Bigg Boss Telugu 8: మణికంఠ ని ఏడిపించిన సొంత టీం మేట్స్..ఓవర్ యాక్షన్ కి పరాకాష్ట గా మారిన ప్రేరణ!

15 కేబేజిలను కంటెస్టెంట్స్ కోసం తెప్పిస్తాడు బిగ్ బాస్. రెండు క్లాన్స్ నుండి చెరో ఇద్దరు కంటెస్టెంట్స్ ఈ గేమ్ లో పాల్గొనాల్సిందిగా చెప్తాడు బిగ్ బాస్. నిఖిల్ టీం నుండి నిఖిల్, సోనియా రాగా, అభయ్ టీం నుండి ఆదిత్య ఓం, ప్రేరణ వస్తారు. ఈ టాస్కులో క్యాబేజీ ని తలతో నెట్టుకుంటూ, నేల మీద పాకుతూ అవతల వైపుకు క్యాబేజీని చేర్చాలి.

Written By: Vicky, Updated On : September 18, 2024 8:53 am

Bigg Boss 8 Telugu(44)

Follow us on

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైన రెండు వారాల్లో టాస్కుల పరంగా ది బెస్ట్ అనిపించిన రోజు మాత్రం నిన్ననే. రేషన్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులన్నీ కంటెస్టెంట్స్ చాలా కసిగా ఆడారు. గేమ్ ఆడడం లో వారిలో సీరియస్ నెస్ కనిపించింది. ఎందుకంటే ఒకవేళ టాస్కు ఓడిపోతే వారం మొత్తం రేషన్ లేకుండా ఉండాలి. త్రింది లేకుండా ఉండడం ఎవరి వల్ల కాదు. గత వారంలో మణికంఠ, నిఖిల్ ఆహరం లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారో మనమంతా చూసాము. అందుకే కంటెస్టెంట్స్ ఆహరం కోసం గట్టిగానే పోటీని ఎదురుకున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే రేషన్ గెలుచుకునే క్రమం లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ‘నత్తలా సాగుకు..ఒక్కటి వదలకు’ అనే టాస్క్ ఇస్తాడు. ఈ టాస్కులో కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ ఒక గ్రీన్ మ్యాట్ ని నేల మీద పరిచి వాటిని రెండు భాగాలుగా విభజిస్తాడు.

ఈ రెండు భాగాల్లో రెండు క్లాన్స్ కి సంబంధించిన వారు ఆడాలి. 15 కేబేజిలను కంటెస్టెంట్స్ కోసం తెప్పిస్తాడు బిగ్ బాస్. రెండు క్లాన్స్ నుండి చెరో ఇద్దరు కంటెస్టెంట్స్ ఈ గేమ్ లో పాల్గొనాల్సిందిగా చెప్తాడు బిగ్ బాస్. నిఖిల్ టీం నుండి నిఖిల్, సోనియా రాగా, అభయ్ టీం నుండి ఆదిత్య ఓం, ప్రేరణ వస్తారు. ఈ టాస్కులో క్యాబేజీ ని తలతో నెట్టుకుంటూ, నేల మీద పాకుతూ అవతల వైపుకు క్యాబేజీని చేర్చాలి. అలా ఏ క్లాన్ సభ్యులు అయితే ఎక్కువ క్యాబేజీలను అవతల వైపుకు చేరుస్తారో, వాళ్ళు ఈ రౌండ్ గెలిచినట్టు అన్నమాట. ఈ టాస్కులో నిఖిల్, సోనియా చాలా వేగంగా ఆడి అత్యధిక క్యాబేజీలను అవతలవైపుకు చేర్చి గెలుస్తారు. మరో పక్క అభయ్ క్లాన్ లో ప్రేరణ చాలా వేగంగా ఆడగా, ఆదిత్య ఓం చాలా స్లో గా ఆడుతాడు. ఆయన వల్ల టీం ఓడిపోవాల్సి వచ్చింది. ఈ టాస్కుకి సంచాలక్ గా నాగ మణికంఠ వ్యవహరిస్తాడు. ఆయన సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడని అతని క్లాన్ కి సంబంధించిన సభ్యులందరూ విరుచుకుపడుతారు. ఎందుకంటే క్యాబేజీలు అయిపోయిన తర్వాత మళ్ళీ రీ ఫిల్ చేయలేదని. అది అసలు టాస్కు కాదు, ఎందుకంటే బిగ్ బాస్ ‘ఆడ్’ నెంబర్ కి సరిపడా క్యాబేజీలను టాస్కులో పెడుతాడు.

అంటే కంటెస్టెంట్స్ ఒక్కసారిగా ఆడిస్తే అదే ఫైనల్ అన్నమాట. కానీ ప్రేరణతో పాటు ఆ క్లాన్ సంబంధించిన సభ్యులందరూ నాగమణికంఠ తప్పు చేసాడని తిడుతారు. దీంతో మణికంఠ ఫీల్ అయ్యి ఏడ్చేస్తాడు. ప్రేరణ ‘తొక్కలో సంచాలక్’ అని మణికంఠ ని అనడం కూడా చాలా తప్పు అని చూసే ప్రేక్షకులకు అనిపించింది. ఎందుకంటే ఈ టాస్కులో మణికంఠ కరెక్ట్ గా వ్యవహరించాడు, సంచాలక్ గా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు అనే చెప్పాలి. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి కానీ, ప్రేరణ మరియు టీం అంతలా ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదని నిన్నటి ఎపిసోడ్ చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించింది.