https://oktelugu.com/

Viswam Movie Twitter Talk: విశ్వం మూవీ ట్విట్టర్ టాక్: గోపీచంద్ మూవీ హిట్టా ఫట్టా, ఆడియన్స్ తేల్చేశారు! మూవీ ఎలా ఉందంటే?

గోపీచంద్ కి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. అలాగే దర్శకుడు శ్రీను వైట్ల సైతం స్ట్రగుల్ అవుతున్నారు. వీరిద్దరూ విశ్వం మూవీతో ప్రేక్షకులను పలకరించారు. విశ్వం మూవీ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఇంతకీ గోపీచంద్ మూవీ హిట్టా ఫట్టా...

Written By:
  • S Reddy
  • , Updated On : October 11, 2024 / 09:37 AM IST

    Viswam Movie Twitter Talk

    Follow us on

    Viswam Movie Twitter Talk: పరిశ్రమ ఏదైనా సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. విజయాలు సాధించేవారికే విలువ, గౌరవం. దర్శకుడు శ్రీను వైట్ల ఓ పదేళ్ల క్రితం స్టార్ డైరెక్టర్. మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, రవితేజ వంటి స్టార్స్ తో పని చేశారు. దూకుడు శ్రీను వైట్ల కెరీర్లో భారీ హిట్ గా ఉంది. అనంతరం ఎన్టీఆర్ తో చేసిన బాద్ షా సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం తర్వాత శ్రీను వైట్లకు హిట్ లేదు. దాంతో స్టార్ హీరోలు దూరం పెట్టేశారు.

    మరోవైపు గోపీచంద్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఒకప్పుడు టైర్ టు హీరోలలో టాప్ పొజిషన్ లో ఆయన ఉన్నారు. మాస్ హీరోగా సూపర్ హిట్స్ కొట్టాడు. గోపీచంద్ కి హిట్ పడి దశాబ్దం దాటిపోయింది. ఈ క్రమంలో శ్రీను వైట్ల-గోపీచంద్ కొలాబరేట్ అయ్యారు. హిట్ కొట్టి తమ పూర్వ వైభవం పొందాలని అనుకుంటున్నారు. విశ్వం మూవీతో ప్రేక్షకులను పలకరించారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన విశ్వం సెప్టెంబర్ 11న విడుదలైంది.

    గోపీచంద్ కి జంటగా కావ్య థాపర్ నటించింది. జిష్షు సేన్ గుప్తా ప్రధాన విలన్ రోల్ చేశాడు. సునీల్, వెన్నెల కిషోర్, నరేష్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి నటులు ఇతర పాత్రలు చేశారు. విశ్వం మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

    గోపీచంద్ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కడం విశేషం. ఈ మధ్య కాలంలో గోపీచంద్ నుండి వచ్చిన మంచి చిత్రం విశ్వం అంటున్నారు. శ్రీను వైట్ల మార్క్ కామెడీ సినిమాకు హైలెట్. కామెడీ ట్రాక్స్ వర్క్ అవుట్ అయ్యాయని అంటున్నారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. విజువల్స్ ఆకట్టుకుంటాయి. గోపీచంద్ యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ రేపుతాయి.

    గోపీచంద్ నటన బాగుంది. సాంగ్స్ మాస్ ఆడియన్స్ కి నచ్చుతాయట. కావ్య థాపర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకున్నా… ఆమె గ్లామర్ ఆకట్టుకుంటుందట. విశ్వం చిత్రంపై మిక్స్డ్ టాక్ కూడా వినిపిస్తోంది. కథలో కొత్తదనం లేదు. రొటీన్ కమర్షియల్ మూవీ అంటున్నారు. అయితే వీకెండ్ ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.. అనేది ఆడియన్స్ అభిప్రాయం.