https://oktelugu.com/

Horoscope Today: ఈ రెండు రాశులపై శని చూపు.. తమ జీవితాల్లో ఊహించని మలుపులు..

వ్యాపారులు శుభవార్తలు వింటారు. కొత్త వ్యక్తులతో ఒప్పందం చేసుకుంటారు. మనసు కొంత చంచలంగా ఉండొచ్చు. వివాహితులు శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి

Written By:
  • Srinivas
  • , Updated On : October 19, 2024 / 08:11 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం సిద్ధియోగం ఏర్పడనుంది.ఈరోజు ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. అలాగే ఈరోజు కొన్ని రాశులపై శని ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు ఆయా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఈ కిందికి వెళ్లి తెలుసుకోండి.

    మేష రాశి:
    ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఒత్తిడితో కలిగి ఉంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    వృషభ రాశి:
    వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్తలు వింటారు.

    మిథున రాశి:
    కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తారు.

    కర్కాటక రాశి:
    వ్యాపారులు శుభవార్తలు వింటారు. కొత్త వ్యక్తులతో ఒప్పందం చేసుకుంటారు. మనసు కొంత చంచలంగా ఉండొచ్చు. వివాహితులు శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి

    సింహారాశి:
    కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఎక్కువగా ఆలోచించాలి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు సాధారణ వ్యవహాలు చేయాలి. రిస్క్ ల జోలికి వెళ్లకూడదు.

    కన్య రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడుతారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు చదువులో అనుకున్నది సాధిస్తారు.

    తుల రాశి:
    పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వివాహితులు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడుతారు. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి.

    వృశ్చిక రాశి:
    వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగులకు ప్రశంసలు ఉంటాయి.

    ధనస్సు రాశి:
    ఉద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతారు. విద్యార్థులు ఎక్కువగా కష్టపడుతారు. దానికి సంబంధించిన ఫలితాలు పొందుతారు.

    మకర రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రభావితం చేసే వ్యక్తులను కలుస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఏ పని చేపట్టినా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోని అదృష్టం కలిసివస్తుంది.

    కుంభరాశి:
    ఎవరికైనా అప్పు ఇవ్ావల్సి వస్తే ఆలోచించాలి. ఎందుకంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. ఉద్యోగులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

    మీనరాశి:
    విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల కెరీర్ ను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు.