Moon Temperature: చైనాలో పుట్టిన కోవిడ్ – 19 వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ధనిక, పేద, హోదాతో సంబంధం లేకుండా అందరికీ అంటుకుంది. అందరిని క్వారంటైన్ చేసింది, ఈ వైరస్‌భారిన పడి చాలా మంది భయంతోనే ప్రాణాలు ఒదిలారు. వైరస్ వ్యాప్తి కట్టడికి నాడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. జనం బయటకు రాకుండా కట్టడి చేశాయి. వైరస్ పుట్టిన చైనా అయితే గతేడాది వరకు లాక్‌డౌన్ అమలు చేసింది. జనాలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా కఠిన ఆంక్షలు విధించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాలు లాక్‌డౌన్ అమలు చేశాయి. లాక్‌డౌన్ కారణంగా భూమిపై మనుషుల కార్యకలాపాలు బాగా తగ్గాయి. దీని ప్రభావం చంద్రునిపైనా పడ్డట్ల అధ్యయనాలు చెబుతున్నాయి. అధ్యయన ఫలితాలు రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ యొక్క మంత్లీ నోటీసులు: లెటర్స్‌లో ప్రచురించబడింది. ఇది భూమి, చంద్రుని మధ్య సంబంధాన్ని నొక్కి చెబుతుంది. భారత పరిశోధకులు అధ్యయనం ఫలితాలను వెల్లడించారు.
ఊహించని పరిణామం..
లాక్ డౌన్ కారణంగా చంద్రుని ఉపరితలపై ఊహించని మార్పులు సభవించాయి. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. 2020 గ్లోబల్ లాక్‌డౌన్ సమయంలో చంద్రుని రాత్రి ఉష్ణోగ్రతలు 8–10 కెల్విన్‌కి పడిపోయాయి. ఇది భూమి వాతావరణ మార్పులు, మన ఖగోళ పొరుగువారి మధ్య ఆశ్చర్యకరమైన సంబంధాన్ని సూచిస్తుంది. నాసా లునార్ రికనైసెన్స్ ఆర్బిటార్ నుంచి డేటాను విశ్లషించిన పరిశోధకులు ఉష్ణోగ్రతల తగ్గుదలకు భూమిపై మానవ కార్యకలాపాల తగ్గుదలే కారణంగా గుర్తించారు. లాక్‌డౌన్ సమయంలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు, ఏరోసోల్స్ తగ్గుదల భూమి నుంచి విడుదలయ్యే రేడియేషన్‌ను మార్చినట్లు కనిపిస్తోంది, ఇది చంద్రునిపై శీతలీకరణ ప్రభావానికి దారితీసిందని గుర్తించారు.
భూమి, సూర్య చంద్రుల అనుబంధం..
భూమి ప్రభావం చంద్రడు, సూర్యునిపై ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా శాస్త్రవేత్తలు పేఒర్కంటున్నారు. లాక్డౌన్ తర్వాత మానవ కార్యకలాపాలు పునఃప్రారంభం కావడంతో, చంద్రుని ఉష్ణోగ్రతలు పెరిగాయి. మన చర్యలు భూమికి మించిన వాతావరణాన్ని ప్రభావితం చేయవచ్చని సూచిస్తున్నాయి. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పిఆర్‌ఎల్) నుంచి పరిశోధకులు కె.దుర్గాప్రసాద్, జి అంబిలీ నేతృత్వంలోని బృందం 2017, 2023 మధ్య ఆరు ప్రదేశాల నుండి చంద్ర ఉపరితల ఉష్ణోగ్రత డేటాను విశ్లేషించింది. పీఆర్‌ఎల్ డైరెక్టర్ అనిల్ భరధ్వాజ్, భూమి, దాని సన్నిహిత ఖగోల పొరుగువారితో పరస్పర చర్యను అన్వేషించడంలో అధ్యయనం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. 2020లో ఉష్ణోగ్రత తగ్గుదలకు భూమిపై మానవ కార్యకలాపాలు చంద్రుడిని ఎలా ప్రభావితం చేశాయో పరిశీలించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది.