Bigg Boss Telugu 8: టాస్క్ లో ఈ వారం మణికంఠ డిజాస్టర్..క్లాన్ మొత్తం కష్టపడుతుంటే హరితేజ తో ముచ్చట్లు..దారుణంగా పడిపోయిన గ్రాఫ్!

ప్రభావతి ఎగ్స్ టాస్క్ లో నిఖిల్ మణికంఠ ని విసిరి అవతలకి కొట్టినప్పటికీ కూడా, మళ్ళీ తేరుకొని టాస్కు ఆడిన మణికంఠ ఇంత తేలికగా ఈ టాస్కు ని వదిలేయడానికి కారణం ఏమిటి?, అంటే అప్పట్లో అతని గ్రాఫ్ పబ్లిక్ లో ఎలా ఉంది అనేది తెలియదు కాబట్టే అలా ఆడాడు.

Written By: Vicky, Updated On : October 17, 2024 8:34 am

Bigg Boss Telugu 8(123)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి సానుభూతి కార్డు ని వాడుతూ హౌస్ లో నెట్టుకొచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మణికంఠ మాత్రమే. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లోపలకు వచ్చి ఇతని గ్రాఫ్ బయట వేరే లెవెల్ లో ఉంది అని చెప్పడంతో, మణికంఠ పొగరు ఇంకా పెరిగిపోయింది. ఇక సానుభూతి కార్డు వాడాల్సిన అవసరం లేదు, టాస్కులు కూడా ఓవర్ గా ఆడాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడేమో, ఈ వారం ఇరు క్లాన్స్ కి మధ్య జరిగే హోరాహోరీ పోరులో నేను ఫిజికల్ టాస్కులు ఆడలేను, నా బొక్కలు విరగ్గొట్టుకోవాలని అనుకోవడం లేదు, నేను నా స్కోప్ లో ఎంత వరకు ఆడగలనో, అంత వరకే ఆడుతాను అంటూ విష్ణు ప్రియా కి చెప్తాడు.

ప్రభావతి ఎగ్స్ టాస్క్ లో నిఖిల్ మణికంఠ ని విసిరి అవతలకి కొట్టినప్పటికీ కూడా, మళ్ళీ తేరుకొని టాస్కు ఆడిన మణికంఠ ఇంత తేలికగా ఈ టాస్కు ని వదిలేయడానికి కారణం ఏమిటి?, అంటే అప్పట్లో అతని గ్రాఫ్ పబ్లిక్ లో ఎలా ఉంది అనేది తెలియదు కాబట్టే అలా ఆడాడు, ఇప్పుడు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ద్వారా బయట విషయాలు తెలుసుకున్నాడు కాబట్టి ఆడినా ఆడకపోయినా పర్వాలేదు, నాకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది, ఓట్లు సహజంగానే పడుతాయి అనే నిర్లక్యంతో గేమ్ ని తేలికగా తీసుకున్నాడు అని అనుకోవచ్చా..?, ఇతని లాగానే ఫిజికల్ గా బలహీనంగా ఉండే యష్మీ అంత బలంగా ఆడుతుంది కదా, పాపం ఆమెకు దెబ్బలు కూడా తగిలాయి, అమ్మాయి అయ్యుండి అంతలా పోరాడుతుంటే, అబ్బాయి అయ్యుండి ఇలా వదిలేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది, ఇతన్ని ఇంకా నమ్మి ఓట్లు వేస్తున్న వాళ్ళే చెప్పాలి. ఇతను నిన్నటి ఎపిసోడ్ ని ఎంత తేలికగా తీసుకున్నాడో మరో ఉదాహరణ కూడా ఉంది. హరితేజ ఇతని వద్దకు వచ్చి నాకు ఛార్జింగ్ కావాలి అని అడుగుతుంది. అప్పుడు మణికంఠ ‘నన్ను పొగుడుతూ హరి కథ చెప్పు..అప్పుడు ఆలోచిస్తా’ అని అంటాడు. అప్పుడు హరితేజ ఈయన గారి గురించి ఒక పెద్ద హరి కథ చెప్తుంది.

దానికి పొంగిపోయిన మణికంఠ, ఆమెకు నిమిషం పాటుగా ఛార్జింగ్ ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు. హరితేజ బ్యాటరీ ఒక్క పాయింట్ పైకి ఎక్కుతుంది. అయితే బిగ్ బాస్ ఫన్ మీద ఛార్జింగ్ పెట్టుకోరాదు, దానికి పాయింట్స్ జతచేయబడవు అని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. దీంతో హరితేజ బ్యాటరీ ఒక పాయింట్ తగ్గిపోతుంది. అవతల కంటెస్టెంట్స్ మొత్తం రక్తాలు చిందిస్తూ తమ సొంత టీం కోసం ఆడుతుంటే, ఈ సింపతీ స్టార్ ఓజీ క్లాన్ లో ఉంటూ రాయల్ క్లాన్ కి సపోర్టు చేస్తున్నాడు. మొదటి నుండి ఇతను ఇలాగే టీం గా గేమ్ ని ఆడకుండా, అవతల క్లాన్ కోసం ఆడుతూ వచ్చాడు, అసలు ఇతని స్కీం ఏంటో, ప్లాన్ ఏంటో, ఇతనికి ఓట్లు వేసేవాళ్లకు నిజంగా దండం పెట్టొచ్చు.