https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నువ్వు హౌస్ లో గేమ్స్ ఎలా ఆడుతావో నేను కూడా చూస్తా అంటూ మణికంఠకు యష్మీ మాస్ వార్నింగ్..వైరల్ అవుతున్న వీడియో!

నిన్న జరిగిన ఎపిసోడ్ లో మూడు టాస్కులు నిర్వహించగా, రెండు టాస్కులు శక్తి క్లాన్ గెలిచింది. ఒక్క టాస్కు రెండు క్లాన్స్ ఓడిపోతుంది. అందుకు బిగ్ బాస్ గత వారం తొలగించిన 10 వ నెంబర్ వైల్డ్ కార్డు ని మళ్ళీ రేస్ లో పెట్టిస్తాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 2, 2024 / 04:26 PM IST

    Bigg Boss Telugu 8(64)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని అడ్డుకోవడానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్’. గత వారం ఈ టాస్క్ పేరిట 5 టాస్కులు నిర్వహించగా, కంటెస్టెంట్స్ మూడు వైల్డ్ కార్డు ఎంట్రీలను తొలగించారు. ఈ వారం మళ్ళీ ఆ టాస్కులని కొనసాగిస్తున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో మూడు టాస్కులు నిర్వహించగా, రెండు టాస్కులు శక్తి క్లాన్ గెలిచింది. ఒక్క టాస్కు రెండు క్లాన్స్ ఓడిపోతుంది. అందుకు బిగ్ బాస్ గత వారం తొలగించిన 10 వ నెంబర్ వైల్డ్ కార్డు ని మళ్ళీ రేస్ లో పెట్టిస్తాడు. ఆ తర్వాత శక్తి క్లాన్ ఒక టాస్కు గెలవడంతో ఆ 10వ నెంబర్ వైల్డ్ కార్డు ని మళ్ళీ తొలగిస్తారు. ఈ టాస్కు వెంటనే మరో టాస్క్ కూడా గెలవడంతో 9 వ నెంబర్ వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా తొలగిస్తారు.

    నేడు కూడా ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్’ పేరిట కొన్ని టాస్కులు నిర్వహించారు. బిగ్ బాస్ సీజన్ 7 లో పెట్టిన టాస్కులే మళ్ళీ నేటి ఎపిసోడ్ లో పెట్టారు. అందులో ‘కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్’ అనే టాస్కు ఒకటి. కాసేపటి క్రితమే రెండవ టాస్కుకి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు. ఈ టాస్కులో పప్పీల బొమ్మలు ఉంటాయి. ప్రతీ పప్పీ మెడలో ఒక్కో కంటెస్టెంట్ పేరు ఉంటుంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వాటిని తీసుకొని ఒక సర్కిల్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే చివరగా వస్తారో, ఆ పప్పీ పేరు మీదున్న కంటెస్టెంట్, అలాగే చివరిగా పరిగెత్తిన కంటెస్టెంట్, ఇద్దరిలో ఎవరినో ఒకరిని చీఫ్ కంటెండర్స్ గా ఎంచుకునే బాధ్యత హౌస్ మేట్స్ కి ఇస్తాడు బిగ్ బాస్. ఈ టాస్కులో యష్మీ ‘ప్రేరణ’, ‘మణికంఠ’ పేర్లు ఉన్న పప్పీల బొమ్మలను పట్టుకుంటుంది. ప్రేరణ బొమ్మ పట్టుకున్నప్పుడు యష్మీ మాట్లాడుతూ ‘ఒకసారి నేను చీఫ్ అయ్యాను. ఆ సమయంలో నేను చేసిన తప్పులను సరిచేసుకోవాలి అనుకుంటున్నాను. మరోసారి కూడా నన్ను చీఫ్ ని చేస్తే నేనేంటో నిరూపించుకుంటాను’ అని అంటుంది.

    యష్మీ బొమ్మ మణికంఠ దగ్గర ఉంటుంది.అప్పుడు మణికంఠ ‘తప్పులు సరిచేసుకుంటాను అంటున్నావ్ కదా, అంటే నువ్వు చీఫ్ గా ఫెయిల్ అయ్యినట్టే కదా, మళ్ళీ నిన్ను ఎలా నమ్మాలి’ అని చెప్పి యష్మీ ని తప్పిస్తాడు. ఆ తర్వాత యష్మీ వంతు వచ్చినప్పుడు మణికంఠ ని రేస్ నుండి తప్పిస్తుంది. అప్పుడు మణికంఠ ‘నేను కూడా ఎదో ఒకరోజు చీఫ్ అవుతా’ అంటదు. అప్పుడు యష్మీ ‘అవ్వురా అవ్వు..నువ్వు ఎలా చీఫ్ అవుతావో నేను కూడా చూస్తా’ అని అంటుంది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ ప్రోమోని మీరు కూడా చూసేయండి.