Bigg Boss Telugu 8 : ఆడియన్స్ కి ఆసక్తి కలిగించేందుకు బిగ్ బాస్ చివరి వారం లో చాలా జిమ్మిక్కులు చేస్తూ ఉంటాడు. ప్రతీ సీజన్ లో ఇది జరిగేదే. అయితే ప్రతీ సీజన్ లో ఫినాలే వీక్ లోకి టాప్ 6 కంటెస్టెంట్స్ అడుగుపెట్టే వాళ్ళు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా టాప్ 6 నుండి ఒకరిని బయటకి పంపేవాళ్లు. కానీ ఈ సీజన్ లో మాత్రం టాప్ 5 ని మాత్రమే ఫినాలే వీక్ లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఈ టాప్ 5 లో కూడా ఒకరిని ఎలిమినేట్ చేసి ఫినాలే ఎపిసోడ్ కి కేవలం నలుగురిని మాత్రమే పంపే ఉద్దేశ్యంలో బిగ్ బాస్ టీం ఉన్నట్టుగా లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. అది కూడా ఓటింగ్ ద్వారా కాదు, ప్రైజ్ మనీ ఆశ చూపించి పంపబోతున్నట్టు టాక్. గత సీజన్ లో కూడా ఈ ఆఫర్ వచ్చింది. కానీ ఎవ్వరూ ఈ ఆఫర్ కి ఒప్పుకోలేదు.
కానీ ఈ సీజన్ లో మాత్రం కంటెస్టెంట్స్ ఈ ఆఫర్ కి ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ హిస్టరీ లో కంటెస్టెంట్స్ కి ఎప్పుడూ రానంత హింట్స్ ఈ సీజన్ లో వచ్చింది. అందరికీ టాప్ 2 నిఖిల్, గౌతమ్ అనే విషయం అర్థమైపోయింది. గత సీజన్స్ లో బయట ఎలాంటి వాతావరణం ఉన్నా, హౌస్ లో టైటిల్ విన్నింగ్ రేస్ ఏ ఇద్దరి మధ్య ఉండేది అని చెప్పడం కష్టం గా ఉండేది. ఈ సీజన్ లో ఆ పరిస్థితి లేదు. ఫ్యామిలీ వీక్ లోనే టాప్ 2 లో ఎవరెవరు ఉండబోతున్నారో తెలిసిపోయింది. తాము టైటిల్ గెలవలేము అనేది లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి బాగా అర్థమైపోవడంతో ఎవరో ఒకరు డబ్బులు తీసుకోవడానికి అమితాసక్తి చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గురువారం ఎపిసోడ్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఆశ చూపే అవకాశాలు ఉన్నాయి. ముందుగా 10 లక్షల నుండి ప్రారంభిస్తాడట. ఆ తర్వాత దానిని 20 లక్షల వరకు తీసుకెళ్లి, డబ్బులు తీసుకొని బయటకి వెళ్లాలనుకుంటే బిగ్ బాస్ కి చెప్పండి అని ఆఫర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇదే ఆఫర్ కనుక ఇస్తే అవినాష్ ఆ 20 లక్షలు తీసుకొని బయటకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఎందుకంటే మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ కి ఎదో ఒక మూల తాము టైటిల్ గెలవొచ్చేమో అనే ఆశలు ఉన్నాయి. కానీ అవినాష్ కి మాత్రం అలాంటి ఆశలు లేవు. ఎందుకంటే అతనికి కూడా ఒక క్లారిటీ ఉంది, తనకి ఆడియన్స్ ఓటింగ్ లేదని. కాబట్టి ఆయన ఉత్త చేతులతో బయటకి రావడం కంటే బిగ్ బాస్ ఇచ్చే ఈ 20 లక్షలు తీసుకొని బయటకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.