India And Pakistan: భారత దేశంలో సార్వభౌమాధికారాన్ని నాశనం చేయాలని.. దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని పాకిస్తాన్ చేయని ప్రయత్నాలు అంటూ లేదు. ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి ఎన్నో దారుణమైన సంఘటనలకు కారణమైంది పాకిస్తాన్. మనదేశంలో ఇప్పటివరకు చోటు చేసుకున్న అల్లర్లు, ఇతర ఘర్షణలకు కారణం ముమ్మాటికి పాకిస్తాన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొంతకాలంగా ఉగ్రదాడులు తగ్గిపోయాయి గాని.. ఒకప్పుడు ఉగ్రవాద సంస్థలతో భారతదేశంలో పాకిస్తాన్ దాడులకు తెగబడేది. అందువల్లే పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ వేదికలపై భారత్ ఎండ కడుతూ వస్తోంది. ఉగ్రవాద సంస్థల మూలాలను పెకిలించే పనిలో ఉంది. అందువల్లే ఆ మధ్య పాకిస్తాన్లో వరుసగా ఉగ్రవాద సంస్థల నాయకులు కాల్పుల్లో చనిపోయారు. ఇప్పటికి చనిపోతూనే ఉన్నారు. దీని వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఎవరి వల్ల ఇదంతా జరుగుతోంది? అనే అంశాలు ముంజేతి కంకణమే. అయినప్పటికీ వీటి గురించి భారత్ చెప్పదు. పాకిస్తాన్ చెప్పుకోలేదు.
కలసి పనిచేస్తే..
ఉప్పు నిప్పులాగా ఉండే పాకిస్తాన్ – భారత్ కలసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని బయటి ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్ తో కలిసి భారత్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు నిదర్శనంగా నిరుస్తోంది. మనదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని సముద్రంలో 270 కిలోమీటర్ల దూరంలో MSV AI ఫిరాన్ ఫిర్ నౌక చిక్కుకు పోయింది. అందులో ఉన్న సిబ్బందిని భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా కాపాడాయి. ఆ నౌకలో ఉన్న సిబ్బందిని వెంటనే గుర్తించి ప్రాణాలతో బయటకు తీసుకొచ్చాయి. అనౌక గుజరాత్ తీరం నుంచి ఇరాన్ వెళ్ళిపోయింది. అందులో సరుకు, ఇతర సామాగ్రి ఉంది. అయితే అది ఏ తరహా సరుకు అనేది బయటికి చెప్పడం లేదు. అయితే ఇటీవల వరుసగా తుఫాన్లు ఏర్పడడంతో సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ నౌక మునిగిపోయింది. సరుకు, ఇతర సామగ్రి సముద్రం పాలైంది. ఈ క్రమంలో నౌకా సిబ్బంది నుంచి అత్యవసర సందేశం భారత కోస్ట్ గార్డ్ సిబ్బందికి వచ్చింది. ఇదే సమయంలో పాకిస్తాన్ తీర ప్రాంత రక్షక బలగాలకు కూడా సందేశం అందడంతో.. రెండు దేశాలకు సంబంధించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. వెంటనే నౌక మునిగిన ప్రాంతం వద్దకు వెళ్లారు. 12 మందిని రక్షించారు. వారంతా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. నీటిలో మునిగిన నేపథ్యంలో వారికి వైద్య చికిత్సలు అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. 12 మంది ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గానే ఉందని తెలుస్తోంది..” భారత్, పాకిస్తాన్ సిబ్బంది కలిసి ఇరాన్ నౌకలోని సిబ్బంది ప్రాణాలు కాపాడారు. సంయుక్తంగా ఆపరేషన్ చేయడం వల్ల 12 మందికి ప్రాణభిక్ష పెట్టారు. ఈ రెండు దేశాలు పరస్పరం శత్రుత్వాన్ని కొనసాగిస్తాయి. కానీ దానిని పక్కనపెట్టి సంయుక్తంగా పనిచేస్తే మాత్రం అద్భుతాలు సృష్టిస్తాయి. ఇరాన్ నౌక విషయంలో జరిగింది అదే. అందుకే మన పెద్దలు కలిసి ఉండాలి అంటారు. ఐకమత్యమే మహాబలం అని చెబుతుంటారు. దానిని పాకిస్తా, భారత్ కోస్ట్ గార్డ్ బృందాలు నిజం చేసి చూపించాయని” భారత కోస్ట్ గార్డ్ మాజీ సిబ్బంది పేర్కొంటున్నారు.