Bigg Boss Telugu 8: వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లోపలకు వచ్చే ముందు గౌతమ్ ని నాగార్జున ‘హౌస్ లో ఎవరు దమ్ముగా ఆడుతున్నారు?’ అని అడగగా, గౌతమ్ నబీల్ పేరు చెప్తాడు. మొదటి వారంలో గౌతమ్ ని నబీల్ టార్గెట్ చేసినప్పటికీ , మూడవ వారం నుండి అనేక సందర్భాలలో గౌతమ్ నబీల్ కి సపోర్టుగా నిలబడ్డాడు. మెగా చీఫ్ పోటీలలో ఇన్ని రోజులు నబీల్ మిత్రులు అనుకుంటూ వచ్చిన వాళ్ళు సపోర్టు ఆయనకీ సపోర్టు చేయని సమయంలో, గౌతమ్ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసాడు. అదే విధంగా నబీల్ కి ‘ఏవిక్షన్ పాస్’ రావడానికి కూడా గౌతమ్ ఒక కారణం అయ్యాడు. ఇలా హౌస్ లో గౌతమ్ అనేక సందర్భాల్లో నబీల్ కి అండగా నిలబడితే, నబీల్ గౌతమ్ వెనుకచేరి ‘ఇతనికి ఓట్లు ఎలా వేస్తున్నారు రా బాబు’ అని యష్మీ, ప్రేరణ, విష్ణు ప్రియ వంటి వారితో చర్చలు నడిపాడు.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో అయితే ఆయన నేరుగా గౌతమ్ ని టార్గెట్ చేసి నామినేట్ చేసాడు. అందుకు ఆయన చెప్పిన పాయింట్స్ చాలా సిల్లీ గా అనిపించాయి. నబీల్ తన మొదటి నామినేషన్ పాయింట్ ని చెప్తూ ‘మొన్న కంప్లైంట్ లో నేను ఒక్కో వారం ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలాగా ఉంటున్నావు అన్నావు.. నేను ఎక్కడ అలా ఉన్నాను?’ అని అడుగుతాడు. దానికి గౌతమ్ సమాధానం చెప్తూ ‘నైనికా మొన్న నువ్వు నాతో మంచిగా ఉంటూ..వెనుక చేరి నాకు ఓట్లు ఎలా వేస్తున్నారు..?, నన్ను ఎలా టాప్ 5 లో పెడుతున్నారు జనాలు అని యష్మీ తో నువ్వు మాట్లాడడం నాకు నచ్చలేదు’ అని అంటాడు. దానికి నబీల్ సమాధానం చెప్తూ ‘నేను ఆ మాట అనలేదు. నైనికా వెళ్లిన మరుక్షణమే నేను నీ దగ్గరకు వచ్చి చెప్పాను. నువ్వు నాతో మంచిగా ఉంటున్నావు కదా ?, అలాంటప్పుడు ఆమె చెప్పిన మాటలు ఎలా నమ్మావు?’ అని అంటాడు.
దానికి గౌతమ్ కౌంటర్ ఇస్తూ ‘ఆమె ఒక ప్రేక్షకురాలిగా చూసి వచ్చి చెప్పింది. ఆమె మాటలు నమ్మకుండా నిన్ను ఎలా నమ్ముతాను’ అని చెప్పుకొస్తాడు. అలా వీళ్లిద్దరి మధ్య వాదనలు నడుస్తూ ఉంటాయి. అప్పుడు గౌతమ్ ‘నేను నిన్ను చాలా జెన్యూన్ అనుకున్నాను నబీల్..మిత్రుడివి అని నమ్మాను, కానీ మిత్ర ద్రోహం చేసావు’ అంటూ చెప్పుకొచ్చాడు. నేను మిత్ర ద్రోహం చేయలేదు, తప్పు అనిపించింది చెప్పాను. మొన్న కూడా నువ్వు అనవసరంగా ఆరవ వారంలో జరిగిన విషయాన్ని తీసుకొచ్చావు. ఈ మధ్యలో ఎన్నో జరిగాయి, రెండు క్లాన్స్ కలిసిపోయాయి, అవినాష్ ని మెగా చీఫ్ చేశాను, ఏవిక్షన్ షీల్డ్ ఇచ్చాను, ఇంత మంచి వాతావరణం ఉన్న సమయంలో నువ్వు ఆ పాయింట్ ని తీసుకొని రావడం నాకు అసలు నచ్చలేదు అని అంటాడు నబీల్. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నువ్వు నాలో ఫైర్ లేదు అన్నావు, నేను కూడా నిన్ను నామినేషన్స్ సమయంలో తప్ప, నీ గేమ్ లో ఎప్పుడూ ఫైర్ చూడలేదు’ అని అంటాడు నబీల్. సరే ఫైర్ అడిగావు కదా, గ్రాముల్లో, కిలోల్లో కాదు, టన్నుల లెక్క ఇస్తాను ఫైర్ అని అంటాడు గౌతమ్.