https://oktelugu.com/

Anasuya Bhardwaj : అమ్మాయికి అండగా రంగంలోకి దిగిన యాంకర్ అనసూయ.. జానీ మాస్టర్ గురించి మరికొన్ని సంచలన నిజాలు బయటపెట్టింది!

'పుష్ప 2 : ది రూల్' చిత్రం లో ఆమె ఒక పాటకు కొరియోగ్రఫీ చేసింది. అల్లు అర్జున్ కూడా జానీ మాస్టర్ వ్యవహారం పై అంతర్గతంగా స్పందించి శ్రేష్టి వర్మ కి తన ప్రతీ సినిమాలో కొరియోగ్రఫీ చేసే అవకాశం కల్పిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా జానీ మాస్టర్ కి ఎంతో క్లోజ్ గా ఉండే సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా వ్యతిరేకంగా మారింది,

Written By:
  • Vicky
  • , Updated On : September 18, 2024 / 07:53 PM IST

    Anchor Anasuya Bhardwaj sensational comments on Johnny Master affair

    Follow us on

    Anasuya Bhardwaj : బుల్లితెర యాంకర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి, నేడు ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ క్యారక్టర్ ఆర్టిస్టులలో ఒకరిగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాదు సోషల్ మీడియా లో కూడా ఈమె రెగ్యులర్ గా యాక్టీవ్ ఉంటుంది. అనేక సందర్భాలలో ఈమె తన గొంతుక ని వినిపించడంలో ఏ మాత్రం వెనకడుగు వేయదు. పలుమార్లు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్రమైన నెగటివిటీ ని కూడా మూటగట్టుకుంది. అంతే కాదు ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పై డైరెక్టుగా ఎన్నో విమర్శలు చేస్తూ అతని అభిమానుల చేత ట్రోల్ కి గురికాబడింది అనసూయ. అయితే ఇప్పుడు రీసెంట్ గా జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం లో కూడా ఆమె తన వాయిస్ ని వినిపించింది. ఆమె మాట్లాడుతూ ‘నేను పుష్ప సినిమా చేస్తున్నప్పుడు సెట్స్ లో శ్రేష్టి వర్మ ని చూసా.

    ఆమె టాలెంట్ ని చూసి ఆశ్చర్యపోయాను. టాలెంట్ ఉన్నవారిని ఇండస్ట్రీ లో ఏ శక్తి కూడా ఆపలేదు. ఎవరూ కూడా ఆమె అవకాశాలకు గండికొట్టలేరు. ఆమెకు తగిన రీతిలో న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇండస్ట్రీ లో అన్యాయాన్ని ప్రశ్నించే తత్త్వం ఉందాలి. ఆడవాళ్ళ పై ప్రతీ ఇండస్ట్రీ లో లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. శ్రేష్టి వర్మ లాగా అందరూ ధైర్యంగా అడుగు ముందుకు వేసి ఇలా కంప్లైంట్స్ ఇవ్వాలి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, చట్టం ముందు ఎవరైనా తలవంచాల్సిందే’ అంటూ అనసూయ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అనసూయ, జానీ మాస్టర్ ఇద్దరు కూడా ఈటీవీ కుటుంబం నుండి వచ్చిన వారే, అనేక సందర్భాలలో ఈటీవీ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఎంటర్టైన్మెంట్ షోస్ లో వీళ్లిద్దరు కలిసి చేసారు. అంతే కాకుండా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ‘రంగస్థలం’, ‘పుష్ప’ చిత్రాలకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేసాడు.

    ఆయన టీం ద్వారా శ్రేష్టి వర్మ కూడా అప్పుడు పుష్ప సెట్స్ లో కనిపించేది. ఆ అనుభవం తోనే అనసూయ ఈ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం శ్రేష్టి వర్మ కొరియోగ్రాఫర్ గా మారింది. ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం లో ఆమె ఒక పాటకు కొరియోగ్రఫీ చేసింది. అల్లు అర్జున్ కూడా జానీ మాస్టర్ వ్యవహారం పై అంతర్గతంగా స్పందించి శ్రేష్టి వర్మ కి తన ప్రతీ సినిమాలో కొరియోగ్రఫీ చేసే అవకాశం కల్పిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా జానీ మాస్టర్ కి ఎంతో క్లోజ్ గా ఉండే సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా వ్యతిరేకంగా మారింది, శ్రేష్టి వర్మ కి అండగా నిలబడింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీ లో ఉన్నాడు, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.