Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో చాలా అన్యాయమైన ఎలిమినేషన్స్ జరిగాయి. కంటెస్టెంట్స్ కి దక్కాల్సిన ప్రతిఫలాలు దక్కలేదు. ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేషన్స్ జరిపారు. ప్రస్తుతం ఉన్న అధికారిక ఓటింగ్ ప్రకారం నిఖిల్, గౌతమ్,నబీల్ తర్వాత నాల్గవ స్థానంలో పృథ్వీ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానం లో ప్రేరణ, విష్ణు ప్రియ ఉండగా, చివరి రెండు స్థానాల్లో అవినాష్, టేస్టీ తేజ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఓటింగ్ ప్రకారం నిన్న టేస్టీ తేజ వెళ్ళిపోయాడు, నేడు న్యాయంగా అయితే అవినాష్ వెళ్ళిపోవాలి. కానీ అది జరగలేదు, ఓటింగ్ లో నాల్గవ స్థానంలో ఉన్నటువంటి పృథ్వీ ని ఎలిమినేట్ చేసారు. ఈ సీజన్ లో దమ్ము దమ్ముగా టాస్కులు ఆడిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది పృథ్వీ మాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే నిఖిల్ కంటే పృథ్వీ తోపు కంటెస్టెంట్.
టాస్కుల్లో నిఖిల్ ని ఓడించేంత సత్తా ఉన్నోడు ఈయన. కానీ ఇసుమంత అదృష్టం కూడా లేకపోవడంతో ఒక్కసారి కూడా హౌస్ లో చీఫ్ కానీ, మెగా చీఫ్ కానీ అవ్వలేకపోయాడు. అతని కష్టాన్ని హౌస్ గుర్తించకపోయి ఉండొచ్చేమో కానీ, ఆడియన్స్ గుర్తించారు. ఈ సీజన్ లో 13 వారాలు అతను హౌస్ లో ఉంటే 11 వారాలు అతను నామినేషన్స్ లోకి వచ్చాడు. ఈ 11 వారాలు కూడా అతన్ని సేవ్ చేస్తూ వచ్చారు ప్రేక్షకులు. ఈ వారం కూడా అవినాష్ కి టికెట్ టు ఫినాలే రావడం వల్లే పృథ్వీ వెళ్లిపోవాల్సి వస్తుంది కానీ, తక్కువ ఓట్లు రావడం వల్ల మాత్రం కాదనే విషయాన్నీ మీరంతా గమనించాలి. ఇదంతా పక్కన పెడితే పృథ్వీ కి బిగ్ బాస్ టీం చేసిన న్యాయం ఏదైనా ఉందా అంటే, అతనికి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వడమే. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పృథ్వీ కి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్స్ అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ దక్కినట్టు తెలుస్తుంది.
13 వారాలు ఆయన హౌస్ లో కొనసాగినందుకు గానూ ఆయనకీ ఏకంగా 32 లక్షల రూపాయిలు ఇచ్చారట. ఇది మామూలు విషయం కాదు. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరికి నాగార్జున సూట్ కేసు ఆఫర్ ఇస్తుంటాడు గుర్తుందా, వాళ్లకు కూడా ఈ రేంజ్ ప్రైజ్ మనీ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. పృథ్వీ రాజ్ సీరియల్ హీరో అవ్వడం వల్ల ఆయనకీ వారానికి రెండున్నర లక్షలు ఇవ్వడానికి బిగ్ బాస్ టీం అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. అయితే ఈ 32 లక్షలు పూర్తిగా ఇచ్చేయరు, ఇందులో జీఎస్టీ, ఎంటర్టైన్మెంట్ టాక్స్ కట్టింగ్స్ కూడా ఉంటాయి. ఏది ఏమైనా పృథ్వీ ఆట తీరుకి ఆయన కచ్చితంగా టాప్ 5 లో ఉండాలి, కానీ అది మాత్రం జరగలేదు. ఇది కచ్చితంగా బాధపడాల్సిన విషయమే.