Bigg Boss Telugu 8: ఓజీ, రాయల్ క్లాన్స్ ని రద్దు చేసిన బిగ్ బాస్..హౌస్ లో కొత్తగా 4 టీమ్స్..ఎవరెవరు ఏ టీం లో ఉన్నారంటే!

మా క్లాన్ వాళ్లనే సేఫ్ చేయాలి అనే మైండ్ సెట్ అందరిలో ఏర్పడింది. నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కి ప్రేక్షకుల నుండి తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది. ఇది చాలా తొందరగా పసిగట్టిన బిగ్ బాస్, వెంటనే ఓజీ, రాయల్ క్లాన్స్ ని రద్దు చేసాడు.

Written By: Vicky, Updated On : October 29, 2024 10:06 am

Bigg Boss Telugu 8(175)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ కి క్లాన్స్ అనే కాన్సెప్ట్ పెద్ద మైనస్ అయ్యింది. ఒకప్పుడు హౌస్ మొత్తానికి కెప్టెన్ ఉండేవాడు, టాస్కులు ఆడాల్సిన సమయం వచ్చినప్పుడు టీమ్స్ లాగా ఏర్పాటు చేసి గేమ్స్ ని ఆడించేవాడు. టీమ్స్ లో ఉండే సభ్యులు వారం వారం మారుతూ ఉండేవారు. ఈసారి కూడా ఇంచుమించు అదే కాన్సెప్ట్ తో కొనసాగింది కానీ, ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ లోపలకు వచ్చారో, అప్పటి నుండి మొదటి వారం నుండి ఉన్న హౌస్ మేట్స్ అందరిలో ఐకమత్యం ఏర్పడింది. అలాగే వైల్డ్ కార్డ్స్ లో విషయంలో కూడా జరిగింది. బిగ్ బాస్ కూడా మంచి కంటెంట్ వస్తుంది అనే ఉద్దేశ్యంతో పాత కంటెస్టెంట్స్ ని ఓజీ క్లాన్ గా, వైల్డ్ కార్డ్స్ ని రాయల్ క్లాన్ గా విభజించాడు. కోరుకున్న కంటెంట్ అయితే బాగానే వచ్చింది కానీ, ఇప్పుడు ఈ క్లాన్స్ కాన్సెప్ట్ వల్ల గేమ్ పక్కదారి పట్టింది. ముఖ్యంగా సొంత నిర్ణయాలతో చేయాల్సిన నామినేషన్స్ ప్రక్రియని కూడా క్లాన్స్ గా చూసి చేస్తున్నారు.

మా క్లాన్ వాళ్లనే సేఫ్ చేయాలి అనే మైండ్ సెట్ అందరిలో ఏర్పడింది. నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కి ప్రేక్షకుల నుండి తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది. ఇది చాలా తొందరగా పసిగట్టిన బిగ్ బాస్, వెంటనే ఓజీ, రాయల్ క్లాన్స్ ని రద్దు చేసాడు. ఇక నుండి హౌస్ లో క్లాన్స్ ఉండవని, మొత్తం మెగా క్లాన్ గా మారి టాస్కులు ఆడాల్సి ఉంటుందని చెప్పుకొస్తాడు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. అలాగే ఈ వారం టాస్కులు ఆడేందుకు కంటెస్టెంట్స్ అందరిని నాలుగు టీమ్స్ గా విభజించి రెడ్, బ్లూ , గ్రీన్, ఎల్లో టీమ్స్ గా పేర్లు పెడుతాడు బిగ్ బాస్. రెడ్ టీం లో గౌతమ్, యష్మీ, ప్రేరణ..బ్లూ టీంలో గంగవ్వ, అవినాష్, నిఖిల్, హరి తేజ..గ్రీన్ టీం లో టేస్టీ తేజ, నభీల్, విష్ణు ప్రియ.

ఎల్లో టీంలో పృథ్వీ, రోహిణి, నయనీ పావని. గౌతమ్ కి యష్మీ మధ్య అసలు పడడం లేదు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒకే టీంలో పెట్టాడు బిగ్ బాస్. అలాగే ఎల్లో టీం లో ఉన్నటువంటి పృథ్వీ, రోహిణి గురించి అందరికీ తెలిసిందే. రోహిణి మొదటి వారం నుండి హౌస్ లో పృథ్వీ ని దారుణంగా టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు వీళ్లిద్దరు ఒకే టీం లో ఉండడం గమనార్హం. ఇలా మిత్రులను విడదీసి, శత్రువులను ఒకే టీం గా చేర్చి బిగ్ బాస్ ఈ వారం ఎదో పెద్ద ప్లాన్ వేసాడు. ఈ వారం మొత్తం బోలెడంత కంటెంట్ వచ్చేలా అనిపిస్తుంది. టీఆర్పీ రేటింగ్స్ కూడా అదిరిపోతాయి. అలాగే ఈ వీకెండ్ లో అయిన నాగార్జున శనివారం రోజు హౌస్ మేట్స్ పై ఫైర్ చూపిస్తాడా లోయెడ అనేది చూడాలి.