https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఒక్కరోజు లోనే 4 సార్లు నోరు జారిన సోనియా.. ఆదిత్య ఓం కి దారుణమైన అవమానం!

సోనియా మాట్లాడుతూ 'ఒకవేళ నేను అలా మాట్లాడుంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేవాడు' అని అంటుంది. అప్పుడు ఆదిత్య ఓం 'ఇచ్చాడు చాలా సార్లు అని అంటాడు'. అప్పుడు సోనియా 'ఇక్కడ ఎవరికీ ఆ ఆయన వర్కింగ్స్ ఇచ్చిన విషయం వినపడలేదే?, మీకు వయస్సు పెరిగిపోవడం వల్ల వినికిడి లో ఎదో లోపం వచ్చి అలా అనిపించి ఉండొచ్చు' అని అంటుంది సోనియా.

Written By:
  • Vicky
  • , Updated On : September 24, 2024 8:19 am
    Bigg Boss Telugu 8(39)

    Bigg Boss Telugu 8(39)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో బాగా తలపొగరు ఉన్న కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సోనియా. మొదటి వారం నుండి ఈమెని మనం చూస్తూనే ఉన్నాం, ఆమె పొగరు మాటలు హౌస్ లో ఎంతటి వారికైనా కోపం తెప్పించేలా చేస్తుంది. గత సీజన్ లో శోభా శెట్టి ని చూసినప్పుడు చాలా మందికి ఇలాగే అనిపించేది. కానీ సోనియా తో పోలిస్తే శోభా శెట్టి దేవత అని అనేయొచ్చు. ప్రతీ ఒక్కరిపై ఈమె ఆట పరంగా కామెంట్స్ చేయకుండా, మనిషిపై కామెంట్స్ వదిలేస్తుంది. ఈరోజు జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో సోనియా ని ఆదిత్య ఓం నామినేట్ చేస్తాడు. ఆమె గురించి పాయింట్స్ చెప్తూ ‘నీకు హౌస్ లో గుస గుసలు ఎక్కువ అయిపోయాయి. మైక్ ని పక్కన పెట్టి చాలా సార్లు మాట్లాడావు’ అని అంటాడు.

    అప్పుడు సోనియా మాట్లాడుతూ ‘ఒకవేళ నేను అలా మాట్లాడుంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేవాడు’ అని అంటుంది. అప్పుడు ఆదిత్య ఓం ‘ఇచ్చాడు చాలా సార్లు అని అంటాడు’. అప్పుడు సోనియా ‘ఇక్కడ ఎవరికీ ఆ ఆయన వర్కింగ్స్ ఇచ్చిన విషయం వినపడలేదే?, మీకు వయస్సు పెరిగిపోవడం వల్ల వినికిడి లో ఎదో లోపం వచ్చి అలా అనిపించి ఉండొచ్చు’ అని అంటుంది సోనియా. ఇది ఎంత దారుణమైన మాటనో అర్థం చేసుకోవచ్చు. ఆదిత్య ఓం కి స్టార్ స్టేటస్ లేకపోవచ్చు, కానీ హోదా విషయం లో ఆయన సోనియా కంటే బయట వంద రెట్లు ఎక్కువ. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు, సూపర్ హిట్స్ ని కూడా అందుకున్నాడు. కానీ సోనియా అంటే ఎవరో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేంత వరకు ఎవరికీ తెలియదు. వయస్సులో కూడా ఆదిత్య ఓం సోనియా కంటే చాలా పెద్ద, అయినప్పటికీ కూడా ఆయనకీ కనీస స్థాయి గౌరవం ఇవ్వలేదు. ఆమె ఇంతలా రెచ్చగొట్టినా కూడా ఆదిత్య ఓం రేచిపోలేదు, చాలా కూల్ గా సమాధానం చెప్పాడు. ఆ తర్వాత సోనియా ఆదిత్య ఓం ని నామినేట్ చేసిన విధానం చూస్తే సోనియా ని ఆడియన్స్ కి కొట్టేంత కోపం వచ్చేసింది.

    ఆమె మాట్లాడుతూ ‘నీ గురించి చెప్పడానికి ఏ పాయింట్ లేదు. ఎందుకంటే నువ్వు హౌస్ లో ఆడింది ఏమి లేదు. నువ్వు మొన్న కూడా నేను ఇన్ని రోజులు హౌస్ లో ఉండడమే ఆశ్చర్యం అని అన్నావు. మీకు గేమ్ ఆడాలనే కసి లేదు, ఇంట్లో ఉండాలనే ఆశ లేదు, చీఫ్ అవ్వాలనే తాపత్రయం లేదు, మీకు అసలు హౌస్ లో ఉండాలనే అనిపించడం లేదు. అందుకే నామినేట్ చేస్తున్న, ఇంటికి వెళ్ళండి’ అని అంటుంది. ఆమె పొగరుగా నామినేట్ చేసిన విధానం ని చూస్తే అసలు ఏమి అమ్మాయి రా ఈమె అని అనిపిస్తుంది. పాపం ఆదిత్య సైలెంట్ గా ఉండడం అందరినీ బాధకి గురి చేసింది.