https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి వ్యాపారులకు అనుకోని అదృష్టం.. ఆర్థికంగా అధిక ప్రయోజనాలు.

ప్రభుత్వ ఉద్యోగులుకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు ఇతరుల సలహాలు తీసుకోవాలి. ధన సమస్యలు ఎదుర్కొంటారు. ఇతరులకు అప్పుుగా ఇవ్వకండి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 1, 2024 / 08:00 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశుల ఫలితాలు మారుతూ ఉంటాయి. శుక్రవారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ఆయుష్మాన్ యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం కలగనుంది. మరికొందరికి ఖర్చులు పెరుగుతాయి. మేషం తో పాటు మరిన్ని రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి ఉద్యోగులు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సాయంత్రం ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికైనా అప్పుగా ఇవ్వాల్సి వస్తే బాగా ఆలోచించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి

    వృషభ రాశి:
    ముఖ్యమైన పనులు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.

    మిథున రాశి:
    ప్రభుత్వ ఉద్యోగులుకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు ఇతరుల సలహాలు తీసుకోవాలి. ధన సమస్యలు ఎదుర్కొంటారు. ఇతరులకు అప్పుుగా ఇవ్వకండి.

    కర్కాటక రాశి:
    సోదరుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉడాలి.

    సింహారాశి:
    జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల సాయంతో కొందరు వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.

    కన్య రాశి:
    కుటుంబంలో కొందరు సాయంగా ఉంటారు. ఉద్యోగులు మార్పులు చెందే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ కోసం సందడి ఉంటుంది.

    తుల రాశి:
    ఆర్థికంగా పుంజుకుంటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. భవిష్యత్ కోసం ప్రణాళిక వేస్తారు.

    వృశ్చిక రాశి:
    కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వివాహానికి సంబంధించి ప్రతిపాదనలు వస్తాయి. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

    ధనస్సు రాశి:
    ఉద్యోగులు అధికారులతో వాగ్వాదానికి దిగుతారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంారు. శుభకార్యాల గురించి చర్చిస్తారు.

    మకర రాశి:
    ఇంటి పనుల్లోబిజీగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడి పెట్టాలని చూస్తే ఇదే మంచి సమయం. ఇప్పటి వరకు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    కుంభరాశి:
    వ్యాపారులు అధిక ప్రయోజనాలు పొందుతారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి.

    మీనరాశి:
    ఉద్యోగులు కొన్ని ఒత్తిడులు ఎదుర్కొంటారు. కొందరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు.