Bigg Boss Telugu 8: కొత్త చీఫ్ గా నాగ మణికంఠ..? ఆదివారం కంటెస్టెంట్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ ఇవ్వబోతున్న నాగార్జున!

హౌస్ లో కచ్చితంగా కనీసం రెండు క్లాన్స్ ఉండాలి. కాబట్టి నాగార్జున చేత మరో చీఫ్ ఎంపిక అయ్యే అవకాశం ఉంది. అయితే హౌస్ లో ఈ వారం ఏ తప్పు చేయని వారినే నాగార్జున చీఫ్ ని చేసే అవకాశం ఉంది. ఆ యాంగిల్ లో ఆలోచిస్తే మణికంఠ తప్ప, ఈ వారం ప్రతీ కంటెస్టెంట్ లిమిట్స్ దాటి తప్పులు చేసారు. ప్రేరణ,యష్మీ వంటి వారు ఆడ సింహాలు లాగా పోరాడారు, కానీ కొన్ని చోట్ల నోరు జారారు. అభయ్ చీఫ్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.

Written By: Vicky, Updated On : September 21, 2024 8:46 am

Bigg Boss Telugu 8(34)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ చేసినన్ని తప్పులు , ఏ సీజన్ లో కూడా కంటెస్టెంట్స్ చేయలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక్కొక్కరు మనుషులు అనే విషయాన్ని మర్చిపోయారు. మానవ మృగాలు లాగా ప్రవర్తించారు. ఒకరిని ఒకరు విసిరి కొట్టుకోవడం. ఇష్టమొచ్చినట్టు నోరు జారడం, ఏకంగా బిగ్ బాస్ ని దుర్భాషలాడడం, ఆయన మీద జోకులు వేయడం, ఇలా కంటెస్టెంట్స్ చేయని తప్పంటూ ఏది మిగలలేదు. కానీ టాస్కు ని మాత్రం బాగా ఆడారు, ఈ వారం టీఆర్ఫీ రేటింగ్స్ కూడా అత్యధికంగా వచ్చాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇదంతా పక్కన పెడితే చీఫ్ అభయ్ బిగ్ బాస్ ని దుర్భాషలు ఆడిన కారణంగా అతనిని, అతని టీం ని చీఫ్ కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశం నుండి తప్పించాడు బిగ్ బాస్. నిఖిల్ క్లాన్ నుండి నిఖిల్, సోనియా పోటీ పడగా, నిఖిల్ టాస్కుని గెలిచి మూడవసారి చీఫ్ గా ఎంపిక అయ్యాడు.

అయితే హౌస్ లో కచ్చితంగా కనీసం రెండు క్లాన్స్ ఉండాలి. కాబట్టి నాగార్జున చేత మరో చీఫ్ ఎంపిక అయ్యే అవకాశం ఉంది. అయితే హౌస్ లో ఈ వారం ఏ తప్పు చేయని వారినే నాగార్జున చీఫ్ ని చేసే అవకాశం ఉంది. ఆ యాంగిల్ లో ఆలోచిస్తే మణికంఠ తప్ప, ఈ వారం ప్రతీ కంటెస్టెంట్ లిమిట్స్ దాటి తప్పులు చేసారు. ప్రేరణ,యష్మీ వంటి వారు ఆడ సింహాలు లాగా పోరాడారు, కానీ కొన్ని చోట్ల నోరు జారారు. అభయ్ చీఫ్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆయన ఎలాంటి టాస్కు ఆడలేదు, ఆడవారిని కూడా ఆపే ప్రయత్నం చేసాడు. అలాంటి చీఫ్ ని నిలదీయాల్సింది పోయి, క్లాన్ లో ఉన్న సభ్యులు మొత్తం సమర్దించారు, ఒక్క మణికంఠ తప్ప. అభయ్ గుడ్ల టాస్కులో నిఖిల్ క్లాన్ సభ్యులు వచ్చి అటాక్ చేస్తే చాలా తేలికగా వదిలేసాడు. యష్మీ, ప్రేరణ ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని ‘చీఫ్ గా మీకు చెప్తున్నాను..ఆగిపోండి’ అని వాళ్ళను ఆపేసాడు. కానీ మణికంఠ ఆగలేదు, మేము కష్టపడి సంపాదించిన గుడ్లను వాళ్ళు దోచుకొని పోతుంటే ఎలా సైలెంట్ గా ఉంటారు అన్నా అని నిలదీసాడు.

విష్ణు ప్రియ, ప్రేరణ మధ్య జరిగిన దోశ సంఘటన లో తలదూర్చి, దానిని పెద్దది చేసి తప్పు చేసాడు కానీ, ఈ వారం మొత్తం మణికంఠ లో భూతద్దం వేసి వెతికిన అది తప్ప మరో తప్పు ఆయనలో కనిపించదు. ఫిజికల్ గా చాలా వీక్ అయినప్పటికీ కూడా అద్భుతంగా ఆడాడు, కాబట్టి ఇతన్ని నాగార్జున మెచ్చుకొనే అవకాశం ఉంది. అంతే కాదు, అతనిని చీఫ్ గా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఏమి జరగబోతుందో అనేది నేటి ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాలి. ఒక్కటైతే నిజం, ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున విశ్వరూపం ని హౌస్ మేట్స్ చూడబోతున్నారు.