Bigg boss Telugu 8: ఓటింగ్ ముగిసే సమయానికి డేంజర్ జోన్ లోకి ఆ ముగ్గురు..అందనంత ఎత్తులో నిఖిల్..దూసుకొచ్చిన గౌతమ్!

ఎప్పుడైతే ఆయన స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ లో అద్భుతంగా ఆడుతూ , నిఖిల్ తో సమానంగా పోటీ పడడంతో ఒక్కసారిగా ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే నిన్న మెగా కంటెండర్ టాస్కులో ఒక్కడే ఒంటిచేతితో 11 మంది కంటెస్టెంట్స్ ని ఓడించి మెగా చీఫ్ అయ్యాడో, ఆయనకి ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగి టాప్ 3 స్థానంలో స్థిరపడ్డాడు.

Written By: Vicky, Updated On : October 19, 2024 8:48 am

Bigg Boss Telugu 8(61)

Follow us on

Bigg boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన నామినేషన్స్ ద్వారా టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. 15 మంది కంటెస్టెంట్స్ లో ఏకంగా 9 మంది నామినేషన్స్ లోకి వచ్చారు. ఈ 9 మందిలో ఒక్కొక్క కంటెస్టెంట్ ఓటింగ్ గ్రాఫ్ టాస్కులు ఆడే విధానం ని బట్టీ మారుతూ వచ్చింది. అయితే నిన్న ఓటింగ్ ముగిసే సమయానికి ఎవరెవరు ఏ స్థానం లో ఉన్నారో ఒక్కసారి చూద్దాం. అందరూ ఊహించినట్టుగానే టాస్కులలో కింగ్ గా పిలవబడే నిఖిల్ భారీ మార్జిన్ తో లీడింగ్ లో ఉన్నాడు. గత వారం ఓటింగ్ లో నభీల్ నిఖిల్ కంటే టాప్ లో ఉండేవాడు కానీ, ఈ వారం ఆయన ఆట బాగా తగ్గిపోవడంతో పాటుగా, తన సొంత కమ్యూనిటీ కి సంబంధించిన ఓట్ల గురించి మెహబూబ్ తో మాట్లాడడం, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో అతని ఓటింగ్ గ్రాఫ్ పడిపోయింది. ఇక మూడవ స్థానం లో గౌతమ్ కృష్ణ దూసుకొచ్చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ వారం ప్రారంభం లో ఆయనకి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చి డేంజర్ జోన్ లో ఉండే పరిస్థితి ఏర్పడింది.

కానీ ఎప్పుడైతే ఆయన స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ లో అద్భుతంగా ఆడుతూ , నిఖిల్ తో సమానంగా పోటీ పడడంతో ఒక్కసారిగా ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే నిన్న మెగా కంటెండర్ టాస్కులో ఒక్కడే ఒంటిచేతితో 11 మంది కంటెస్టెంట్స్ ని ఓడించి మెగా చీఫ్ అయ్యాడో, ఆయనకి ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగి టాప్ 3 స్థానంలో స్థిరపడ్డాడు. ఇక నాల్గవ స్థానం లో ఆడపులి గా పిలవబడే ప్రేరణ నిల్చింది. ముందు వారాలతో పోలిస్తే ఆమె ఆట ఈ వారం కాస్త తగ్గినప్పటికీ కూడా, ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడడం వల్ల ఆమెకి భారీ స్థాయిలో ఓటింగ్ పడింది. ఇదంతా పక్కన పెడితే నిన్న మొన్నటి వరకు ఓటింగ్ లో టాప్ 3 స్థానం లో కొనసాగిన డ్రామాకంఠ అలియాస్ మణికంఠ ఇప్పుడు 5వ స్థానంలోకి పడిపోయాడు. ఇతని చీప్ సానుభూతి గేమ్స్ ని ఆడియన్స్ ఈ వారం పసిగట్టేసారు.

ఈ వారం ఆయన పృథ్వీ తో ప్రవర్తించిన తీరుని చూసి ఇంతకు ముందు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఓటింగ్ భారీ స్థాయిలో డౌన్ అయ్యింది. ఆరవ స్థానం లో యష్మీ కొనసాగుతుంది. ఈ వారం ఈమెకు పెద్దగా కంటెంట్ రాకపోవడంతో ఆరవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే డ్రామా కంఠ ని ఓటింగ్ లో దాటేసి ఉండేది. అలాగే 7 వ స్థానం లో టేస్టీ తేజా కొనసాగుతున్నాడు. ఈ వారం టేస్టీ తేజా ఎంటర్టైన్మెంట్ తో పాటు టాస్కులు కూడా అదరగొట్టేసాడు. ఒక విధంగా రాయల్ క్లాన్ గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం టేస్టీ తేజనే. అందుకే డేంజర్ జోన్ లో ఉన్న ఆయన గణనీయమైన ఓటింగ్ తో ఇప్పుడు సేఫ్ జోన్ లోకి వచ్చేసాడు. ఇక చివరి రెండు స్థానాల్లో పృథ్వీ, హరితేజ ఉన్నారు, వీరిలో హరితేజ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.