Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు రోహిణి కచ్చితంగా పొరపాటున నక్క తోక తొక్కి వచ్చింది అని అనిపిస్తుంది. ఈమెకు దొరికినన్ని అదృష్టాలు బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కి కూడా దొరకలేదు అని చెప్పొచ్చు. అలా అని ఈమెకు టాలెంట్ లేకుండా, ఎలాంటి టాస్కులు ఆడకుండా అయితే హౌస్ లో ఉండలేదు. ఒక పక్క అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని పంచి ఆడియన్స్ ని నవ్విస్తూనే, టాస్కుల విషయంలో శివంగి లాగా రెచ్చిపోయి ఆడింది. కానీ ఇప్పటి వరకు ఆమె ఒక్కసారి కూడా నామినేషన్ ని ఎదురుకోలేదు, అందుకే ఆమెని అదృష్టవంతురాలు అని సంబోధిస్తున్నాము. 8 వారాల నుండి హౌస్ లో కొనసాగుతూ ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి రాకుండా ఉండడం అంటే సాధారణమైన విషయం కాదు. అయితే వచ్చే వారంలో కూడా ఈమె నామినేషన్స్ లోకి వచ్చే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
వచ్చే వారంలోనే టాప్ 5 లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారు అనేది ఖరారు కాబోతుంది. అయితే ఈ వారం లో రోహిణి కి ఒక స్పెషల్ పవర్ ద్వారా నామినేషన్స్ లోకి రాకుండా నేరుగా టాప్ 5 లోకి వెళ్లే అవకాశం ఇవ్వబోతున్నారట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. నిన్న హౌస్ లో నాగార్జున బ్లాక్ టికెట్స్, గోల్డెన్ టికెట్స్ అని కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు. గౌతమ్, రోహిణి, నిఖిల్, అవినాష్ లకు గోల్డెన్ టికెట్స్ ఇవ్వగా, మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ బ్లాక్ టికెట్స్ ఇచ్చారు. ఈ గోల్డెన్ టికెట్స్ ద్వారానే రోహిణి కి స్పెషల్ పవర్ రాబోతుందని సమాచారం. ఇదే కనుక జరిగితే బిగ్ బాస్ హిస్టరీ లో ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాకుండా నేరుగా టాప్ 5 లోకి వెళ్లిన కంటెస్టెంట్ గా రోహిణి చరిత్ర సృష్టించిన కంటెస్టెంట్ గా నిలుస్తుంది.
అంతే కాదు టాప్ 5 లో గౌతమ్ తో కలిపి ఏకంగా ముగ్గురు వైల్డ్ కార్డ్స్ కూడా ఉంటారు. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో టాప్ 5 అత్యధిక వైల్డ్ కార్డ్స్ ఉన్న సీజన్ గా బిగ్ బాస్ 8 నిలవబోతుంది. ఇందులో గౌతమ్ ఒక్కడే ఆడియన్స్ ఓటింగ్ తో టాప్ 5 లో ఉన్నాడు. మిగిలిన ఇద్దరు కూడా అదృష్టం ని తమ వెంటపెట్టుకొని అయ్యారు. ఒకవిధంగా చెప్పాలంటే వీళ్లకు న్యాయం జరిగింది అని చెప్పొచ్చు, అదే విధంగా పాత కంటెస్టెంట్స్ కి అన్యాయం కూడా జరిగింది అని చెప్పొచ్చు. పృథ్వీ ని అన్యాయంగానే ఎలిమినేట్ చేసారు. ఆడియన్స్ ఓటింగ్ తో కాకుండా బిగ్ బాస్ టీం కి నచ్చినట్టుగా వైల్డ్ కార్డు రోహిణి ని టాప్ 5 లోకి పంపబోతున్నారు. దీని ప్రభావం ప్రేరణ, విష్ణు ప్రియ మీద పడబోతోంది. ఎందుకంటే వచ్చే వారం వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు.