Bigg Boss Telugu 8: నోరు జారేసిన విష్ణు ప్రియ..’ఇది నువ్వు అనుకునే షో కాదు..జాగ్రత్తగా ఉండు’ అంటూ బిగ్ బాస్ వార్నింగ్!

బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులు వీక్షించే షో. ఇక్కడ కేవలం తెలుగు మాత్రమే మాట్లాడాలి. గత సీజన్ లో యావర్ కి తెలుగు రాకపోయినా కూడా బిగ్ బాస్ హౌస్ లో నేర్చుకున్నాడు. అది ఆయన బిగ్ బాస్ రియాలిటీ షో కి ఇచ్చిన విలువ. కానీ విష్ణు ప్రియ తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మొదటి వారం లో నాగార్జున హౌస్ మేట్స్ ఇంగ్లీష్ మాట్లాడినందుకు గెలిచిన పే మనీ నుండి రెండు లక్షల రూపాయిలు కట్ చేసాడు.

Written By: Vicky, Updated On : September 21, 2024 8:42 am

Bigg Boss Telugu 8(33)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ముఖానికి ఎలాంటి మాస్కు లేకుండా ఆడుతున్న వారిలో విష్ణు ప్రియ కూడా ఒకరు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ వారం ఆమె కూడా మాస్క్ తీసేసింది. చిన్న దోశ దగ్గర ఈమె చేసిన డ్రామా ని చూసి, ఆమెని అభిమానించే వారు కూడా ‘ఛీ’ కొట్టారు. ఈ సంఘటన తర్వాత ప్రేరణ విష్ణు తన గురించి తప్పుగా అనుకుంటుందేమో అని భావించి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పింది. ఆ తర్వాత దోశ ని వేసుకొని, రూమ్ లోకి వచ్చి మరీ ఆమెకి తినిపించింది. ఇక్కడితో విష్ణు ప్రియ ఆ గొడవని మర్చిపోతుందేమో అని అనుకున్నారు అందరూ. కానీ దానిని కొనసాగిస్తూ పోయింది, టాస్కులలో ఆమె ప్రేరణ పై చూపించిన అసూయ ని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు వీక్షించారు. దీంతో టాప్ ఓటింగ్ తో కొనసాగిన విష్ణు ప్రియ గ్రాఫ్ ఈ వారం అమాంతం పడిపోయింది. ఇంకో వారం రోజులు ప్రేరణ టాస్కులు బాగా ఆడితే, ఈమె స్థానాన్ని ఆమె ఆక్రమించుకోగలదు. ప్రస్తుతం ట్రెండ్ అలాగే ఉంది. ఇదంతా పక్కన పెడితే నేడు విష్ణు ప్రియకి బిగ్ బాస్ నుండి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ వినిపించింది.

బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులు వీక్షించే షో. ఇక్కడ కేవలం తెలుగు మాత్రమే మాట్లాడాలి. గత సీజన్ లో యావర్ కి తెలుగు రాకపోయినా కూడా బిగ్ బాస్ హౌస్ లో నేర్చుకున్నాడు. అది ఆయన బిగ్ బాస్ రియాలిటీ షో కి ఇచ్చిన విలువ. కానీ విష్ణు ప్రియ తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మొదటి వారం లో నాగార్జున హౌస్ మేట్స్ ఇంగ్లీష్ మాట్లాడినందుకు గెలిచిన పే మనీ నుండి రెండు లక్షల రూపాయిలు కట్ చేసాడు. ఈ స్థాయి శిక్ష విధించినా కూడా హౌస్ మేట్స్ లో కొందరు కంటెస్టెంట్స్ ఇప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నారు, వారిలో విష్ణు ప్రియ ప్రధమం.

నిన్న బిగ్ బాస్ ఆమెకి వార్నింగ్ ఇస్తూ ‘విష్ణు ప్రియ..ఇది నువ్వు ఇంగ్లీష్ షో అని అనుకుంటున్నావేమో, కాదు, తెలుగు వాళ్ళు చూసే షో. బిగ్ బాస్ పలుమార్లు తెలుగు మాట్లాడాలి అని హెచ్చరించినా కూడా మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇంకోసారి ఇలా రిపీట్ చేస్తే మీపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు బిగ్ బాస్ ఏమాత్రం వెనుకాడడు’ అంటూ హెచ్చరించాడు. బిగ్ బాస్ కేవలం హెచ్చరించాడు. కానీ నాగార్జున మాత్రం ఈ వీకెండ్ విష్ణు ప్రియ కి శిక్ష ఇవ్వొచ్చు. అంతే కాదు ఈ వారం హౌస్ మేట్స్ అందరూ లెక్క లేనన్ని తప్పులు చేసారు. దీనికి పే మనీ రాకపోగా, ఇప్పటి వరకు సంపాదించుకున్నది మొత్తం కట్ చేసే ప్రమాదం కూడా ఉంది. మరి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది నేడు జరగబోయే ఎపిసోడ్ లో చూడాలి.