Bigg Boss Telugu 8: గౌతమ్, ప్రేరణ నిజంగానే నిఖిల్ ని బూతులు తిట్టారా..? అమ్మ మీద ఒట్టేసి గౌతమ్ అబద్దం చెప్పాడా?

రూల్ బుక్ లో ఎక్కడ రాసి లేదే, కావాలంటే చూడు అని రూల్ బుక్ విసిరేసి, నిఖిల్ ని దమ్ముంటే ఆడు అని అంటాడు. అప్పుడు నిఖిల్ రెచ్చిపోయి ఈ రేంజ్ లో ఆడాల్సి వచ్చింది. అయితే నిఖిల్, గౌతమ్ మధ్య గొడవ జరుగుతున్న సమయంలో గౌతమ్ 'బీప్' పదంతో బూతులు తిట్టాడని నిఖిల్ పదే పదే చెప్పి బాధపడ్డాడు.

Written By: Vicky, Updated On : October 31, 2024 7:51 am

Bigg Boss Telugu 8(182)

Follow us on

Bigg Boss Telugu 8: మొన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ ఆట తీరుపై సోషల్ మీడియా లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది గౌతమ్ రెచ్చగొట్టడం వల్లే నిఖిల్ అలా కంట్రోల్ తప్పిపోయి ఆడాడని అంటుంటే, మరికొంతమంది మాత్రం కేవలం గౌతమ్ మీద కోపం తోనే ఇలా ఆడాడు అని అంటున్నారు. ‘పానీ పట్టు యుద్ధం’ టాస్క్ లో గౌతమ్ హరితేజ పట్టుకొని పక్కకి లాగుతాడు. అప్పుడు హరితేజ ఇబ్బంది పడడంతో అక్కడితో వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో నిఖిల్ నువ్వు రూల్స్ కి వ్యతిరేకంగా ఆడుతున్నావు, ఫిజికల్ గా ఆడకూడదు అని అంటాడు. రూల్ బుక్ లో ఎక్కడ రాసి లేదే, కావాలంటే చూడు అని రూల్ బుక్ విసిరేసి, నిఖిల్ ని దమ్ముంటే ఆడు అని అంటాడు. అప్పుడు నిఖిల్ రెచ్చిపోయి ఈ రేంజ్ లో ఆడాల్సి వచ్చింది. అయితే నిఖిల్, గౌతమ్ మధ్య గొడవ జరుగుతున్న సమయంలో గౌతమ్ ‘బీప్’ పదంతో బూతులు తిట్టాడని నిఖిల్ పదే పదే చెప్పి బాధపడ్డాడు.

అదే విధంగా ప్రేరణ కూడా నోరు జారీ తిట్టిందని అన్నాడు. ప్రేరణ అయితే రోహిణి దగ్గర నేను తిట్టాను అని ఒకసారి ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత రాత్రి పడుకునే ముందు యష్మీ వచ్చి అడగగా, నేను తిట్టలేదు అమ్మా..తిట్టుంటే నాకు గుర్తు ఉండేది కదా అని అంటుంది. ఇక్కడ స్పష్టంగా ప్రేరణ తిట్టింది అనే విషయం అర్థం అవుతుంది. కానీ గౌతమ్ మాత్రం తప్పుడు మాట అన్నట్టు ఎక్కడా కనిపించలేదు. లైవ్ లో, టీవీ టెలికాస్ట్ ఎపిసోడ్ లో పదే పదే వెనక్కి వెళ్లి చూసినా గౌతమ్ తిట్టినట్టు కనిపించలేదు. నిఖిల్ కి ఆ హీట్ మొమెంట్ లో గౌతమ్ అలా తిట్టినట్టు తప్పుగా అనిపించి ఉండొచ్చు, లేదా అతని మీద కోపం తో నిందలు వేసి ఉండొచ్చు. పక్కరోజు యష్మీ గౌతమ్ వద్దకి వెళ్లి అడిగినప్పుడు కూడా గౌతమ్ స్పష్టంగా చెప్తాడు.

నేను అసలు వాడిని తిట్టలేదు, మా అమ్మ మీద ఒట్టు, కావాలంటే వీకెండ్ లో ఆ క్లిప్స్ వేసి చూపించినా నాకు ఓకే. వాడు కేవలం నా మీద ఉన్న కోపాన్ని, కసిని మీరు నా టీం అవ్వడంతో మీ ఇద్దరి మీద చూపించాడు అని అంటాడు గౌతమ్. ఇదైతే కచ్చితంగా నిజమే అని చెప్పొచ్చు. గౌతమ్ కి ఎప్పుడైతే యష్మీ మీద క్రష్ ఉంది అనే విషయం నిఖిల్ కి తెలిసిందో, అప్పటి నుండి గౌతమ్ మీద పగ పెంచేసుకున్నాడు. ఎందుకంటే నిఖిల్ కి యష్మీ మీద ఇష్టం ఉంది కాబట్టి. యష్మీ ఓపెన్ గా నువ్వంటే ఇష్టం అని నిఖిల్ కి చెప్పేసింది. కానీ నిఖిల్ మాత్రం బయటకి చెప్పకుండా పరోక్షంగా ప్రేమని చూపిస్తూ వచ్చేవాడు. అది ఈ వారం బ్లాస్ట్ అయ్యి తారాస్థాయికి చేరుకుంది. నిన్న అయితే నిఖిల్ యష్మీ తో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మాట్లాడను అని ఆమె ముఖం మీదనే చెప్పేసాడు, మరి అదే మాట మీద నిలబడుతాడో లేదో చూడాలి.