https://oktelugu.com/

Bigg Boss Telugu 8: పృథ్వీ కి బిగ్ బాస్ తీరని అన్యాయం..కష్టపడి ఆడినందుకు గుర్తింపు లేదు..చివరికి విష్ణుప్రియ కూడా వెన్నుపోటు!

దమ్ము గా ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే పృథ్వీ నిఖిల్ పేరు చెప్తాడు. కానీ తనతో కలిసి మొదటి నుండి పులి లాగ ఆడిన పృథ్వీ పేరు మాత్రం నిఖిల్ చెప్పలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : December 1, 2024 / 09:24 AM IST

    Bigg Boss Telugu 8(256)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో దురదృష్టం వెంట పెట్టుకొని తిరిగిన ఏకైక కంటెస్టెంట్ పృథ్వీ రాజ్ శెట్టి మాత్రమే. హౌస్ లో నిఖిల్ తో సమానంగా టాస్కులు ఆడుతాడు, కానీ ఆయనకీ దానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు. ప్రతీ టాస్కులోను ప్రాణం పణంగా పెట్టి ఆడినప్పటికీ హౌస్ లో చీఫ్ అవ్వలేకపోయాడు, మెగా చీఫ్ కూడా అవ్వలేకపోయాడు. కంటెస్టెంట్స్ చేత ఎంపిక కాబడే సమయంలో కూడా పృథ్వీ మెగా చీఫ్ అవ్వలేదు. ఇది చాలా అన్యాయం అనే చెప్పాలి. తనకి ఉన్న కోపం అనే బలహీనత ని అడ్డం పెట్టుకొని హౌస్ మేట్స్ పృథ్వీ ని ప్రతీ విషయంలో తొక్కాలని చూసాడు. చివరికి తన ప్రాణ స్నేహితుడు అనుకున్న నిఖిల్ కూడా అనేక సందర్భాల్లో పృథ్వీ కి వెన్నుపోటు పొడిచాడు. కానీ పృథ్వీ మాత్రం తన స్నేహితుడి కోసమే నిలబడ్డాడు. నిన్న కూడా పృథ్వీ నిఖిల్ పట్ల తనకు ఉన్న స్వచ్ఛమైన ప్రేమ చూపించాడు.

    దమ్ము గా ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే పృథ్వీ నిఖిల్ పేరు చెప్తాడు. కానీ తనతో కలిసి మొదటి నుండి పులి లాగ ఆడిన పృథ్వీ పేరు మాత్రం నిఖిల్ చెప్పలేదు. అసలు హౌస్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత ఒక్క టాస్కు కూడా సరిగా ఆడని నబీల్ ని దమ్ముగా ఆడిన కంటెస్టెంట్ గా చెప్పుకొచ్చాడు నిఖిల్. నిఖిల్ ఒక్కడే కాదు, హౌస్ లో ఒక్క కంటెస్టెంట్ కూడా నిన్న పృథ్వీ దమ్ము గా ఆడినట్టు చెప్పలేదు. ఇది ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదని అనకుండా ఏమని అంటారు?, మీరే చెప్పండి. చివరికి మొదటి నుండి పృథ్వీ వెనుక తిరిగి, అతను నన్ను వదిలేయ్ బాబోయ్ అని అంటున్నా కూడా, నాకు నువ్వే కావాలి, నాకంటే నువ్వే ఎక్కువ అని చెప్పుకొని తిరిగిన విష్ణు ప్రియ కూడా నిన్న పృథ్వీ కి కాకుండా నిఖిల్ కి దమ్ముగా ఆడినట్టు చెప్పుకొచ్చింది.

    పృథ్వీ ని, అతని కష్టాన్ని హౌస్ లో గుర్తించిన ఏకైక కంటెస్టెంట్ యష్మీ మాత్రమే. ఆమెనే ఇతనికి ఎన్నో సందర్భాల్లో సహాయం చేసింది. బయటకి వచ్చిన తర్వాత కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉన్న పృథ్వీ ని సేవ్ చేయమని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రేక్షకులను వేడుకుంది. యష్మీ తర్వాత పృథ్వీ ని బాగా అర్థం చేసుకొని ఇన్ని వారాలు సేవ్ చేసుకుంటూ వచ్చింది ఆడియన్స్. ఈ వారం కూడా అతన్ని ఆడియన్స్ సేవ్ చేసారు. కానీ అవినాష్ కి టికెట్ టు ఫినాలే రావడం వల్ల, అతని స్థానంలో పృథ్వీ ని అన్యాయంగా బయటకి పంపించేశారు. ఎలాంటి మాస్క్ లేకుండా, స్వచ్ఛమైన మనసుతో ఇన్ని రోజులు హౌస్ లో కొనసాగిన పృథ్వీ కి బయటకి వచ్చిన తర్వాత కచ్చితంగా బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.