Bigg Boss Telugu 8: నభీల్ కమ్యూనిటీ గురించి మాట్లాడడం పై నాగార్జున స్వీట్ వార్నింగ్..పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడానికి కారణం అదేనా?

శనివారం ఎపిసోడ్ లో అది జరగలేదు. నాగార్జున ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి, హౌస్ మేట్స్ తో ముచ్చట్లు ఆడడం మొదలు పెట్టాడు. ఇది ప్రేక్షకులకు అసలు నచ్చలేదు.

Written By: Vicky, Updated On : October 21, 2024 8:05 am

Bigg Boss Telugu 8(137)

Follow us on

Bigg Boss Telugu 8: గత వారం బిగ్ బాస్ హౌస్ లో నభీల్, మెహబూబ్ మధ్య జరిగిన కమ్యూనిటీ ఓట్ల చర్చ సోషల్ మీడియా లో ఎంత సెన్సేషనల్ గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ చర్చకి సంబంధించిన వీడియో నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అయ్యింది. వీళ్ళను అభిమానించే వాళ్ళు కూడా మండిపడ్డారు. అంటే ముస్లిం కమ్యూనిటీ ఓట్లు మాత్రమే కావాలా?, మిగతా మతాలకు చెందిన ఓట్లు అవసరం లేదా?, నభీల్ ని చాలా నిజాయితీ పరుడని అనుకున్నామని, కానీ ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని తెలియలేదని, ఇలా సోషల్ మీడియా లో ఎన్నో రాకలుగా అనుకున్నారు ఆడియన్స్. అయితే ఈ చర్చకు సంబంధించిన వీడియోని టీవీ టెలికాస్ట్ లో చూపించలేదు. నభీల్, మెహబూబ్ కి అనుకూలంగా బిగ్ బాస్ టీం ప్రవర్తిస్తుంది, కనీసం నాగార్జున అయినా ప్రత్యేకంగా దీని గురించి ప్రస్తావించి, ఇద్దరికీ బలమైన వార్నింగ్ ఇవ్వాలని ప్రేక్షకులు కోరుకున్నారు.

కానీ శనివారం ఎపిసోడ్ లో అది జరగలేదు. నాగార్జున ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి, హౌస్ మేట్స్ తో ముచ్చట్లు ఆడడం మొదలు పెట్టాడు. ఇది ప్రేక్షకులకు అసలు నచ్చలేదు. శనివారం ఎపిసోడ్ మంచి ఫైర్ మీద ఉంటుందని అందరూ భావించారు కానీ, బిగ్ బాస్ హిస్టరీ లోనే ఈ శనివారం ఎపిసోడ్ ‘ది వరస్ట్’ అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొచ్చారు. అయితే ఆదివారం ఎపిసోడ్ ప్రారంభం లో నాగార్జున నభీల్, మెహబూబ్ మధ్య జరిగిన కమ్యూనిటీ చర్చ గురించి పరోక్షంగా మాట్లాడాడు. ఆయన అర్థం అవ్వాల్సిన వాళ్లకు అర్థం అయ్యేట్టు చెప్తూ ‘మనం చాలా సీరియస్ గా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి.

బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ తెలుసుకొని వస్తారు. కానీ అవన్నీ ఇక్కడికి రాగానే మర్చిపోతారు. ఒకసారి గుర్తు చేయమంటారా..?, బిగ్ బాస్ హౌస్ లో ఎటువంటి బయాస్ కి అవకాశం లేదు. బిగ్ బాస్ హౌస్ అనేది జెండర్ న్యూట్రల్, కమ్యూనిటీ న్యూట్రల్. హౌస్ మేట్స్ అందరికీ చెప్తున్నాను ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి’ అని అంటాడు.
ఇలా పరోక్షంగా చెప్పడం ఎందుకు, నేరుగా మాట్లాదోచు కదా?, మణికంఠ యష్మీ ని కౌగలించుకున్నప్పుడు, యష్మీ ఇబ్బందికి గురైన విషయాన్ని నాగార్జున మణికంఠ ని ప్రత్యేకంగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి, వీడియో వేసి చూపించి మాట్లాడినట్టుగా, మెహబూబ్, నభీల్ లో ఎందుకు మాట్లాడలేదు?, మణికంఠ కి ఒక రూల్, మిగిలిన కంటెస్టెంట్స్ కి మరో రూలా? అని ప్రేక్షకులు సోషల్ మీడియా లో మండిపడ్డారు. కానీ ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండడానికి పలు కారణాలు ఉన్నాయి. అవేమిటంటే టీవీ షోస్ ప్రైమ్ టైం లో కమ్యూనిటీ గురించి మాట్లాడడం కానీ, టీవీ టెలికాస్ట్ లో చూపించడం కానీ చేయకూడదు. ఒకవేళ చేస్తే అది చట్ట రీత్యా నేరం. అందుకే టీవీ టెలికాస్ట్ లో మెహబూబ్, నభీల్ మధ్య జరిగిన చర్చని చూపించలేదు, అదే విధంగా నాగార్జున కూడా దీని గురించి మాట్లాడలేదని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.