Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సైతం ఏర్పాటు చేసుకున్న నటులు కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతూ తనకంటూ ఒక సెపరేట్ గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఆయన భారీ సినిమాలను చేస్తూ మంచి సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక ఈ ఇయర్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమాలను తొందరగా కంప్లీట్ చేసి తక్కువ సమయంలోనే ఈ సినిమాలను రిలీజ్ చేయాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ప్రభాస్ సినిమాల విషయం పక్కన పెడితే వ్యక్తిత్వం పరంగా కూడా ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఆయన ఎవర్నీ అయిన ఒక్కసారి తనవాళ్లు అనుకుంటే మాత్రం వాళ్లకి చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రభాస్ రాకముందు సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ క్లాసెస్ అయితే నేర్చుకున్నాడు.
ఇక ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయాలను సాధిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో ప్రభాస్ చాలా వరకు కీలక పాత్ర వహిస్తూ వచ్చాడు. ఇక రీసెంట్ గా సత్యానంద్ గారి బర్త్ డే సందర్భంగా తన గురువుగారికి ఒక కాస్ట్లీ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక దాదాపు 40 లక్షల రూపాయలా విలువైన వాచ్ ను గురువు గారికి గిఫ్ట్ గా ఇవ్వడం తో ఒక్కసారిగా ఆయన షాక్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ప్రభాస్ తనదైన రీతిలో గురువుగారికి బహుమానాన్ని అందించి గొప్ప మనసును చాటుకున్నాడు…