Bigg Boss Telugu 8: హరితేజ కి వెన్నుపోటు పొడిచిన మణికంఠ..చివరికి ‘గేమ్ చేంజర్’ గా నిల్చిన నిఖిల్!

గౌతమ్ ఇతను చెప్పిన డీల్ కి ఒప్పుకోలేదు. టాస్క్ ఎలా కొనసాగిందంటే బోన్ చేతిలోకి వచ్చిన కంటెస్టెంట్ కి ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తప్పించే విధంగా ప్యాట్రన్ కొనసాగుతూ వెళ్ళింది. గేమ్ ఫ్లోని బట్టి నిర్ణయం తీసుకోవాల్సిన డ్రామా కంఠ హరితేజ ని పక్కకి తోసేయాలని అనుకున్నాడు.

Written By: Vicky, Updated On : October 19, 2024 8:02 am

Bigg Boss Telugu 8(131)

Follow us on

Bigg Boss Telugu 8: డ్రామా కంఠ అలియాస్ మణికంఠ నిన్న కూడా తన డ్రామాని ప్రదర్శించేందుకు తెగ ప్రయత్నం చేసాడు. ఇతను తాను స్నేహం చేసేవారికి వెన్నుపోటు పొడవం లో దిట్ట అని ఆడియన్స్ కి మొదటి వారంలోనే అర్థం అయ్యింది. విష్ణు ప్రియ చుట్టూ తిరుగుతూ ఆమెలోని నెగటివ్ కోణాలను పాయింట్స్ గా తీసుకొని నామినేషన్స్ లోకి వేసిన ఘనుడు ఈ మహానుభావుడు. అలాగే యష్మీ తో కూడా మంచి స్నేహం చేసేవాడు ఒకప్పుడు. కానీ ఆమె స్నేహంతో చెప్పిన మాటలకు ‘మైక్రో మ్యానేజ్మెంట్’ అని పేరు పెట్టి, నామినేషన్స్ లో వేసాడు. అప్పటి నుండి యష్మీ ఇతనితో స్నేహం కట్ చేసుకుంది. ఆ తర్వాత నిఖిల్ కి కూడా పోటు పొడిచాడు, నిఖిల్ స్మార్ట్ గా అలోచించి ఇతన్ని దూరం పెట్టి మంచి తెలివైన పని చేసాడు.

అలాగే మంచిగా స్నేహం చేస్తున్న నభీల్ తో కూడా ఎలాంటి స్కోప్ లేకపోయినప్పటికీ గొడవ పెట్టుకొని నామినేషన్ పాయింట్స్ వెతుక్కునే ప్రయత్నం చేసాడు. అవకాశం వస్తే నామినేషన్ వేసేవాడే, కానీ ఎందుకో అలాంటి పరిస్థితి రాలేదు పాపం. ఇక ఈ వారం మొత్తం ఇతనికి ఆట ఆడే అవకాశం రాకపోవడం తో కంటెంట్ ఇచ్చే స్కోప్ దొరకలేదు. నామినేషన్స్ లో ఉన్నాను, ఎలా అయినా కంటెంట్ ఇవ్వాలనే తపనతో ట్రిగ్గర్ చేస్తే రెచ్చిపోయే మనస్తత్వం ఉన్న పృథ్వీ తో ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకున్నాడు. కావాల్సిన కంటెంట్ వచ్చింది. అసలు నిఖిల్, గౌతమ్ మధ్య వాష్ రూమ్ లో ఘోరమైన ఫైట్ జరగడానికి కారణం కూడా డ్రామా కంఠ నే. ఇలా హౌస్ లో గేమ్ ఆడకపోయినా కూడా ఇలాంటి కంటెంట్ ని సృష్టించి గేమ్ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకునేలా చేయడం మణికంఠ కి వెన్నతో పెట్టిన విద్య. అయితే మణికంఠ వెన్నుపోటు సంఘం బాధితులలో రీసెంట్ గా హరితేజ కూడా చేరింది. హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన హరితేజతో మొదటి నుండి మంచి స్నేహపూర్వకంగా ఉంటూ వచ్చాడు మణికంఠ. నిన్న జరిగిన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ ప్రారంభం అయ్యేముందు కూడా ఆయన హరితేజ దగ్గరకు వెళ్లి నాకు సపోర్ట్ చెయ్యి అక్కా అంటూ బ్రతిమిలాడాడు. నిన్నటి టాస్కు లో ఆరు రౌండ్స్ లో గౌతమ్ గెలిస్తే, పొరపాటున గౌతమ్ చెయ్యి తగిలి బోన్ డ్రామాకంఠ చేతుల్లోకి వెళ్తుంది. అతని చేతుల్లోకి వెళ్ళగానే టేస్టీ తేజ, హరి తేజ ని తీసి వేస్తున్నట్టు బిగ్ బాస్ కి ప్రకటిస్తాడు. హరితేజ ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ ఎక్స్ ప్రెషన్ పెడుతుంది. గౌతమ్ తో నేను డీల్ పెట్టుకున్నాను, నన్ను అవుట్ చేయకూడదు అని, అందుకే నేను వీళ్ళిద్దరిని తీసేస్తున్నా అని చెప్పాడు.

గౌతమ్ ఇతను చెప్పిన డీల్ కి ఒప్పుకోలేదు. టాస్క్ ఎలా కొనసాగిందంటే బోన్ చేతిలోకి వచ్చిన కంటెస్టెంట్ కి ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తప్పించే విధంగా ప్యాట్రన్ కొనసాగుతూ వెళ్ళింది. గేమ్ ఫ్లోని బట్టి నిర్ణయం తీసుకోవాల్సిన డ్రామా కంఠ హరితేజ ని పక్కకి తోసేయాలని అనుకున్నాడు. అయితే గౌతమ్ మణికంఠతో మాట్లాడుతూ ‘నేను ఆ డీల్ ప్రకారం ఆడలేదు బ్రదర్..నువ్వు నన్ను గేమ్ నుండి తీసెయ్యాలి అనుకుంటే తీసేయ్’ అని అంటాడు. డ్రామా కంఠ నిర్ణయం తీసుకోవడంలో బాగా ల్యాగ్ చేయడం తో బిగ్ బాస్ సంచాలక్ గా వ్యవహరిస్తున్న నిఖిల్ ని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతాడు. నిఖిల్ హరితేజ, టేస్టీ తేజ ని తొలగిస్తాడు. ఇక తర్వాత మెహబూబ్ మణికంఠ ని పక్కకి పిలిచి మాట్లాడగా ‘గౌతమ్ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి యష్మీ ని టాస్క్ నుండి తొలగించాడు, నన్ను తొలగించలేదు. అంటే నా డీల్ ఒప్పుకున్నాడు అని అనుకున్నాను అన్నాడు’ అక్కడ గేమ్ లో స్ట్రాంగ్ గా ఆడే కంటెస్టెంట్స్ ని తొలగించడం అనేది స్పష్టం గా చూసేవాళ్లకు అర్థం అయ్యింది. మణికంఠ యష్మీ తో పోలిస్తే ఏ యాంగిల్ లో కూడా స్ట్రాంగ్ ప్లేయర్ కాదు, మరి అలాంటప్పుడు నన్ను తియ్యలేదు, నా డీల్ ఒప్పుకున్నాడు అనుకున్నాను అంటూ డ్రామా కంఠ డ్రామాలు వెయ్యడం ఏంటో అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.