Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో చాలా తెలివిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తన గుప్పిట్లో పెట్టుకొని తోలుబొమ్మలు లాగా ఆడిస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోనియా అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కుటుంబ సభ్యులు కూర్చొని చూసే బిగ్ బాస్ షో ని అడల్ట్ షో లాగా మార్చేసింది ఈమె. నిఖిల్, పృథ్వీ మీ మాటికొస్తే హగ్ చేసుకోవడం, కైపు ఎక్కించే మాటలతో వాళ్ళను కూల్ చేసేయడం, వాళ్ల శరీరం పై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం, ఇవన్నీ చూసే ప్రేక్షకులకు బీపీ రావడం వంటివి జరుగుతున్నాయి. నిఖిల్ కచ్చితంగా హౌస్ లో టాస్కులు ఆడడం లో నెంబర్ 1 కంటెస్టెంట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొదటి వారం లో ఈయన అంచనాలను అందుకోలేకపోయినా, రెండవ వారం నుండి మాత్రం అద్భుతంగా టాస్కులు ఆడుతూ గేమ్ లో చెలరేగిపోయాడు.
అయితే ఇతను ఎక్కువగా సోనియా మాయలో పడిపోయాడు అనేది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అభిప్రాయం మాత్రమే కాదు, ఈ షో ని చూసే ప్రేక్షకుల అభిప్రాయం కూడా. నాగార్జున గత వారంలో నిఖిల్ కి బెస్ట్ చీఫ్ అని మెచ్చుకున్నాడు. కానీ ఈ వారం మాత్రం అతన్నిచీఫ్ గా ఫెయిల్ అని అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈయన క్లాన్ లో చీఫ్ గా వ్యవహరించలేదు, సోనియా కి అసిస్టెంట్ గా వ్యవహరించాడు. ఆమె ఏది చెప్తే అదే చేసాడు. క్లాన్ లో ఉన్న మిగిలిన సభ్యుల అభిప్రాయాలను సేకరించలేదు. సోనియా ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నట్టుగా ప్రవర్తించాడు. ఎదో ఊహించుకొని నిఖిల్ క్లాన్ లోకి అడుగుపెట్టిన నైనిక, సీత నిఖిల్ తీరుపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. సోనియా చేతిలో నిఖిల్ ఆటబొమ్మ లాగా మారిపోయాడని అంటున్నారు. ఇక పృథ్వీ రాజ్ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సోనియా అవతల క్లాన్ కి వెళ్లి దాడి చెయ్యమంటే వెళ్లి చేసి వస్తాడు. యష్మీ దీనిపై బాధ కూడా పడుతుంది. ‘ఆ సోనియా ఏంట్రా.. మాటికొస్తే పృథ్వీ రాజ్ ని మన మీదకు పంపిస్తుంది. ఆమె రాలేదా?, వచ్చే దమ్ము లేదా’ అంటూ ప్రేరణ కి చెప్పుకొని ఏడుస్తుంది.
ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన టాస్కులో నబీల్, సోనియా మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. ఇది ఎక్కడి నుండో పృథ్వీ చూసాడు. వెంటనే నబీల్ వైపుకు దూసుకొచ్చేసాడు. ‘ఎందుకు అరుస్తున్నావ్’ అంటూ నబీల్ ని కొట్టేందుకు ముందుకు పోతాడు. ఆయన వెనుక నిఖిల్ కూడా వచ్చేస్తాడు. ఇలా సోనియా తో నబీల్ గట్టిగా మాట్లాడినందుకు నిఖిల్, పృథ్వీ ఆ రేంజ్ లో రెచ్చిపోయారు. ఇదంతా చూస్తూనే సోనియా వీళ్ళిద్దరిని తన బాడీ గార్డ్స్ గా పెట్టుకుంది, వీళ్లిద్దరు ఆమె మాయలో పూర్తిగా పడిపోయారు, బయటకి రావడం కష్టమే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.