https://oktelugu.com/

Cyber Crime: మీ ఆరోగ్యం అంగట్లో.. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వినియోగదారులకు ఇది “సైబర్” హెచ్చరిక..

స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని నడిపిస్తోంది. సోషల్ మీడియా, న్యూస్, బ్యాంకింగ్, వై నాట్, వాట్ నాట్.. ప్రతి ఒక్కటి దాని ద్వారానే.. దాని మీదుగానే..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 21, 2024 / 08:50 AM IST

    Cyber Crime

    Follow us on

    Cyber Crime: స్మార్ట్ ఫోన్ తో మనిషి జీవితం సుఖమయం అయింది. ప్రతి పని దాని ద్వారానే జరగడం వల్ల అలసట తప్పింది. గంటలు గంటలు ఎదురుచూసే బాధ తప్పింది. అయితే ఇక్కడే మంచి వెనుక చెడు ఉన్నట్టు.. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో సైబర్ ముఠా కూడా దాగి ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దాడి చేస్తుంది. మనకు తెలియకుండానే మన డబ్బును లాగేస్తుంది. తీరా అసలు విషయం తెలిసిన తర్వాత లబోదిబో అనడం తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో దాయడానికి ఏమీ లేదు. దాచేస్తే దాగేదంటూ ఏదీ లేదు. సైబర్ ముఠాలు కాచుకొని ఉన్న నేటి రోజుల్లో రహస్యం అనేది లేదు. సమాచారం జాగ్రత్తగా ఉంది.. భద్రంగా ఉంది.. అని అనుకోవడం తప్ప.. చేసేది కూడా ఏమీ లేదు.

    డాటాను చోరీకి గురి చేశారు

    మనదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల్లో అతిపెద్దది స్టార్ గ్రూప్. ఈ కంపెనీ నుంచి భారీగా వినియోగదారుల సమాచారం చోరీకి గురైంది. లక్షల మంది కస్టమర్లకు చెందిన సమాచారాన్ని బహిరంగంగా విక్రయించారట. ఈ విషయం స్టార్ కంపెనీని ఆందోళనకు గురి చేస్తోంది. టెలిగ్రామ్ లోని చాట్ బాట్స్ ద్వారా ఈ సమాచారం అందుబాటులో ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు అరెస్ట్ కావడం.. ఈ వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనాన్ని కలిగిస్తున్నాయి.. కస్టమర్ల సమాచారం మొత్తం లీక్ అయిన విషయాన్ని చాట్ బాట్ ఫౌండర్.. ఓ సెక్యూరిటీ రీసర్చర్ కు చెప్పాడు. అతడు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లాడు. ” లక్షలమంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకానికి పెట్టారు. చాట్ బాట్లను అడిగితే ఈ సమాచారం పొందవచ్చని” అతడు వివరించాడు.. ఈ విషయం కాస్త పెద్దది కావడంతో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ స్పందించక తప్పలేదు. ” . ఇలాంటి విషయాల్లో మేం జాగ్రత్తగా ఉంటాం. రాజీపడే అవకాశం లేదు. కస్టమర్ల సమాచారాన్ని సురక్షితంగా భద్రపరిచామని” వివరించింది. ఇది ఇలా ఉండగానే చాట్ బాట్లను ఉపయోగించి పాలసీ చేసుకోవచ్చని, క్లెయిమ్ దస్త్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని స్టార్ గ్రూప్ చెప్పడం విశేషం. అంతేకాదు కస్టమర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్, సమాచారం, గుర్తింపు కార్డులు, పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందొచ్చని సూచించింది.. టెలిగ్రామ్ ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని భావించి ఆ సంస్థ ఫౌండర్ పావెల్ దురోవ్ ను పారిస్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. నేరాలు, వ్యవస్థీకృత మోసాలు, మాదకద్రవ్యాలు, అక్రమంగా రవాణా, దారుణాలను ప్రోత్సహించడం, మాదకద్రవ్యాల రవాణా వంటి ఆరోపణల పై అతడిని హజార్ బైజాన్ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు . అతనిపై అనేక నేరాభియోగాలు ఉన్నాయి.