https://oktelugu.com/

Bigg Boss Telugu 8: మణికంఠ ని వదిలించుకున్న శక్తి టీం..అక్కా అని పిలిచినందుకు వెన్నుపోటు పొడిచిన సోనియా!

'శక్తి' టీం ఓడిపోవడం తో ఆ క్లాన్ నుండి ఒకరిని తప్పించాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశిస్తాడు. క్లాన్ సభ్యులందరు ఒక దగ్గర కూర్చొని ఎవరిని తప్పించాలి అనే దానిపై చర్చిస్తారు. ఈ చర్చ లో ముందుగా యష్మీ మణికంఠ ని తప్పించాల్సిందిగా తన అభిప్రాయం చెప్తుంది. ఎందుకంటే ఆమెకు మణికంఠ నచ్చడం లేదు, సోనియా కూడా ఆమెకు నచ్చదు కానీ ఆమె మొదటి ఛాలెంజ్ లో బాగా ఆడింది కాబట్టి, ఆమెని తప్పించుకుందా మణికంఠ ని తెప్పిస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 26, 2024 / 09:07 AM IST

    Bigg Boss Telugu 8(47)

    Follow us on

    Bigg Boss Telugu 8: నేడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఊహించని షాకింగ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లోకి 12 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని, వాళ్ళు లోపలకు వచ్చిన తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయని, కాబట్టి బిగ్ బాస్ మీకు వాళ్ళను హౌస్ లోకి రాకుండా అడ్డుకునేందుకు ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ ఛాలెంజ్ ఇస్తామని, రాబోయే రెండు వారాల్లో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉన్నందున ఈ వారం లో 12 టాస్కులు ఇస్తామని, ఆ 12 టాస్కులు గెలిచి వైల్డ్ కార్డు ఎంట్రీలను అడ్డుకోండి అంటూ బిగ్ బాస్ చెప్తాడు.అందులో భాగంగా ముందుగా ‘బాలు పట్టు..టవర్ లో పెట్టు’ అనే టాస్కు ని ఇరు క్లాన్ సబ్యులకు పెడుతాడు. సీత ఈ టాస్కు కి సంచాలక్ గా వ్యవహరిస్తుంది. ఈ టాస్కు లో కాంతారా టీమ్ గెలుస్తుంది.

    ‘శక్తి’ టీం ఓడిపోవడం తో ఆ క్లాన్ నుండి ఒకరిని తప్పించాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశిస్తాడు. క్లాన్ సభ్యులందరు ఒక దగ్గర కూర్చొని ఎవరిని తప్పించాలి అనే దానిపై చర్చిస్తారు. ఈ చర్చ లో ముందుగా యష్మీ మణికంఠ ని తప్పించాల్సిందిగా తన అభిప్రాయం చెప్తుంది. ఎందుకంటే ఆమెకు మణికంఠ నచ్చడం లేదు, సోనియా కూడా ఆమెకు నచ్చదు కానీ ఆమె మొదటి ఛాలెంజ్ లో బాగా ఆడింది కాబట్టి, ఆమెని తప్పించుకుందా మణికంఠ ని తెప్పిస్తుంది. నిఖిల్, పృథ్వీ ఫిజికల్ గా బాగా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు క్లాన్ లో కచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశ్యం తో ఆమె మణికంఠ పేరు చెప్తుంది. ఇక సోనియా మనసులో యష్మీ మీద పీకల దాకా పగ ఉంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే సోనియా గేమ్ ప్లాన్ మొత్తం బట్టబయలు చేసింది కాబట్టి. అయితే ఆమె యష్మీ పేరు చెప్తే ఎక్కడ మళ్లీ తన మీదకు ఎక్కేస్తుందో అనే భయం తో మణికంఠ పేరు చెప్తుంది. వాస్తవానికి మణికంఠ కి సోనియా కి మధ్య మంచి రిలేషన్ ఉంది. సోనియా ని మణికంఠ ప్రేమగా అక్కా అని పిలుస్తాడు.

    అయినప్పటికీ కూడా మణికంఠ పేరు చెప్తుంది. వెన్నుపోటు పొడవడం అంటే ఇదే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు. ఇక పృథ్వీ కూడా ‘నేను, నిఖిల్ స్ట్రాంగ్ కాబట్టి ఫిజికల్ టాస్కులు బాగా ఆడగలము. అవతల టీం లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ టీం లో కనీసం ఇద్దరు అమ్మాయిలు అయినా ఉండాలి కాబట్టి నేను మణికంఠ పేరు చెప్పాలని అనుకుంటున్నాను’ అని అంటాడు. ఇక చివరికి మణికంఠ కూడా క్లాన్ గెలుపు ముఖ్యం కాబట్టి నేనే తప్పుకుంటున్నాను, కానీ ఓడిపోతే మాత్రం మీ అందరిని నామినేషన్స్ లో వేసేస్తా అని అంటాడు. అలా సొంత క్లాన్ సభ్యులు మొత్తం మణికంఠ ని వదిలిందుకున్నారు.