Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ డేట్ వచ్చేసింది… అనుకున్న టైం కంటే ముందే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంచింగ్ డేట్ అధికారికంగా ఫిక్స్ చేసింది స్టార్ మా. షో స్టార్ట్ కావడానికి రోజుల సమయం మాత్రమే ఉంది. ఇది బిగ్ బాస్ లవర్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో సందేహం లేదు. ఆ వివరాలు బిగ్ బాస్ లవర్స్ కోసం.

Written By: S Reddy, Updated On : August 21, 2024 1:57 pm

Bigg Boss 8 Telugu(11)

Follow us on

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ అత్యంత ఆదరణ కలిగిన రియాలిటీ షో. హిందీలో మొదలైన బిగ్ బాస్ మెల్లగా అన్ని ప్రాంతీయ భాషలకు పాకింది. తెలుగులో 2017లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ఫస్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్. సీజన్ 2కి హీరో నాని హోస్ట్ గా ఉన్నారు. నాని సైతం తన మార్కు హోస్టింగ్ తో షోని సక్సెస్ చేశారు. సీజన్ 3కి నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. గత ఐదు సీజన్స్ గా నాగార్జున ఒంటి చేత్తో బిగ్ బాస్ షోని నడిపిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్. ఎన్నడూ లేని విధంగా ఓ సామాన్యుడు ఫస్ట్ టైం టైటిల్ విన్నర్ అయ్యాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అంచనాలు తలకిందులు చేస్తూ టైటిల్ కొల్లగొట్టాడు. టైటిల్ ఫేవరెట్ గా హౌస్లో అడుగుపెట్టిన శివాజీ, అమర్ దీప్ లకు షాక్ ఇస్తూ టైటిల్ ఎగరేసుకుపోయాడు. సీజన్ 7 అలరించిన నేపథ్యంలో సీజన్ 8పై అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక సీజన్ 8 ప్రోమోలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈసారి ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్ కి లిమిటే లేదు అంటున్నారు. నాగార్జున మాటల షో డిజైన్ చేసిన తీరు తెలియజేస్తున్నాయి. ఈసారి టైటిల్ కోసం కంటెస్టెంట్స్ బాగా పోరాడాల్సి ఉంటుంది. రూల్స్, గేమ్స్, టాస్క్స్ కష్టం గా ఉండే సూచనలు కలవు. సీజన్ 8 లోగోలో ఎనిమిది సంఖ్యను ఇన్ఫినిటీ ఆకారంలో డిజైన్ చేశారు. ఇది ఆసక్తి రేపుతోంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో లాంచింగ్ డేట్ ప్రకటించింది స్టార్ మా. దీనిపై అధికారిక ప్రకటన చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న లాంచ్ కానుంది. ప్రస్తుతం స్టార్ మా లో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ ప్రసారం అవుతుంది. ఇది సెప్టెంబర్ 1న ముగుస్తుంది. 8వ తేదీన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అంటూ ప్రచారం జరిగింది. కానీ మరో పది రోజుల్లో బిగ్ బాస్ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 7న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఎప్పటిలాగే స్టార్స్ ఎంట్రీ, అదిరిపోయే పెర్ఫార్మన్స్లు సిద్ధం చేశారట.