Bigg Boss Telugu 8: ప్రేరణ పై పీకల దాకా పగ పెంచేసుకున్న సీత, విష్ణు ప్రియ.. ఇంత చెత్త నామినేషన్ బిగ్ బాస్ హిస్టరీ లోనే లేదు!

నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం ఆమె కేవలం ప్రేరణ ని నామినేషన్స్ లో పెట్టాలి అనే ఉద్దేశ్యంతోనే తోనే సిల్లీ పాయింట్స్ తో నామినేట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 'దోశ' విషయం లో జరిగిన గొడవను విష్ణు ప్రియ మనసులో చాలా బలంగా పెట్టుకుంది. అందుకే నేడు ఏ పాయింట్ తన వద్ద లేకపోయినా కూడా ప్రేరణ ని నామినేట్ చేసింది.

Written By: Vicky, Updated On : September 24, 2024 8:12 am

Bigg Boss Telugu 8(38)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో మహానటి ట్యాగ్ విష్ణు ప్రియా కి సరిగ్గా సూట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారం మొత్తంలో సోమవారం నుండి శుక్రవారం వరకు ఒక విష్ణు ని చూడొచ్చు, వీకెండ్ ఎపిసోడ్స్ లో మరో విష్ణు ని చూడొచ్చు. రోజురోజుకి ఆమె తన గ్రాఫ్ ని తగ్గించుకుంటూ పోతుంది. వారం లో 5 రోజులు ఆమె చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పెట్టుకొని పెద్దది చేస్తుంది, కోపం, అసూయ ఇవన్నీ చూపిస్తుంది. కానీ నాగార్జున ముందు మాత్రం అమాయకురాలిగా, తింగరి ఎక్స్ ప్రెషన్స్ తో పాపం అమాయకురాలు అని ప్రేక్షకులు అనుకునే రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చేస్తుంది. దానికి తగ్గట్టు నాగార్జున కూడా ఆమెని అమాయకురాలిగా ట్రీట్ చేసి మాట్లాడడం మరో కొసమెరుపు. విష్ణు ప్రియా తో సావాసం చేయడం వల్లనో ఏమో కానీ సీత కూడా పూర్తిగా మారిపోయింది. ప్రతీ వారం నామినేషన్స్ సమయంలో సీత రేంజ్ లో కరెక్ట్ పాయింట్స్ పట్టుకొని మాట్లాడేవాళ్ళు హౌస్ లో ఎవరు లేరు.

కానీ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం ఆమె కేవలం ప్రేరణ ని నామినేషన్స్ లో పెట్టాలి అనే ఉద్దేశ్యంతోనే తోనే సిల్లీ పాయింట్స్ తో నామినేట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘దోశ’ విషయం లో జరిగిన గొడవను విష్ణు ప్రియ మనసులో చాలా బలంగా పెట్టుకుంది. అందుకే నేడు ఏ పాయింట్ తన వద్ద లేకపోయినా కూడా ప్రేరణ ని నామినేట్ చేసింది. ఆ పాయింట్ చూసిన తర్వాత ఇంతకంటే చెత్త నామినేషన్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎప్పుడూ చూడలేదు అనిపించింది. ఇంతకీ నామినేషన్ పాయింట్ ఏమిటంటే ‘ఒక కంటెస్టెంట్ నీ మీద బీప్ వచ్చే విధమైన బూతులతో మాట్లాడితే నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోలేదు..రెండు గుడ్లు తిన్నందుకు నన్ను నామినేట్ చేసిన నువ్వు, నీ గురించి ఫైట్ చేసుకోలేకపోవడం నచ్చలేదు. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను’ అని అంటుంది.

అప్పుడు ప్రేరణ దానికి సమాధానం ఇస్తూ ‘ఆయన నన్ను అనలేదు. ఉన్న పరిస్థితి లో కోపం తో ఆ సమయంలో అతను నోరు జారాడు. అక్కడ నాకు స్టాండ్ తీసుకోవాలని అనిపించలేదు. అతను నిజంగా నన్ను అనుంటే నేను పోరాడేదానిని. నాకు సంబంధం లేని విషయం లో నేనెందుకు ఫైట్ చేస్తాను’ అని అంటుంది. దీనికి విష్ణు ప్రియ దగ్గర ఏ సమాధానం ఉండదు. ఇంకా పాయింట్స్ చెప్పు అంటే ఇంకేమి నా దగ్గర లేదు, ఇదే నా నామినేషన్ పాయింట్ అని అంటుంది. దీనికి ప్రేరణ ‘ఏంటో నువ్వు..ఎదో నామినేషన్ వెయ్యాలని వేస్తున్నావు అంతే’ అనగానే, విష్ణు ప్రియ ‘అవును..అది నిజమే అయ్యుండొచ్చు’ అని అంటుంది. అప్పుడు ప్రేరణ ‘జరిగిన గొడవ మొత్తం మర్చిపోయి ముందుకు వెళ్దాం అనుకుంటే’ అని అనుకోని బాధపడుతుంది. సీత కూడా ప్రేరణ ని ఇలాంటి సిల్లీ పాయింట్ తోనే నామినేట్ చేసింది. గత వారాలకు సంబంధించిన పాయింట్స్ ని గుర్తు చేసుకుంటూ ఆమె నామినేట్ చేయడాన్ని చూస్తే సీత, విష్ణు ఇద్దరు మాట్లాడుకొని ప్రేరణపై నామినేషన్ వేసినట్టుగా అనిపించింది.