https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన టేస్టీ తేజ గ్రాఫ్..డేంజర్ జోన్ నుండి సేఫ్..బాటమ్ లోకి వచ్చిన టాప్ కంటెస్టెంట్!

సోమవారం రోజు జరిగిన నామినేషన్స్ లో ఓజీ క్లాన్ మొత్తం టేస్టీ తేజ ని టార్గెట్ చేసి నామినేట్ చేయడం. ఆ సమయం లో తేజ తనని తాను డిఫెండ్ చేసుకుంటూ చివరి నిమిషం వరకు నామినేషన్స్ లోకి రాకుండా పోరాడడం వంటి సంఘటనలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 17, 2024 / 08:37 AM IST

    Bigg Boss Telugu 8(124)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ షో లో ఉన్న కంటెస్టెంట్స్ గ్రాఫ్ రోజు రోజుకి మారిపోతూ ఉంది. టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్ గ్రాఫ్ ఒక్కసారిగా తగ్గిపోవడం, తక్కువ ఓటింగ్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కసారిగా డేంజర్ జోన్ నుండి బయటకి రావడం వంటివి జరుగుతున్నాయి. ప్రతీ వారం కంటెస్టెంట్స్ గ్రాఫ్ లో అన్నొహ్యమైన మార్పులు వస్తున్నాయి. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి పృథ్వీ, యష్మీ, నిఖిల్, ప్రేరణ, టేస్టీ తేజ, నభీల్, గౌతమ్ , మణికంఠ మరియు హరి తేజ నామినేట్ అయ్యారు. వీరిలో ఈ వారం ప్రారంభంలో టేస్టీ తేజ అందరికంటే తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉండగా, నిఖిల్ అందరి కంటే అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అయితే కంటెస్టెంట్స్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోవడానికి ఒక్క ఎపిసోడ్ చాలు అని టేస్టీ తేజ విషయం లో రుజువు అయ్యింది.

    సోమవారం రోజు జరిగిన నామినేషన్స్ లో ఓజీ క్లాన్ మొత్తం టేస్టీ తేజ ని టార్గెట్ చేసి నామినేట్ చేయడం. ఆ సమయం లో తేజ తనని తాను డిఫెండ్ చేసుకుంటూ చివరి నిమిషం వరకు నామినేషన్స్ లోకి రాకుండా పోరాడడం వంటి సంఘటనలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. తేజ తన వద్దనున్న పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా పెట్టిన విధానం కి కిల్లర్ గర్ల్స్ అతన్ని నామినేషన్ లోకి పంపలేకపోయారు, ఆ స్థాయిలో మాట్లాడాడు ఆయన. బిగ్ బాస్ సీజన్స్ ని మొదటి నుండి చూసేవారికి ఈ విషయం చాలా తేలికగా అర్థం అవుతుంది. తేజా స్థాయిలో నామినేషన్స్ సమయంలో డిఫెండ్ చేసుకున్న కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీ లోనే లేరని. దీంతో అందరికంటే తక్కువ ఓటింగ్ తో చివర్లో ఉన్న తేజ, ఇప్పుడు 7 వ స్థానం లోకి వచ్చాడు. ఒక్కసారి నిఖిల్ అందరికంటే టాప్ ఓటింగ్ తో ఉన్నాడు. ఆ తర్వాత నభీల్ రెండవ స్థానంలో కొనసాగుతుండగా, మణికంఠ మూడవ స్థానంలో, గౌతమ్ నాల్గవ స్థానం లో, ప్రేరణ 5వ స్థానంలో, యష్మీ ఆరవ స్థానం లో, టేస్టీ తేజ 7 వ స్థానంలో, పృథ్వీ 8వ స్థానం లో, హరితేజ 9వ స్థానం లో కొనసాగుతున్నారు.

    ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే హరితేజ ఈ వారం ఎలిమినేట్ అవ్వాలి. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ కూడా హరితేజ తో పాటు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సోనియా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఆమె రీ ఎంట్రీ ఖరారు అయితే కచ్చితంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఒకవేళ సోనియా వస్తే హౌస్ లో ఎలాంటి గందరగోళం వాతావరణం ఉంటుందో ఊహించుకోవచ్చు. బిగ్ బాస్ కచ్చితంగా ఆమెను రాయల్ క్లాన్ కి పంపుతాడు. రాబోయే రోజుల్లో టాస్కులు కఠినంగా ఉంటాయి. అప్పుడు నిఖిల్, సోనియా మధ్య గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.