొక్కేసి , ఈ వారం హౌస్ నుండి పంపేయబోతున్నాడు. అవును మీరు వింటున్నది నిజమే, ఇక నుండి శేఖర్ బాషా జోకులను వైన్ అదృష్టం ఇక పోయినట్టే.

    హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ని పంచె ఏకైక వ్యక్తి అయిన శేఖర్ బాషా ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. దీనికి సంబంధించిన షూటింగ్ రేపు జరగబోతుంది. ఆయనకి సంబంధించిన AV వీడియో ని కూడా సిద్ధం చేశారట. ఈ వారం మొత్తం శేఖర్ బాషా కి సంబంధించిన కంటెంట్ ని చూపించడం ఆపేసారు బిగ్ బాస్ టీం. అదే విధంగా టాస్కులలో కూడా శేఖర్ బాషా ని పంపలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వారం జరిగిన అన్ని ఎపిసోడ్స్ లో శేఖర్ బాషా కి సంబంధించిన కంటెంట్ 5 నిమిషాలు కూడా రాలేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. ఎంతసేపు నిఖిల్, పృథ్వీ రాజ్ మరియు సోనియా మధ్య లవ్ ట్రాక్ ని నడిపేందుకు మాత్రమే ఈ వారం కంటెంట్ మొత్తం ఉపయోగించారు.

    ఇంతటి అన్యాయమైన ఎలిమినేషన్ బహుశా ఏ సీజన్ లో కూడా మనం చూసి ఉండము. మరో షాకింగ్ విషయం ఏమిటంటే, తనని తానూ బాగా మెరుగుపర్చుకొని, నలుగురిలో కలుస్తూ, ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ లో టాస్కులను బలంగా ఆడుతున్న నాగ మణికంఠ కూడా డేంజర్ జోన్ లోకి వచ్చాడట. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని ట్విస్ట్. అసలు బిగ్ బాస్ కంటెంట్ అందరికీ ఒకలాగానే వేస్తున్నారా, లేదా ప్రత్యేకంగా కొంతమందికి వేరుగా వేస్తున్నారా?, జనాలు ఆటని చూసి ఓట్లు వేసే పనైతే, ఈరోజు ఇలాంటి ఎలిమినేషన్ ఉండేది కాదు. మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి ఒకరిని సీక్రెట్ రూమ్ కి పంపే అవకాశాలు కూడా ఉన్నాయట. మరి సీక్రెట్ రూమ్ లోకి నాగ మణికంఠ వెళ్తాడా?, లేకపోతే శేఖర్ బాషా వెళ్తాడా అనేది రేపు తెలుస్తుంది.