Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8: కంప్లీట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్......

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8: కంప్లీట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్… బరిలో క్రేజీ సెలబ్రిటీలు

Bigg Boss Telugu 8: బుల్లితెర పై మోస్ట్ సక్సెస్ ఫుల్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు లో 2017లో ప్రారంభమైన బిగ్ బాస్ ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది. తాజాగా సీజన్ 8 కోసం రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల ఎంపిక సైతం పూర్తయిందని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ, సీరియల్ నటీనటులు, సోషల్ మీడియా స్టార్స్ ఇలా వివిధ రంగాల సెలెబ్రెటీలను బిగ్ బాస్ టీం సంప్రదించారట.

ఇక అనుకున్న దానికంటే ముందే సీజన్ 8 ప్రారంభం కానుందని సమాచారం. ఆగష్టు 4 లేదా 11వ తారీకుల్లో సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని తెలుస్తుంది. త్వరలోనే బిగ్ బాస్ 8 కి సంబంధించిన అఫీషియల్ అనౌన్సమెంట్ కూడా రానుంది అని సమాచారం. ఈసారి హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ లిస్ట్ లో ఎవరూ ఊహించని పేరు ఒకటి వినిపిస్తుంది.

గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా సుమారు 19 లేదా 20 మంది సెలెబ్రెటీలను లోపలికి పంపిస్తారట. వీరిలో నటి హేమ, బర్రెలక్క, కిరాక్ ఆర్పీ, సురేఖ వాణి, హీరో రాజ్ తరుణ్, యాంకర్ రీతూ చౌదరి, కుమారీ ఆంటీ, యూట్యూబర్ బంచిక్ బబ్లు,సోనియా సింగ్, నేత్ర వంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే వారితో పాటు అప్పట్లో పరువు హత్య ఉదంతంలో వార్తలకు ఎక్కిన అమృత ప్రణయ్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

అలాగే వేణు స్వామి సైతం ఎంట్రీ ఇస్తున్నారట. సెలెబ్రిటీల జాతకాలు బహిరంగంగా చెబుతూ వేణు స్వామి పాపులర్ అయ్యాడు. అతడిని టాప్ హీరోయిన్స్ సైతం అనుసరిస్తారు. ప్రత్యేక పూజలు జరిపిస్తారు. వేణు స్వామికి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ కి తీసుకొస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. ఫుల్ క్లారిటీ రావాలంటే లాంచింగ్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాలి. ఇక సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version