Bigg Boss Telugu 8: నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ప్రేరణ కి ‘పుడింగి’ అనే పదం వాడినందుకు అంత క్లాస్ పీకడం అవసరమా? అని చూసే ఆడియన్స్ కి అనిపించింది. ఎందుకంటే ‘పుడింగి’ అనే పదం కంటే, ఆమె నిఖిల్ తో ‘F’ పదం తో స్టార్ట్ అయ్యే భూతుని మాట్లాడుతుంది. ఇది చాలా పెద్ద తప్పు, ఆ విషయంలో ఆమెకి ఎక్కువ క్లాస్ పీకాలి, కానీ అలా జరగలేదు. నిఖిల్ ని బూతులు తిట్టిన ప్రస్తావన అయితే తెచ్చాడు కానీ, ఎందుకో ఆ విషయంలో మాత్రం పడాల్సిన రేంజ్ లో కోటింగ్ పడలేదు అని చెప్పొచ్చు. ఆమె వాడిన ‘పుడింగి’ అనే పదాన్ని పెద్ద తప్పుగా చూపించిన నాగార్జున, చివరికి అదే పదాన్ని ఉపయోగించి ఆమెకి ఎలివేషన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రేరణకి నేను తప్పు చేశాను అనే బాధని కనీసం ఒక్క గంట కూడా ఉంచేందుకు ఇష్టపడలేదు నాగార్జున.
పూర్తి వివరాల్లోకి వెళ్తే నయనీ పావని ని ప్రేరణ నామినేషన్స్ సమయంలో పెద్ద పుండిగి లాగా మాట్లాడకు అని చాలా పొగరుగా, యాటిట్యూడ్ తో అంటుంది. కారణం హ్యాట్ టాస్క్ లో నేనే ప్రేరణ ని నామినేట్ చేశాను నయనీ అంటుంది. నీ వల్ల నేను నామినేట్ అవ్వలేదు, పృథ్వీ వల్ల అయ్యాను అంటుంది ప్రేరణ. పృథ్వీ కేవలం ఒక్కసారి మాత్రమే హ్యాట్ ఇచ్చాడు, కానీ నేను రెండుసార్లు ఇచ్చాను, అందుకే నువ్వు నామినేట్ అయ్యావు అని అంటుంది నయనీ. పెద్ద పుడింగివి ఇక చాలు ఆపు అని అంటుంది ప్రేరణ. ఇది కచ్చితంగా ఆమె బలుపుతోనే అన్న మాట. కానీ నాగార్జున దీనిని వ్యంగ్యంగా అన్నట్టు చెప్పుకొచ్చాడు. అక్కడ ఆమెని ‘నీ బలుపు తగ్గించుకో’ అని చెప్పాల్సింది పోయి, వ్యంగ్యంగా అన్నావు అని చెప్పడం ఏమిటి?, అలా చెప్తే ఆమె ఈ వారం కూడా అలాగే ప్రవర్తిస్తుంది. నువ్వు చాలా బలుపుతో వ్యవహరిస్తున్నావు, మొదటి నుండి నీ తీరు అలాగే ఉంది అని చెప్పాలి చెప్పాలి. నిజానికి ఆమె ప్రవర్తన అలాగే ఉంది, అది చెప్తే ఆమె తన ప్రవర్తనని మార్చుకునే అవకాశం ఉండేది. కానీ ఆ ప్రయత్నం చేయలేదు. అయితే అందరినీ ‘మాటలు జాగ్రత్త’ అని అంటూ ఉంటావు, నువ్వు మాత్రం జాగ్రత్తగా మాట్లాడవు అని అంటాడు నాగార్జున. ఇక్కడ మాత్రం కరెక్ట్ గా మాట్లాడాడు అనిపించింది.
మరోపక్క నిఖిల్ ని ‘F’ పాదంతో తిట్టిన తిట్టుకు కచ్చితంగా బలంగా నిలదీసి మాట్లాడాల్సిందే. పృథ్వీ గతంలో ఇలాగే మాట్లాడినందుకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఇంకోసారి అలా మాట్లాడితే రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపిస్తాను అని చెప్పాడు. ఆ రేంజ్ లో అయితే ప్రేరణ ని ఈ విషయం లో తిట్టలేదు. చివరికి ప్రేరణ తాను తప్పు చేసానని ఒప్పుకుంది, మళ్ళీ అలాంటివి రిపీట్ చేయను అని చెప్పింది, అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కోటింగ్ పడినందుకు ఆమె డల్ గా కూర్చొని ఉంది. ఆమె డల్ గా ఉంది కాబట్టి, ఆమెని నవ్వించే ప్రయత్నం చేయడం అంత అవసరమా..?, ఇదే ప్రయత్నం గౌతమ్ విషయం లో ఎందుకు చేయలేదు? అనే ప్రశ్న ప్రేక్షకుల్లో కలిగింది. చివరికి ‘పుడింగి’ అనే పదం వాడినందుకు ప్రేరణకు అంత క్లాస్ పీకిన నాగార్జున, అదే పదాన్ని ఉపయోగించి ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చాడు. ఇక ఆమె తప్పుల నుండి ఏమి నేర్చుకుంటుంది?, వచ్చే వారం కూడా ఇదే ప్రవర్తన చూపిస్తుంది. అయితే ప్రేరణ కి తన ప్రవర్తన ఆడియన్స్ లో చాలా నెగటివ్ చేసింది అనేది మాత్రం అర్థమైంది. ఇక నుండైనా ఆమె ఇది మార్చుకుంటే టైటిల్ రేస్ లోకి వస్తుంది.