https://oktelugu.com/

Bigg Boss Telugu 8: శేఖర్ బాషా రీ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందా?..ప్రెస్ మీట్ లో సంచలన నిజాలు బయటపెట్టిన శేఖర్ బాషా!

'బిగ్ బాస్ లో మొత్త్తమొదటి సారి కంటెస్టెంట్స్ ద్వారా ఎలిమినేట్ కాబడిన కంటెస్టెంట్ గా నేను నిల్చాను. కానీ కంటెస్టెంట్స్ ఎవ్వరూ కూడా నా మీద కుట్రతో ఈ పని చేయలేదు. నేను నా బిడ్డని చూసుకోవాలని చాలా తపన పడ్డాను, అంతే కాకుండా హౌస్ లో ఆహరం సరైన సమయంలో అందకపోవడం వల్ల నాకు చక్కర పడింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 16, 2024 / 04:12 PM IST

    Bigg Boss Telugu 8(18)

    Follow us on

    Bigg Boss Telugu 8: ప్రతీ బిగ్ బాస్ సీజన్ లోని ఎవరైనా బాగా గేమ్ ఆడే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యినప్పుడు మనం చాలా బాదపడిపోతూ ఉంటాం. అలా ఈ సీజన్ నిన్న ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా విషయం లో కూడా బాదపడ్డాము. ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్న ఏకైక కంటెస్టెంట్ ని పంపేశారు, టాస్కులలో ఆయనకంటే తక్కువగా ఆడుతున్న ఎంతో మంది దర్జాగా ఇంకా హౌస్ లోనే కొనసాగుతున్నారు, ఇదెక్కడి న్యాయం, బిగ్ బాస్ మ్యానేజ్మెంట్ కోటా లో ఉన్న కంటెస్టెంట్స్ ని కాపాడుకోవడానికి ఇలా అన్యాయమైన ఎలిమినేషన్ చేసింది. బిగ్ బాస్ హిస్టరీ లో ఎక్కడైనా ఎలిమినేషన్ ప్రేక్షకుల ద్వారా జరిగింది కానీ, కంటెస్టెంట్స్ ద్వారా జరిగిందా?, కానీ సీజన్ 8 లో జరిగింది, ఇది అన్యాయం మోసం అంటూ బిగ్ బాస్ ని వీక్షించే ప్రేక్షకులు బాధపడ్డారు. అయితే సోషల్ మీడియా లో జరుగుతున్న ఈ కామెంట్స్ అన్నిటిని గమనించిన శేఖర్ బాషా, నిన్న రాత్రి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి కొన్ని నిజాలను బయటపెట్టాడు.

    ఆయన మాట్లాడుతూ ‘బిగ్ బాస్ లో మొత్త్తమొదటి సారి కంటెస్టెంట్స్ ద్వారా ఎలిమినేట్ కాబడిన కంటెస్టెంట్ గా నేను నిల్చాను. కానీ కంటెస్టెంట్స్ ఎవ్వరూ కూడా నా మీద కుట్రతో ఈ పని చేయలేదు. నేను నా బిడ్డని చూసుకోవాలని చాలా తపన పడ్డాను, అంతే కాకుండా హౌస్ లో ఆహరం సరైన సమయంలో అందకపోవడం వల్ల నాకు చక్కర పడింది. ఇలాంటి సమస్యలన్నీ రావడం తో రెండు రోజుల ముందు ఎలిమినేషన్ కి అవకాశం వస్తే నన్ను పంపండి, నాకు ఉండాలని లేదు అంటూ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరినీ అడిగాను, నా కోరిక మేరకే వాళ్ళు నన్ను బయటకి పంపారు, అంతే కానీ సోషల్ మీడియా లో వినిపిస్తున్నట్టుగా ఎలాంటి స్క్రిప్ట్ జరగలేదు, మళ్ళీ రీ ఎంట్రీ అవకాశం వస్తే హౌస్ లోకి వస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా.

    ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వాల్సింది అట, కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు శేఖర్ బాషా రెండవ వారం చాలా మానసిక వేదనకు గురి అయ్యాడు. తన ఇంటిని బాగా మిస్ అయ్యాడు, తన బిడ్డని చూడాలని కోరుకున్నాడు. కెమెరా ముందు ఆడియన్స్ కి కూడా ఆయన రిక్వెస్ట్ చేసాడట. కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి బిగ్ బాస్ ని కూడా బ్రతిమిలాడాడు అట, శేఖర్ బాషా అభ్యర్థనని గమనించే నిన్నటి ఎలిమినేషన్ ని అలా ప్లాన్ చేసారని అంటున్నారు. అయితే ఈ సీజన్ లో అక్టోబర్ 4 వ తేదీన వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉన్నాయి. గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎలిమినేట్ అయిన రతికా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది, శేఖర్ బాషా ని కూడా అలాగే హౌస్ లోకి రానిస్తారని తెలుస్తుంది, ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి మరి.