buttermilk : ఎంత టేస్టీ ఫుడ్, ఎన్ని రకాల కూరలతో తిన్నా సరే తర్వాత పెరుగుతో తింటేనే మజా కదా. చివరికి కాస్త పెరుగు లేకపోతే వామ్మో ఆ భోజనం ఫుల్ గా పూర్తి అయినట్టు అనిపించదు. పెరుగు అయినా ఉండాలి లేదంటే భోజనం తర్వాత మజ్జిగ అయినా ఉండాలి. వీటి వల్ల ప్రయోజనాలు కూడా మెండేనండోయ్. మజ్జిగ శరీరానికి శక్తిని అందించడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కడుపు సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. శరీర వేడి నియంత్రణలో ఉంటుంది. మజ్జిగలో జీలకర్ర పొడి, తేనె, మిరియాల పొడి కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలు అందుతాయి అంటున్నారు నిపుణులు.
మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి పేగు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇవి మంచి విధమైన బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. తద్వారా ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల గ్యాస్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాదు మజ్జిగ చర్మానికి మెరుపును కూడా అందిస్తుంది. ఇది లోపల నుంచి చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
మజ్జిగ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుంది. అంతేకాదు ఎక్కువ వేడి పనులు చేసే వారికి చాలా ఉపశమనం కలిగిస్తుంది. మజ్జిగలో ఉండే పానీయాలు శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు తీసివేస్తాయి. అంతేకాదు కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది ఈ మజ్జిగ. మజ్జిగలో తక్కువ కొవ్వు ఉంటుంది.
శరీరానికి భారం పెరగకుండా అవసరమైన పోషకాలను అందిస్తుంది మజ్జిగ. ముఖ్యంగా డైట్ చూసుకునే వారు మజ్జిగను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కూడా అందుతాయి. ఇక భోజనం తర్వాత మజ్జిగ తాగితే గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తొలిగిపోతాయి. హృదయ ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది మజ్జిగ. ఇందులో ఉండే పోషకాలు రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది హృదయానికి మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మజ్జిగలో కాల్షియం, విటమిన్ D లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఎముకల బలానికి ఆరోగ్యానికి అందిస్తాయి. మజ్జిగను ప్రతి రోజూ తాగితే ఎముకల సమస్యలు, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
భోజనం తర్వాత మజ్జిగ తాగడం ప్రతి రోజు అలవాటు చేసుకోండి. దీని వల్ల శరీరానికి చాలా మంచి జరుగుతుంది. శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది కూడా. అంతేకాదు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది మజ్జిగ. కాబట్టి రోజువారీ జీవనశైలి లో మజ్జిగను తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. కానీ చల్లగా ఉన్నప్పుడు మాత్రం కాస్త తక్కువగా తీసుకోండి. అధికంగా తాగకూడదు. మరో ముఖ్యమైన విషయం నాణ్యత గల పెరుగు నుంచి మాత్రమే ఈ మజ్జిగను తయారు చేసుకోండి.