Bigg Boss Telugu 8: నిన్న బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ అయ్యేందుకు జరిగిన ‘రాజు అయ్యేది ఎవరు’ టాస్క్ లో నబీల్ గెలిచి మెగా చీఫ్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఆడియన్స్ లో పృథ్వీ గ్రాఫ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. అతను ఈ టాస్కు ని ఆడిన తీరు అద్భుతం. నబీల్ కంటే అత్యంత వేగంగా ఆయన అతి కష్టమైన ఈ టాస్కుని చాలా తేలికగా పూర్తి చేసాడు. అంత కష్టపడి ఆడిన తర్వాత ఓడిపోయినప్పుడు ఎలాంటి వాడికైనా చాలా బాధ కలుగుతుంది. పైగా పృథ్వీ లాంటి కోపస్తులకు ఇంకా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎక్కడా నోరు జారకుండా జెంటిల్ మ్యాన్ అనిపించుకున్నాడు. పక్కన పృథ్వీ అటెన్షన్ కోసం పరితపిస్తున్న యష్మీ, ప్రేరణ సంచాలక్ గా తప్పుడు నిర్ణయం తీసుకుంది అని ఆమె మీద లేనిపోనివి చెప్పి పృథ్వీ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, పృథ్వీ రేచిపోలేదు. చాలా బ్యాలన్స్ గా ఉన్నాడు, ఇది ఆడియన్స్ కి తెగ నచ్చేసింది.
సోనియా కారణంగా పృథ్వీ బయట జనాలకు చాలా నెగటివ్ గా ప్రొజెక్ట్ అయ్యాడు కానీ, వాస్తవానికి పృథ్వీ చాలా మంచోడు అనే అభిప్రాయం ప్రతీ ఒక్కరిలో ఈ వారంతో కలిగింది. ప్రస్తుతానికి పృథ్వీ నామినేషన్స్ లోకి వస్తే కచ్చితంగా ఇంతకు ముందులాగా డేంజర్ జోన్ లో అయితే ఉండడు. కానీ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా మారాలంటే మాత్రం పృథ్వీ ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆదివారం నుండి హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా 8 మంది రాబోతున్నారు. వీళ్లంతా పాత సీజన్స్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్లకు ఫ్యాన్ బేస్ చాలా బలంగానే ఉంటుంది. వీళ్ళను తట్టుకొని పృథ్వీ టాప్ 5 కి రావాలంటే ఇదే తరహాలో ఆయన గేమ్ ని కొనసాగించాల్సి ఉంటుంది. అయితే పృథ్వీ ని ఇప్పుడు హౌస్ యష్మీ, విష్ణు ప్రియ ఇద్దరు లైన్ వేస్తున్నారు. వీళ్ళ ట్రాప్ లో పడ్డాడంటే మాత్రం పృథ్వీ ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఇదంతా పక్కన పెడితే నిన్న పృథ్వీ టాస్క్ కచ్చితంగా గెలిచే వాడే, కానీ నిఖిల్ ఇచ్చిన సూచనల కారణంగానే ఓడిపోయాడు.
నిఖిల్ గేమ్ ఎలా ఆడాలి అనేది మొత్తం చాలా చక్కగా వివరించాడు కానీ, లెటర్ బ్లాక్స్ క్రమ పద్దతి లో అమర్చడం లో చేసిన చిన్న పొరపాటు కారణం గా ఓడిపోవాల్సి వచ్చింది. ‘IAM’ లో ‘I’ మరియు ‘AM’ కి మధ్య కచ్చితంగా గ్యాప్ ఉండాలి. కానీ పృథ్వీ గ్యాప్ ఇవ్వకుండా కలిపి పెట్టేసాడు. నిఖిల్ ని టాస్క్ ప్రారంభం అయ్యే ముందే అడుగుతాడు, IAM లో గ్యాప్ ఉందా లేదా అని. నిఖిల్ లేదని చెప్తాడు, ఆయన కావాలని చెప్పాడో, లేకపోతే ఆయనకీ సరిగా అర్థం కాలేదో తెలియదు కానీ, పృథ్వీ టాస్కు లో ఓడిపోవడానికి ప్రధాన కారణం మాత్రం నిఖిల్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.