Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8 : నాగ మణికంఠని తొక్కలో సంచాలక్ అంటూ తిట్టిన ప్రేరణ.....

Bigg Boss Telugu 8 : నాగ మణికంఠని తొక్కలో సంచాలక్ అంటూ తిట్టిన ప్రేరణ.. తారాస్థాయికి చేరుకున్న గొడవలు!

Bigg Boss Telugu 8 : ఈ వారం బిగ్ బాస్ హౌస్ నామినేషన్స్ ఎపిసోడ్ నుండే మంచి హై తో ప్రారంభం అయ్యింది. ఈ ఎపిసోడ్ లో యష్మీ బాగా హైలైట్ అయ్యింది. నాగ మణికంఠ, ప్రేరణ వంటి వారికి ఆ ఎపిసోడ్ కాస్త మైనస్ అయ్యింది. ఇక నేడు ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా రేషన్ గురించి పలు టాస్కులు నిర్వహించాడు బిగ్ బాస్. ఈ టాస్కులలో నిఖిల్, సోనియా మరియు ప్రేరణ తన సత్తా చాటారు. కానీ ఈ టాస్కులలో కూడా కొన్ని గొడవలు జరిగాయి. దానికి సంబంధించిన ప్రోమోలను కూడా రీసెంట్ గానే విడుదల చేసారు. స్టార్ మా ఛానల్ విడుదల చేసిన రెండవ ప్రోమో లో యష్మీ మరియు పృథ్వీ కి లవ్ ట్రాక్ ఉన్నట్టుగా చూపించారు. సోనియా పృథ్వీ తో మాట్లాడుతూ ‘ఏమిరా..యష్మీ కి నీకు మధ్య ఏమి జరుగుతుంది..?, నీకు యష్మీ అంటే ఇష్టం అంట కదా’ అని అడుగుతుంది.

ఆ తర్వాత యష్మీ, నిఖిల్ మధ్య కొన్ని ఫన్నీ సంభాషణలు జరుగుతాయి. కిరాక్ సీత యష్మీ తో మాట్లాడుతూ ‘నిఖిల్ నీతో ఎప్పుడైనా పులిహోర కలిపాడా?’ అని అడగగా, దానికి యష్మీ సమాధానం చెప్తూ ‘నేనే రెండు మూడు సార్లు పులిహోర కలిపాను’ అని అంటుంది. అలా ఈ ప్రోమో సరదాగా సాగిపోతున్న సమయం లో, చివర్లో రేషన్ కి సంబంధించిన టాస్కు వస్తుంది. ఈ టాస్కు పేరు ‘నత్త లాగా సాగుకు..ఒక్కటి కూడా వదలకు’. ఈ టాస్కులో కంటెస్టెంట్స్ రేడు చేతులను వెనక్కి కట్టుకొని, క్యాబేజి ని తల దగ్గర పెట్టుకొని, పాములాగా పాకుతూ, ఆ క్యాబేజీని అవతల వైపుకు వేగంగా చేర్చాలి. ఎవరైతే ముందుగా అవతల వైపుకు క్యాబేజీని చేరుస్తారో వాళ్ళు ఈ టాస్కులో గెలిచినట్టు. ఈ టాస్కుకి సంచాలక్ గా నాగ మణికంఠ వ్యవహరించాడు. ఈ టాస్కులో నిఖిల్, ప్రేరణ మరియు సోనియా బాగా ఆడినట్టుగా ప్రోమోని చూసినప్పుడు అనిపించింది. సోనియా ని ఇన్ని రోజులు మనం నోరు పారేసుకోవడం మాత్రమే చూసాము, కానీ మొట్టమొదటిసారి ఆమె టాస్కు ఆడడం ని చూసి ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు.

పర్లేదు పాపలో విషయం ఉంది అని ఈ ప్రోమో ని చూసిన తర్వాత అర్ధమైంది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ ఇచ్చిన క్యాబేజీల సంఖ్యతోనే ఆడాలి. ఒక్కసారి ఉపయోగించిన క్యాబేజీని మళ్ళీ ఉపయోగించరాదు. కానీ ప్రేరణా కి క్యాబేజిలు అయిపోవడం తో సంచాలక్ గా వ్యవహరిస్తున్న నాగ మణికంఠ ని అడుగుతుంది. మీకిచ్చిన క్యాబేజీలతోనే ఆదుకోవాలి అని అంటాడు నాగ మణికంఠ, అది చెప్పడానికి నువ్వు ఎవరు అని అంటుంది ప్రేరణా, నేను సంచాలక్ ని అని నాగ మణికంఠ బదులు ఇవ్వగా, తొక్కలో సంచాలక్ అంటూ ప్రేరణా మణికంఠ పై రెచ్చిపోతుంది. ఈ విషయంలో ప్రేరణ బాగా ఓవర్ యాక్షన్ చేసిందని ప్రేక్షకులకు అనిపించింది.

Bigg Boss Telugu 8 | Day 16 - Promo 2 | Housemates filled with Emotion ❤️ | Star Maa

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version