Bigg Boss Telugu 8: స్నేహం పేరుతో యష్మీ కి వెన్నుపోటు పొడిచిన ప్రేరణ..మొన్నటి వరకు శత్రువుగా ఉన్న పృథ్వీ ఎక్కువ అయిపోయాడా?

హరితేజ వ్యక్తిగతంగా నిందిస్తే ప్రేరణ నాకు ఎందుకులే అన్నట్టుగా వ్యవహరించింది. చివరికి ఆమె యష్మీ ని నామినేట్ చేసేసిన తర్వాత అప్పుడు యష్మీ కోసం స్టాండ్ తీసుకుంది. మా ఇద్దరి మధ్య నామినేషన్స్ గురించి ఒక అవగాహన ఉంది, దయచేసి ఎవ్వరూ ఈ విషయంలో జోక్యం చేసుకోకండి అని అంటుంది. ఇడ్డెవు ఆమె ముందుగానే స్పందించి మాట్లాడి ఉండుంటే ఆరోజు యష్మీ నామినేషన్స్ లోకి వచ్చేది కాదు.

Written By: Vicky, Updated On : October 29, 2024 8:12 am

Bigg Boss Telugu 8(172)

Follow us on

Bigg Boss Telugu 8:  ఈ సీజన్ లో హౌస్ మేట్స్ మధ్య నిజమైన రిలేషన్స్ ఏర్పడినట్టు అసలు అనిపించలేదు. కేవలం విష్ణు ప్రియ పృథ్వీ ని ప్రేమించడం ఒక్కటే నిజమైనది గా అనిపించింది కానీ , మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ రిలేషన్స్ విషయంలో కేవలం కెమెరాల కోసం డ్రామా చేసినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేరణ, యష్మీ మధ్య ఉన్న స్నేహం. యష్మీ ప్రేరణ నాకు స్నేహితురాలు కాదు అని అంటూ ఉంటుంది కానీ, హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో ప్రేరణ కి ఒక స్నేహితురాలిగా సహాయం చేసింది. కానీ ప్రేరణ ఒక్కసారి కూడా యష్మీ కోసం నిలబడలేదు. అవకాశం వచ్చినప్పుడు కూడా ఆమె విశ్వాసం చూపించలేదు. ఉదాహరణకి కిల్లర్ గర్ల్స్ టాస్క్ లో ప్రేరణ పై హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేసినప్పటికీ కూడా, యష్మీ ప్రేరణకి సపోర్టుగా నిల్చింది. ఆమె కోసం చాలా కసిగా ఆడింది.

కానీ అదే రోజున ఆమెని హరితేజ వ్యక్తిగతంగా నిందిస్తే ప్రేరణ నాకు ఎందుకులే అన్నట్టుగా వ్యవహరించింది. చివరికి ఆమె యష్మీ ని నామినేట్ చేసేసిన తర్వాత అప్పుడు యష్మీ కోసం స్టాండ్ తీసుకుంది. మా ఇద్దరి మధ్య నామినేషన్స్ గురించి ఒక అవగాహన ఉంది, దయచేసి ఎవ్వరూ ఈ విషయంలో జోక్యం చేసుకోకండి అని అంటుంది. ఇడ్డెవు ఆమె ముందుగానే స్పందించి మాట్లాడి ఉండుంటే ఆరోజు యష్మీ నామినేషన్స్ లోకి వచ్చేది కాదు. ఇకపోతే నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో నిన్న మొన్నటి వరకు శత్రువుగా ఉన్నటువంటి పృథ్వీ ని నామినేషన్స్ నుండి సేవ్ చేసి, యష్మీ ని నామినేషన్స్ లోకి పడేసింది. ఇది జరగక ముందు యష్మీ ప్రేరణ ని నామినేషన్స్ నుండి సేవ్ చేస్తుంది. కనీసం ప్రేరణ ఆ కృతజ్ఞత కూడా చూపించాలి అనుకోలేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను పృథ్వీ ని సేవ్ చేయాలనీ అనుకుంటున్నా అని అంటుంది. దెబ్బకి పృథ్వీ కూడా షాక్ అవుతాడు,యష్మీ ని కాకుండా నన్ను ఎలా సేవ్ చేసింది అని.

కాపాడే అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రేరణ ఎందుకు కాపాడలేదు?, అసలు ఆమె పృథ్వీ ని ఎందుకు సేవ్ చేయాలని అనుకుంది అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రెండు సార్లు నామినేషన్స్ నుండి ప్రేరణ ని సేవ్ చేస్తుంది యష్మీ. ఆమెని సేవ్ చేసినందుకు స్నేహితురాలి పట్ల వివక్ష చూపించింది అని అనే మాటలు కూడా అనిపించుకుంది యష్మీ. అలాగే ప్రేరణ కి అవసరమైన ప్రతీ చోట ఆమె అండగా నిలబడి వాదించేది. అలాంటి స్నేహితురాలికి అవకాశం వచినప్పుడు సహాయం చేయకుండా వెన్నుపోటు పొడవడం, అంత అయిపోయాక ఏడవడం వల్ల ఏమి ఉపయోగం ఉందో ఆమెకే తెలియాలి. ఈ ఒక్క సంఘటనతో ప్రేరణ మీద ఉన్న పాజిటివ్ అభిప్రాయం జనాల్లో చాలా వరకు తగ్గిపోయింది అనే చెప్పొచ్చు.