Bigg Boss Telugu 8: ఈసారి బిగ్ బాస్ సీజన్ లో హోస్ట్ నాగార్జున తో పాటు, బిగ్ బాస్ కూడా అనేక సందర్భాలలో అన్యాయమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి మాత్రమే కాదు, బయట ఆడియన్స్ కి కూడా అలాగే అనిపించింది. మూడవ వారం లో ఎలిమినేట్ అయిన అభయ్ బిగ్ బాస్ నిర్ణయాలను తప్పుబడుతూ ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసాడు. అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే ఆడియన్స్ ఆయన్ని బయటకి నెట్టేశారు. కానీ ఇప్పుడు హౌస్ లో జరుగుతున్నా పలు సంఘటనలు చూస్తుంటే అభయ్ చెప్పింది మొత్తం నిజమే అని అనిపిస్తుంది. ఈరోజు నాగార్జున కూడా అదే చేసాడు. మణికంఠ విషయం లో ఆయన చాలా అన్యాయం చేసాడని చూసే ఆడియన్స్ కి అనిపించింది..మణికంఠ గ్రాఫ్ ని ఆడియన్స్ లో మరింత పెరిగేలా చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే షో ప్రారంభం అవ్వగానే మణికంఠ ని యాక్షన్ రూమ్ లోకి పిలిపిస్తాడు నాగార్జున. అక్కడ టేబుల్ మీద అనేక టిష్యూ పేపర్ బండిల్స్ ఉంటాయి. నీకు 8 నిమిషాలు ఉన్నాయి, ఎంత ఏడుస్తావో ఏడ్చేయి అంటాడు నాగార్జున. ఆ తర్వాత అతని భార్య ప్రియ పంపించిన వంటకం గురించి, మెసేజి గురించి అప్డేట్ ఇస్తాడు నాగార్జున. వంటకం పంపింది అతను భార్య ప్రియ కాదట, మణికంఠ స్నేహితుడట. కానీ మెసేజి పంపింది మాత్రం ప్రియనే అని చెప్తాడు నాగార్జున. దయచేసి నాకు ఆ మెసేజ్ చూపిస్తారా సార్ ప్లీజ్ అని మణికంఠ బ్రతిమిలాడుతాడు. కానీ నాగార్జున ఆ పని చేయడు. కానీ యష్మీ కి మాత్రం ఆమె తండ్రి పంపిన మెసేజ్ ని సగానికి పైగా చెప్పేస్తాడు నాగార్జున. ఇదెక్కడి న్యాయం, చెప్తే ఏమి మెసేజి వచ్చిందో ఇద్దరికీ చెప్పాలి, లేదంటే సైలెంట్ గా ఉండాలి. ఇలా ఒకరికి చెప్పి, మరొకరికి చెప్పకపోతే ఎలా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నాగార్జునని ప్రశ్నిస్తున్నారు. మణికంఠ తన భార్య ని, కూతురుని ఎంత మిస్ అవుతున్నాడో అందరికీ తెలిసిందే. తన భార్య నుండి ఎలాంటి మెసేజ్ వచ్చిందో చెప్తే తన మనోధైర్యాన్ని పెంచుకొని గేమ్ ఆడేందుకు ఉపయోగించుకునేవాడు కదా?, మరి ఎందుకు ఆ పని చేయలేదు?, మణికంఠ కి జనాల్లో సానుభూతి పెంచి అతని చేతిలో కప్పు పెట్టి పంపించే స్కీం బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తున్నాయి.
హౌస్ లో జరుగుతున్న ప్రతీ సందర్భం మణికంఠ ఉపయోగించుకునేలాగానే బిగ్ బాస్ ప్లాన్ చేసాడు. ఈ శనివారం ఎపిసోడ్ కూడా అలాగే అనిపించింది. నాగార్జున అంతలా రిక్వెస్ట్ చేసినప్పుడు కచ్చితంగా మెసేజి ఏమొచ్చిందో చూపించేవాడు, గత సీజన్స్ లో ఇలా చాలా సార్లు చేసాడు. కానీ మణికంఠ విషయం లో ఎందుకు అలా చేయలేదు?, ఆ మెసేజ్ లో ఏమైనా నెగటివ్ ఉందా?, అది చూపిస్తే మణికంఠ తట్టుకోలేడని నాగార్జున అలా చేశాడా?, లేదా భవిష్యత్తులో ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.