Bigg Boss telugu 8: నిఖిల్ కి క్లాస్ పీకిన సోనియా..యష్మీ ని క్లాన్ నుండి బయటకి నెట్టేయడానికి మాస్టర్ ప్లాన్!

'కాంతారా' క్లాన్ నిండిపోవడం తో ప్రేరణ ని బిగ్ బాస్ 'శక్తి' క్లాన్ లోకి వెళ్ళమంటాడు, కానీ ప్రేరణ 'ఆమ్మో!..వాళ్ళ క్లాన్ లోకి వెళ్లి నేను తట్టుకోలేను' అని మనసులో అనుకుంటుంది. నేను వెళ్ళలేను, నా పేరు చివర్లో పిలవండి, అప్పుడు ఛాయస్ నాది అవుతుంది కాబట్టి నేను కాంతారా టీం లోకి వెళ్తాను అని అంటుంది.

Written By: Vicky, Updated On : September 26, 2024 9:12 am

Bigg Boss Telugu 8(48)

Follow us on

Bigg Boss telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ లో నిఖిల్ టైటిల్ విన్నింగ్ రేస్ లోకి వచ్చాడు అని అనుకున్న ప్రతీసారి సోనియా విషయం లో వీక్ అవుతూ దిగజారి పోతున్నాడు. టాస్కుల విషయం లో అతను కింగ్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ బిగ్ బాస్ టైటిల్ గెలిచే రేంజ్ కి రావాలంటే టాస్కులు ఆడడం ఒక్కటే సరిపోదు. అన్ని విషయాల్లోనూ జనాలకు నచ్చాలి. కానీ నిఖిల్ సోనియా తో సావాసం చేసి కన్నింగ్ గా తయారు అవుతున్నాడు. ప్రారంభం లో నిఖిల్ ని హౌస్ మేట్స్ అందరూ బాగా నచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ ద్వేషిస్తున్నారు. అతని క్లాన్ లోకి వచ్చేందుకు ఎవ్వరూ ఇష్టపడలేదు. మొదటి నుండి ఆయన సోనియా, పృథ్వీ రాజ్ తో ప్రయాణిస్తూ వచ్చాడు. కాబట్టి వాళ్ళు మాత్రమే ఆ క్లాన్ లోకి వెళ్లారు.

‘కాంతారా’ క్లాన్ నిండిపోవడం తో ప్రేరణ ని బిగ్ బాస్ ‘శక్తి’ క్లాన్ లోకి వెళ్ళమంటాడు, కానీ ప్రేరణ ‘ఆమ్మో!..వాళ్ళ క్లాన్ లోకి వెళ్లి నేను తట్టుకోలేను’ అని మనసులో అనుకుంటుంది. నేను వెళ్ళలేను, నా పేరు చివర్లో పిలవండి, అప్పుడు ఛాయస్ నాది అవుతుంది కాబట్టి నేను కాంతారా టీం లోకి వెళ్తాను అని అంటుంది. చివరికి మణికంఠ కూడా నిఖిల్ క్లాన్ లోకి వెళ్లాలని కోరుకోడు. నేను కాంతారా టీం లోకి వెళ్తాను, ఎవరైనా ఆ క్లాన్ లో షిఫ్ట్ అవ్వండి అని కోరుకోగా, ఎవ్వరు ఒప్పుకోరు, దీంతో మణికంఠ అయిష్టంగానే నిఖిల్ క్లాన్ లోకి వెళ్తాడు. ఇలా నిఖిల్ క్లాన్ అంటేనే భయపడి పారిపోవడానికి కారణం సోనియా. పేరుకి నిఖిల్ చీఫ్ కానీ, ఆ క్లాన్ లో ఆయన సోనియా చేతిలో ఆట బొమ్మ. ఆమె ఏది చెప్తే అదే నిఖిల్ చేయాలి. నేడు మణికంఠ ని ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్’ టాస్కులో తప్పించినందుకు నిఖిల్ కి ఒక గంటసేపు క్లాస్ పీకుతోంది సోనియా. ఇది టెలికాస్ట్ లో చూపించలేదు కానీ, లైవ్ లో మాత్రం చూపిస్తారు. సోనియా నిఖిల్ తో మాట్లాడుతూ ‘నేను యష్మీ ని తొలగించమని నీకు సిగ్నల్స్ కూడా ఇచ్చాను కదా, ఎందుకు తొలగించలేదు, మణికంఠ ని ఎందుకు తొలగించావు’ అని అంటుంది.

అప్పుడు నిఖిల్ ‘నా మనసులో కూడా యష్మీ పేరునే చెప్పాలని ఉన్నింది. కానీ మణికంఠ నే గేమ్ నుండి తప్పుకుంటాను అని చెప్పాడు, ఇక నేనేం చేయగలను’ అని అంటాడు నిఖిల్. అలా వీళ్ళ మధ్య చర్చలు నడుస్తూ ఉంటాయి, యష్మీ ని తమ క్లాన్ నుండి ఎలా తప్పించాలి అనే దానిపై చర్చించుకున్నారు. చూసేందుకు రేలంగి మావయ్య లాగా అనిపించే నిఖిల్ కూడా కన్నింగ్ ఆలోచనలు చేస్తుండడం ఆయన అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. సోనియా నిఖిల్ ఆట ని మొత్తం తినేస్తుంది, ఇలాగే కొనసాగితే నిఖిల్ కి ఓట్లు వేయడం ఆపేస్తాము అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.