Bigg Boss Telugu 8: నామినేషన్స్ లో ‘మెగాచీఫ్’ గా విష్ణు ప్రియ డిజాస్టర్..టేస్టీ తేజ ధాటికి నిలబడలేకపోయిన ‘ఓజీ’ గ్యాంగ్!

నభీల్ మాత్రం విష్ణు ప్రియ కి కష్ట సమయంలో అండగా నిలబడ్డాడు. పృథ్వీ బ్రేకప్ చెప్పినప్పుడు ఆమె ఎమోషనల్ గా ఏడుస్తుంటే, ఒక సోదరుడిగా ఆయన విష్ణు ప్రియ ని ఓదార్చిన తీరు చూసేవాళ్లకు ఎంతో బాగా అనిపించింది. ఆరోజు నభీల్ తప్ప ఎవ్వరూ విష్ణుప్రియ వద్దకు రాలేదు. అలాగే విష్ణు ప్రియ మెగా చీఫ్ అవ్వడం కోసం నభీల్ కూడా చాలా కష్టపడ్డాడు. ఇవన్నీ మర్చిపోయి ఆమె నభీల్ ని నామినేట్ చేయడం దారుణం అనిపించింది.

Written By: Vicky, Updated On : October 29, 2024 8:18 am

Bigg Boss Telugu 8(173)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ మొత్తానికి అతి చెత్త కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది విష్ణు ప్రియనే అని ముక్తకంఠం తో చెప్తున్నారు సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్. విశ్లేషకులు కూడా ఇలాంటి కంటెస్టెంట్ ని తీసుకొచ్చినందుకు బిగ్ బాస్ టీం ని ఇష్టమొచ్చినట్టు తిట్టేస్తున్నారు. ఒక్క టాస్క్ ఆడలేదు, నామినేషన్స్ వేయడం చేతకాదు, అసలు కంటెస్టెంట్ గానే పనికిరాదు అంటుంటే ఏకంగా గత వారం మెగా చీఫ్ ని చేసి పెట్టారు అంటూ సోషల్ మీడియా లో మండిపడుతున్నారు. 8 వారాలు ఆమె ఇప్పటి వరకు హౌస్ లో కొనసాగితే, ఒక్క వారంలో కూడా ఆమె సరైన పాయింట్స్ తో ఇద్దరిని నామినేట్ చేసినట్టు జనాలకు అనిపించలేదు. ఇద్దరిని నామినేట్ చేయడానికే సతమతం అయ్యే విష్ణు ప్రియకి ఇప్పుడు ఏకంగా 5 మందిని సేవ్ చేయమని చెప్తాడు బిగ్ బాస్.

ఈమె ఎలాంటి పాయింట్స్ తో నామినేట్ చేస్తుంది అనేది అందరికీ ఒక అవగాహన ఉంది. కచ్చితంగా పనికిమాలిన కారణాలతోనే నామినేట్ చేస్తుంది అని అందరికి తెలుసు కానీ, ఇంత చెత్త నామినేషన్స్ చేస్తుందని బహుశా ఆమెని ద్వేషించే వారు కూడా ఊహించి ఉండరేమో. ఆమె ఎలాంటి కష్టం చేయకుండా అప్పనంగా మెగా చీఫ్ అవ్వడానికి కారణం గౌతమ్. అలాంటి గౌతమ్ ని మొదటి వారం అతను అవినాష్ మీద కోపంతో మైక్ విసిరిన ఘటనని గుర్తు తెచ్చుకొని నామినేట్ చేసింది. ఇంకా నన్ను ఈ పాయింట్ మీద ఎన్ని వారాలు నామినేట్ చేస్తారు అని గౌతమ్ అడగగా, కొత్త పాయింట్స్ ని వెతుక్కొని మరీ అతనికి చెప్తుంది. కేవలం నిన్ను నామినేట్ చేయడం కోసం, ఎక్కడ దొరుకుతావో చూద్దాం అని పాయింట్స్ కోసం ఎదురు చూసాను గత వారం మొత్తం అని చెప్తుంది. గౌతమ్ కి ఏమి మాట్లాడాలో అర్థంకాక చివరికి నామినేషన్ ని అంగీకరిస్తాడు. అలాగే సొంత క్లాన్ నుండి ప్రేరణ, నబీల్ ని నామినేట్ చేస్తుంది. ప్రేరణ ‘ఫేక్ ఫ్రెండ్’ అని అనింది కాబట్టి ఆమె మనసు నొచ్చుకుంది, అందుకే నామినేట్ చేసింది అనుకోవడంలో తప్పు లేదు.

కానీ నభీల్ మాత్రం విష్ణు ప్రియ కి కష్ట సమయంలో అండగా నిలబడ్డాడు. పృథ్వీ బ్రేకప్ చెప్పినప్పుడు ఆమె ఎమోషనల్ గా ఏడుస్తుంటే, ఒక సోదరుడిగా ఆయన విష్ణు ప్రియ ని ఓదార్చిన తీరు చూసేవాళ్లకు ఎంతో బాగా అనిపించింది. ఆరోజు నభీల్ తప్ప ఎవ్వరూ విష్ణుప్రియ వద్దకు రాలేదు. అలాగే విష్ణు ప్రియ మెగా చీఫ్ అవ్వడం కోసం నభీల్ కూడా చాలా కష్టపడ్డాడు. ఇవన్నీ మర్చిపోయి ఆమె నభీల్ ని నామినేట్ చేయడం దారుణం అనిపించింది. పృథ్వీ, యష్మీ ని నామినేట్ చేసేందుకు ఆమె వద్ద ఎన్ని కారణాలు ఉన్నా కూడా నామినేట్ చేయలేదు. ఇక టేస్టీ తేజ ని బాగా ఆడుతున్నాడని నామినేట్ చేసింది. ప్రేరణ కూడా అన్యాయంగా టేస్టీ తేజ ని బలి చేస్తుంది. కానీ తేజ తనని తానూ డిఫెండ్ చేసుకున్న విధానం, ఒక్కేసారి విష్ణు ప్రియ, నిఖిల్ ని తన పాయింట్స్ తో ఇరకాటం పెట్టడం వంటివి చాలా బాగా అనిపించింది.