https://oktelugu.com/

Bigg Boss Telugu 8: రెచ్చిపోయిన పృథ్వీ రాజ్..బిగ్ బాస్ మాటలను కూడా లెక్క చేయలేదుగా..కఠినమైన చర్యలు తీసుకోనున్న నాగార్జున!

బోర్డు మీద తగిలించిన ఫ్రేమ్స్ కి అతికించాలి. ఎవరి ఫోటో ఫ్రేమ్స్ అయితే బోర్డు మీద ఎక్కువ ఉంటాయో, వాళ్ళు ఈ టాస్కులో గెలిచినట్టు. ముందుగా పృథ్వీ, నబీల్ చాలా వేగంగా ఫోటో ఫ్రేమ్స్ పెడుతారు. అయితే నబీల్ మొట్టమొదటిసారి పృథ్వీ ఫోటో ఫ్రేమ్ ని గెలుకుతాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 18, 2024 / 08:50 AM IST

    Bigg Boss 8 Telugu(43)

    Follow us on

    Bigg Boss Telugu 8: ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఆవేశంతో టాస్కులు ఆడే కంటెస్టెంట్స్ ఉంటారు. ఈ సీజన్ లో అలా మితిమీరిన ఆవేశంతో టాస్కులు ఆడే కంటెస్టెంట్ గా పృథ్వీ రాజ్ నిలిచాడు. ఇతను ప్రతీ టాస్కుని బలంగా ఆడగలడు. కానీ ఏ టాస్కు కూడా రూల్స్ కి తగ్గట్టుగా ఆడడం ఇతనికి చేతకాదు. మామూలుగా ఆడురా బాబు అంటే, అలా ఆడను నాకు నచ్చినట్టు గానే ఆడుతాను, అదే నా గేమ్ అని వాదిస్తాడు. దీని వల్ల ఆయన ఈ వారం లో డేంజర్ జోన్ లోకి వచ్చాడు. ఇకపోతే కనీసం ఈ వారం అయినా పృథ్వీ రాజ్ తన ఆట తీరుని మార్చుకుంటాడేమో అని అందరు అనుకున్నారు. కానీ ఏమాత్రం మార్చుకోలేదు, అదే అర్థం లేని ఆవేశం తో టాస్కులు ఆడాడు. నిన్న హౌస్ లో రేషన్ కి సంబంధించి పలు టాస్కులను ఏర్పాటు చేసాడు బిగ్ బాస్. అందులో మొదటి టాస్క్ రెండు క్లాన్స్ కి సంబంధించిన చీఫ్స్ ఫోటోలు ఉంటాయి.

    వాటిని బోర్డు మీద తగిలించిన ఫ్రేమ్స్ కి అతికించాలి. ఎవరి ఫోటో ఫ్రేమ్స్ అయితే బోర్డు మీద ఎక్కువ ఉంటాయో, వాళ్ళు ఈ టాస్కులో గెలిచినట్టు. ముందుగా పృథ్వీ, నబీల్ చాలా వేగంగా ఫోటో ఫ్రేమ్స్ పెడుతారు. అయితే నబీల్ మొట్టమొదటిసారి పృథ్వీ ఫోటో ఫ్రేమ్ ని గెలుకుతాడు. అసలు గొడవలకు సిద్ధంగా ఉండే పృథ్వీ ని గెలికితే అతను ఎందుకు గమ్ముగా ఉంటాడు. అతను కూడా రెచ్చిపోయాడు. ఆయన నబీల్ కి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ అన్నిటిని బోర్డు నుండి పీకి బయటకి పారేస్తాడు. నబీల్ కూడా అందుకు కౌంటర్ ఎటాక్ ఇస్తాడు. అలా ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. ఒకరిని ఒకరు తోసుకుంటారు, ఎలా పడితే అలా ఇష్టమొచ్చినట్టు ఆడుతుంటారు. సంచాలక్ గా వ్యవహరిస్తున్న సీత ఇద్దరు కంటెస్టెంట్స్ లైన్ దాటడం ని గమనించి అనేకసార్లు గేమ్ ని ఆపుతుంది. అప్పుడు బిగ్ బాస్ అలా ఆపడానికి వీలు లేదని వార్నింగ్ ఇస్తాడు. అంతే కాకుండా ఒకరిని ఒకరు పట్టుకోవడం, నెట్టుకోవడం వంటివి చేయకూడదు, ఫేమ్ ఫ్రేమ్స్ ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు అని అంటాడు.

    అయితే పృథ్వీ రాజ్ బిగ్ బాస్ చెప్పిన పాయింట్ ని అసలు పట్టించుకోలేదు. బిగ్ బాస్ చెప్పగానే నబీల్ ఫిజికల్ అవ్వడం మానేసాడు. కానీ పృథ్వీ ఆపలేదు. సంచాలక్ గా వ్యవహారికిస్తున్న సీత ఇది గమనించి పృథ్వీ కి అనేక సార్లు వార్నింగ్ ఇస్తుంది. కానీ పృథ్వీ పట్టించుకోడు, దీంతో అతన్ని గేమ్ నుండి తొలగించి అభయ్ క్లాన్ విన్ అయ్యినట్టుగా ప్రకటిస్తుంది సీత. అసలు పృథ్వీ కి గేమ్ అర్థం అవుతుందా?, అతనికి చెవులు సరిగ్గా పనిచేస్తున్నాయా, స్పష్టంగా ఒకరిని ఒకరు పట్టుకోవద్దని బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా పృథ్వీ అదే పని చేసాడు. దీనిపై ఈ వారం పృథ్వీ కి నాగార్జున నుండి కోటింగ్ తప్పేలా లేదు.