https://oktelugu.com/

Bigg Boss Telugu 8: సేఫ్ గేమ్ కి మారుపేరుగా నిల్చిన నిఖిల్..క్లాన్ కోసం అంత క్లాస్ పీకి చివరికి ఇలా!

కష్టమైన సమయంలో మాత్రం నిఖిల్ ఎదో ఒక స్టాండ్ కచ్చితంగా తీసుకోవాలి అనుకున్నప్పుడు, అతను స్టాండ్ తీసుకోడు. ఇలాంటి సందర్భాల్లో మాత్రం చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఆడియన్స్ కి అనిపిస్తాది. నిన్న జరిగింది కూడా అదే. పూర్తి వివరాల్లోకి వెళ్తే మెగా చీఫ్ అయిన విష్ణుప్రియ కి 5 మందిని నామినేట్ చేసి జైలు లోకి పంపే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్.

Written By:
  • Vicky
  • , Updated On : October 29, 2024 / 10:01 AM IST

    Bigg Boss Telugu 8(174)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ షోలో విన్నర్ అయ్యేందుకు అన్ని రకాల అర్హతలు ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నిఖిల్ అని చెప్పొచ్చు. ఆడియన్స్ కూడా అతనే విన్నర్ అని దాదాపుగా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. టాస్కులు ఆడే విషయంలో స్ట్రాంగ్ గా ఉండడం, మిగిలిన కంటెస్టెంట్స్ లాగా ప్రతీ విషయంలో రెచ్చిపోయి మాట్లాడకుండా, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా కూల్ గా ఉండడం వంటివి నిఖిల్ లో అందరికీ నచ్చుతాయి. కానీ కష్టమైన సమయంలో మాత్రం నిఖిల్ ఎదో ఒక స్టాండ్ కచ్చితంగా తీసుకోవాలి అనుకున్నప్పుడు, అతను స్టాండ్ తీసుకోడు. ఇలాంటి సందర్భాల్లో మాత్రం చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఆడియన్స్ కి అనిపిస్తాది. నిన్న జరిగింది కూడా అదే. పూర్తి వివరాల్లోకి వెళ్తే మెగా చీఫ్ అయిన విష్ణుప్రియ కి 5 మందిని నామినేట్ చేసి జైలు లోకి పంపే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్.

    ఆ తర్వాత బిగ్ బాస్ ఒక బజర్ రౌండ్ పెడుతాడు. ఎవరైతే బజర్ మోగినప్పుడు ముందుగా పరిగెత్తి కీ ని తీసుకుంటాడో, వాళ్ళు నామినేట్ అయ్యి జైలులోకి వెళ్లిన ఒకరిని బయటకి తీసుకొచ్చి, మరొకరిని నామినేషన్స్ లోకి పంపాలి. ఈ టాస్క్ లో అందరూ ఉత్సాహంగా ఆడుతారు, ఒక్క నిఖిల్ తప్ప. కేవలం ఒక్కసారి మాత్రమే ఆయన కీ కోసం పరుగులు తీస్తాడు. మిగిలిన అన్ని రౌండ్స్ లో ఆయన ఖాళీగా కూర్చున్నాడు. ఇది చూసిన తర్వాత అందరికీ నిఖిల్ సేఫ్ గేమ్ ఆడినట్టుగా అనిపించింది. చివరి రౌండ్ లో ఓజీ క్లాన్ నుండి యష్మీ నామినేట్ అయ్యి జైలుకి వెళ్తుంది. కనీసం ఆమె కోసం అయినా ఈ టాస్క్ లో పాల్గొంటాడు అనుకుంటే అది కూడా జరగలేదు. క్లాన్ కోసం ఆడాలి, క్లాన్ కోసం పోరాడాలి, మన క్లాన్ వాళ్ళు ఎవ్వరూ నామినేషన్స్ లోకి రాకూడదు అని ఒక రేంజ్ ప్రసంగం ఇచ్చి అందరిలో ధైర్యం నింపిన నిఖిల్, తన క్లాన్ కోసం ఆడాల్సినప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడు అనేది ఇప్పుడు అందరిలో మెలుగుతున్న ప్రశ్న.

    కానీ నిఖిల్ కి ఆరోగ్యం సరిగా లేదని, అందుకే ఆయన ఆడలేకపోయాడని, బిగ్ బాస్ ని కూడా తనని మెడికల్ రూమ్ కి పిలవాల్సిందిగా కోరాడని లైవ్ లో చూసిన కొంతమంది చెప్పుకొచ్చారు. కానీ నిఖిల్ ఆరోగ్యం బాగలేని సమయాల్లో కూడా టీం కోసం బలంగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భలతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన సందర్భం పెద్ద కష్టమేమి కాదు, ఆయన టాస్క్ ఆడొచ్చు, కానీ ఒకరిని సపోర్టు చేస్తే మరొకరికి అన్యాయం కచ్చితంగా చేయాల్సి వస్తాది, ఆ సమయంలో ఆయన నెగటివ్ అవ్వొచ్చు అని సేఫ్ గా ఆడకుండా ఉన్నాడని అనుకుంటున్నారు నెటిజెన్స్. ఈ ఒక్క నెగటివ్ క్వాలిటీ ని మార్చుకుంటే నిఖిల్ కి తిరుగులేదని అంటున్నారు విశ్లేషకులు.