Bigg Boss Telugu 8 : ఇంతకు ముందు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ కి, ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ కి ఎంత వ్యత్యాసం ఉందో మనం చూస్తూనే ఉన్నాం. గత సీజన్స్ లో రేషన్ సమస్య ఉండేది కాదు, కానీ ఈ సీజన్ లో రేషన్ సంపాదించుకోవాలంటే టాస్కులు ఆడాల్సిందే. ఓడిపోయిన వారు వారం మొత్తం అన్నం లేకుండా ఉండాలి. బిగ్ బాస్ ఏది ఇస్తే అది తినాలి. గత వారం మొత్తం నిఖిల్, మణికంఠ ఆకలితోనే ఉన్నారు. మధ్యలో నిఖిల్ ఆకలి ని తట్టుకోలేక దోశ తినగా, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ లేపి, హాల్ లోకి పిలిచి రూల్స్ ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు, మొదటి తప్పు కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను అంటూ నిఖిల్ కి బలమైన వార్నింగ్ ఇస్తాడు. దీనిని బట్టి కంటెస్టెంట్స్ కి రేషన్ గెలుచుకోవడం ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది. ఇది ఇలా ఉండగా నేడు రేషన్ ని గెలుచుకునేందుకు బిగ్ బాస్ కొన్ని టాస్కులను ఇచ్చాడు.
వాటిలో ‘బూరని కొట్టు..రేషన్ పట్టు’ అనే టాస్కు బాగా హైలైట్ అయ్యింది. తమ మనసుకి నచ్చిన ఆహారాన్ని గెలుచుకోవడానికి బిగ్ బాస్ నేడు కంటెస్టెంట్స్ కి ఇచ్చిన ఆఖరి టాస్కు ఇది. ఈ టాస్కుకి సంచాలక్ గా సోనియా వ్యవహరించగా, రెండు క్లాన్స్ కి చీఫ్స్ గా వ్యవహరిస్తున్న నిఖిల్, అభయ్ పోటీ పడ్డారు. ఈ టాస్కులో నిఖిల్, అభయ్ శరీరం మొత్తానికి బెలూన్స్ ని తగిలించుకుంటారు. బిగ్ బాస్ ఆ బెలూన్స్ ని పగలగొట్టేందుకు రెండు స్పాంజి కర్రలను ఇస్తాడు. ఒక్క బాక్స్ లో మాత్రమే వీళ్ళు ఆదుకోవాలి. బాక్స్ దాటి బయటకి వస్తే అవుట్, ఇది గేమ్ రూల్. అభయ్ ఆడుతూ బాక్స్ బయటకి వచ్చేస్తాడు. సంచాలక్ గా వ్యవహరించిన సోనియా, బాక్స్ బయటకి రాకు, లోపలకు వెళ్ళు అని చెప్తుంది. కానీ అభయ్ వెళ్ళడు. లోపలకు వెళ్లకపోతే నేను నిన్ను గేమ్ నుండి తొలగిస్తాను అని అభయ్ కి వార్నింగ్ ఇస్తుంది సోనియా. అయినా కానీ అభయ్ లోపలకు వెళ్ళడు. దీంతో నిఖిల్ ని విన్నర్ గా ప్రకటిస్తుంది సోనియా.
దీనికి బాగా నొచ్చుకున్న అభయ్ కెమెరా తో మాట్లాడుతూ ‘ఆమె సంచాలక్ గా నిర్ణయం తీసేసుకుంది. నేను ఇప్పుడు ఆమెని ఏమి అనలేను. కానీ ఇక నుండి నేను తొండి ఆటలే ఆడుతాను. నన్ను కావాలంటే ఇంటి నుండి బయటకి పంపేయండి’ అని అంటాడు అభయ్. ఇక చివర్లో యష్మీ సోనియా పై అరుస్తూ ‘సంచాలక్ గా నువ్వు మరోసారి నిరూపించుకున్నావ్ సోనియా..నువ్వు చీటర్ వి’ అని అంటుంది. నిన్ననే నామినేషన్స్ లో వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే నిఖిల్ సోనియా కి ఎంత మంచి స్నేహితుడో, అభయ్ కూడా సోనియా కి అంతే మంచి స్నేహితుడు. ఇప్పుడు సోనియా, అభయ్ మధ్య గొడవ జరిగింది, దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి చూడాలి.