https://oktelugu.com/

Johnny Master : జానీ మాస్టర్ మీద కేసు పెట్టించడం వెనుక ఆ స్టార్ హీరో హస్తం ఉందా..? ఒక్క ప్లాన్ ప్రకారం తొక్కేసారుగా!

ఈ పాటకి జానీ మాస్టర్ నేషనల్ అవార్డు ని అందుకున్నాడు. తన సినిమాలకు అలాంటి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ని అల్లు అర్జున్ ఇలా ఎందుకు చేస్తాడు?, అసలు ఏమైంది అనేది తెలియాల్సి ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 17, 2024 / 10:13 PM IST

    Johnny Master(1)

    Follow us on

    Johnny Master : ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై శ్రేష్ఠి వర్మ అనే యంగ్ కొరియోగ్రాఫర్ తన పై లైంగిక వేధింపులు చేసారు అంటూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఘటన ఇండస్ట్రీ లో పెను దుమారం రేపింది. ఎందుకంటే జానీ మాస్టర్ కేవలం టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్ లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు. రెండు సార్లు నేషనల్ అవార్డు దక్కించుకున్న నేటి తరం ఏకైక కొరియోగ్రాఫర్ ఆయన. కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయంలో ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం పెను దుమారం రేపింది. ఈ సంఘటన లో నిజానిజాలు ఏంటో తెలుసుకునేందుకు మీడియా ఆయనను సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ జానీ మాస్టర్ అజ్ఞాతం లో ఉన్నాడు. కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా స్పందిస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆయన మౌనం వహించాడు. ఈ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?, అంటే శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్ మీద చేసిన ఆరోపణలు మొత్తం నిజమేనా?, తనపై ఎప్పుడు రూమర్స్ వచ్చిన వెంటనే స్పందించే జానీ మాస్టర్ ఎందుకు ఇప్పటి వరకు మౌనం వహించాడు.

    తాను ఎంతో ఇష్టపడి చేరిన జనసేన పార్టీ కూడా జానీ మాస్టర్ ఎదురుకుంటున్న ఆరోపణలకు స్పందించి, పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఎంతో కొంత నిజమైన సమాచారం పార్టీ వాళ్ళ దగ్గర లేకుంటే జానీ మాస్టర్ ని ఇలా సస్పెండ్ చేయరు కదా అనేది అభిమానుల నుండి వస్తున్న ప్రశ్న. ఇదంతా పక్కన పెడితే జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్. అంతే కాదు, డ్యాన్సర్స్ అస్సోసియేషన్ కి ఆయన ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యం లో శ్రేష్ఠి వర్మ లాంటి చిన్న అసిస్టెంట్ డ్యాన్సర్ కి జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్ పై పోలీస్ కేసు పెట్టేంత ధైర్యం ఉండదు. అంత ధైర్యమే ఉంటే ఆమె ఎప్పుడో పెట్టి ఉండేది. ఆమె వెనుక ఇప్పుడు పెద్దవాళ్ళు ధైర్యం ఇవ్వడం వల్లే జానీ మాస్టర్ మీద కేసు పెట్టారు అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈ సంఘటన తెలిసిన వెంటనే గీత ఆర్ట్స్ నుండి శ్రేష్ఠి వర్మ కి అవకాశాలు మేము ఇస్తాము అంటూ ముందుకు వచ్చారు.

    ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే తన సినిమాలకు శ్రేష్ఠి వర్మ కి పని చేసే అవకాశం ఇస్తాను అంటూ ముందుకు వచ్చాడు. చూస్తుంటే శ్రేష్ఠి వర్మ కి అండగా నిలబడి, జానీ మాస్టర్ పై కేసు వేయించడం వెనుక అల్లు అర్జున్ హస్తం ఉందని అంటున్నారు. అయినా అల్లు అర్జున్ కి అంత అవసరం ఏముంది?, ఆయనకీ ఎన్నో అద్భుతమైన డ్యాన్స్ నంబర్స్ ఇచ్చాడు జానీ మాస్టర్. ముఖ్యంగా ‘బుట్ట బొమ్మ’ సాంగ్ నేషనల్ లెవెల్ లో ఎలా హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ పాటకి జానీ మాస్టర్ నేషనల్ అవార్డు ని అందుకున్నాడు. తన సినిమాలకు అలాంటి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ని అల్లు అర్జున్ ఇలా ఎందుకు చేస్తాడు?, అసలు ఏమైంది అనేది తెలియాల్సి ఉంది.